నో పబ్లిక్.. అంతా ప్రైవేటే..!

విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి పనులో బిజీ అయిపోయారు. కానీ.. పెళ్లి చేసుకుంటామని చెప్పరు. ప్రముఖులకు వెడ్డింగ్‌ కార్డ్‌ ఇవ్వడానికి వెళ్తారుగానీ... జనరల్‌గా కలిసినట్టు కలరింగ్‌ ఇస్తారు.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 7:55 PM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి పనులో బిజీ అయిపోయారు. కానీ.. పెళ్లి చేసుకుంటామని చెప్పరు. ప్రముఖులకు వెడ్డింగ్‌ కార్డ్‌ ఇవ్వడానికి వెళ్తారుగానీ... జనరల్‌గా కలిసినట్టు కలరింగ్‌ ఇస్తారు. విజయ్‌, రష్మికల మ్యారేజ్‌ అంటూ పెళ్లి పనులు చూస్తున్న వాళ్లు చెబుతున్నా... ఈ లవర్స్‌ మాత్రం ఏమీ పట్టనట్టు ఎందుకుంటున్నారు? పెళ్లికి ఇంకా పదిరోజులే వుంది. ఎందుకంత సీక్రెట్‌?విజయ్‌ దేవరకొండ, రష్మికల లవ్‌ స్టోరీ ఇవాల్టిది కాదు. 2018లో రిలీజైన గీత గోవిందం నుంచి ప్రేమించుకుంటూనే వున్నారు. పండగలకు.. పబ్బాలకు విజయ్‌ ఫ్యామిలీతో రష్మిక వుంటుంది. హాలిడే ట్రిప్‌కు విజయ్‌ ఫ్యామిలీ వెళ్తే అందులో రష్మిక కూడా వుంటుంది. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ సినిమా ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా రష్మిక వెళ్లి నువ్వు నా ఫ్యామిలీరా అంటుంది. ఇంతలా అందరికీ అర్థమైపోయినట్టు ప్రేమించుకుంటారేగానీ.. ఆ విషయాన్ని మాత్రం బైటకు చెప్పరు. చివరికి పెళ్లికి పది రోజులు ముందు కూడా ఏడడుగులు వేస్తున్నమామని చెప్పడానికి ఇష్టపడడం లేదు.

ఆల్రెడీ జరిగిన ఎంగేజ్‌మెంట్ గురించి కూడా ఇద్దరూ ఖండించలేదు.. అవునని చెప్పకుండా మాటలు దాటేశాయరు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ కోటలో విజయ్‌దేవరకొండ, రష్మిక పెళ్లికి వెన్యూ.. ముహూర్తం ఫిక్స్‌ చేశారు. పెళ్లికి పని చేస్తున్న టెక్నీషియన్స్‌ వీళ్ల పెళ్లిని బైట పెట్టినా...లవర్స్‌ మాత్రం నో కామెంట్‌ అంటారు. విజయ్‌ ఆమధ్య తెలంగాణ సి.ఎంను కలిసినా.. జనరల్‌గా కలిశారని పిఆర్‌ టీం చెప్పిందేగానీ.. పెళ్లి పిలుపుల కోసం కాదట. 26న పెళ్లికి అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానిస్తున్ఆనరు. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌ రీసెప్షన్‌ ఏర్పాటు చేశారని.. ఇందులో సెలబ్రిటీ సినీ, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిసింది.

విజయ్‌ దేవరకొండ, రష్మిక చెప్పినా చెప్పకపోయినా..ఈనెల 26న ఈ ఇద్దరి పెళ్లి జరగడం గ్యారెంటీ. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా బైటకు చెప్పకుండా ఎందుకంత సీక్రెసీ మెయిన్‌టేన్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు.
రష్మిక నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్' సక్సెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. పెళ్లి టాపిక్‌ వస్తుందనుకుంటే.. ఆ ఊసెత్తకపోయినా.. ఎప్పుడూ లేనిది రౌడీ హీరో తన గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దిచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్‌ లాంటివాడు వుండాలని మాట్లాడింది రష్మిక. ఇలా ఒకరు చేతలతో.. మరొకరు మాటలతో హింట్‌ ఇచ్చారేగానీ.. ఎంగేజ్‌మెంట్‌ జరిగింది... త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పలేదు.
విజయ్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌గా ముద్దు ఇవ్వని రష్మిక మాటలతో నా వాడు అనిపించుకుంది. విజయ్‌ తన జీవితంలో వున్నట్టు చెప్పుకొచ్చింది. విజయ్‌ లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో వుంటే అదొక బ్లెస్సింగ్‌ అనుకోవాలని ప్రకటించింది. తన జీవితంలో అతను వున్నాడనే అర్థంలో అలా మాట్లాడింది.

ఎంగేజ్‌మెంట్‌కు ముందు..చాలా ఫ్రెండ్లీగా కనిపించిన లవర్స్‌ ది గర్ల్‌ఫ్రెండ్‌ ఈవెంట్‌లో మాత్రం... డిస్టెన్స్‌ మెయిన్‌టేన్‌ చేశారు. క్లోజ్‌గా కనిపిస్తే ఎంగేజ్‌మెంట్ అయింది.. అందుకే ఇంత క్లోజ్‌గా వున్నారని ప్రచారం చేస్తారన్న భయమో ఏమోగానీ.. లవర్స్‌ అన్న ఫీలింగ్‌ రాకుండా.. బాగా నటించారు. పెళ్లి పనులకోసం.. పది రోజుల ముందే.. ఇద్దరూ కలిసి వెళ్లకపోయినా... ఒకరి తర్వాత మరొకరు రాజస్థాన్‌ వెళ్లిన ఎయిర్‌పోర్ట్‌ విజువల్స్‌ వైరల్‌ అయ్యాయి. పెళ్లి రోజు దగ్గరపడినా.. చెప్పకుండా.. పెళ్లి పనులు చేస్తుకుంటూ.. ఇప్పటికీ నటిస్తూనే వున్నారు. పెళ్లయితే ఎలాగూ ఫొటోలు వస్తాయి కదా.. వాటితోనే సమాధానం చెబుతారేమో మరి.

 

Published : 
  • 17 February 2026, 7:55 PM IST