మెగాస్టార్‌కి ది ప్యారడైజ్ ట్రిబ్యూట్.. చిరంజీవికి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్న నాచురల్ స్టార్..!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులు అన్న విషయం అందరికీ తెలుసు.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 1:59 PM IST

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులు అన్న విషయం అందరికీ తెలుసు. దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి జతకడుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. కేవలం దర్శకుడిగానే కాకుండా.. ఒక పక్కా చిరంజీవి ఫ్యాన్‌గా శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు అదే మాస్ ఇంటెన్సిటీతో, అంతకు మించిన వయొలెన్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇద్దరు మెగా అభిమానులు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల తన తదుపరి చిత్రాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. తన ఆరాధ్య దైవమైన చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అనేది ఏ దర్శకుడికైనా లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అయితే ఆ మెగా ప్రాజెక్ట్‌కి వెళ్ళే ముందు, తన సత్తాను బాక్సాఫీస్ సాక్షిగా నిరూపించుకోవడానికి శ్రీకాంత్ ది ప్యారడైజ్ ను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. చిరంజీవితో సినిమాకు వెళ్లే ముందు నానితో ఒక హిట్ కొట్టి వెళ్లాలన్న కసి శ్రీకాంత్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

'ది ప్యారడైజ్' సినిమాను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఒక్క రోజు ముందు ఆగస్టు 21న రిలీజ్ చేయబోతున్నారు. ఇది రిలీజ్ మాత్రమే కాదు, తమ అభిమాన హీరోకి ఇస్తున్న ఘనమైన ట్రిబ్యూట్ గా మారుతుంది. చిరంజీవి బర్త్ డే వైబ్స్, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తోడైతే ఓపెనింగ్స్ పరంగా నాని కెరీర్‌లోనే ఇది అల్టిమేట్ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. తన గురువు లాంటి హీరో పుట్టినరోజున తన సినిమాను రిలీజ్ చేయడం శ్రీకాంత్ ఓదెలకు ఒక ఎమోషనల్ మూమెంట్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ టైమింగ్ నానికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. వరుసగా మూడు వారాల పాటు ఫెస్టివల్ వీకెండ్స్ ఉండటం, సెలవుల అడ్వాంటేజ్ ఉండటం బాక్సాఫీస్ పరంగా చాలా అరుదుగా జరిగే విషయం. లాంగ్ రన్లో సినిమా నిలబడటానికి, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

ఈ అడ్వాంటేజ్‌ను కరెక్ట్‌గా వాడుకుంటే, నాని తన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. 'దసరా' 100 కోట్ల క్లబ్‌ను దాటితే, ఈ సినిమా అంతకు మించి వసూలు చేసే పొటెన్షియల్ ఉంది. మొత్తానికి 'ది ప్యారడైజ్' కేవలం ఒక సినిమాగా కాకుండా.. ఒక ఎమోషన్‌గా, బాక్సాఫీస్ సునామీగా మారేలా కనిపిస్తోంది. కంటెంట్ పరంగా శ్రీకాంత్ ఓదెల మార్క్, నటన పరంగా నాని వైవిధ్యం, వీటికి తోడు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్, మెగా ఫ్యాన్స్ సపోర్ట్... ఇవన్నీ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ. నాని కెరీర్‌లో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ ప్యారడైజ్ ఎలాంటి విస్ఫోటనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Published : 
  • 17 February 2026, 1:59 PM IST