కల్తీ మద్యం విషయంలో ఏపీ సర్కార్, దర్యాప్తు అధికారులు సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం తయారీ కేసు నిందితుల రిమాండ్ గడువు పొడిగించింది కోర్ట్. నిందితుల రిమాండ్ గడువు మార్చి 5 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
నకిలీ మద్యం తయారీ కేసు నిందితులను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. విజయవాడ, నెల్లూరు, మదనపల్లె జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 10 మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచారు. బెయిల్‌పై ఉన్న వారితో సహా కోర్టుకు 12 మంది నిందితులు హాజరు అయ్యారు. ఇక విచారణకు హాజరు కాకుండా గైర్హాజరు పిటిషన్ దాఖలు చేసారు జోగి సోదరులు.