స్పిరిట్ కోసం రాజమండ్రి మ్యూజిక్…!

సందీప్ రెడ్డి వంగా సినిమా అంటే కేవలం వయొలెన్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ కూడా ఒక రేంజ్‌లో ఉంటుంది. ప్రభాస్‌ను మొదటిసారి పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తున్న స్పిరిట్ సినిమాలో మ్యూజిక్ బాధ్యతలు

Post Published By: dialnews
Updated : 20 February 2026, 8:50 PM IST

సందీప్ రెడ్డి వంగా సినిమా అంటే కేవలం వయొలెన్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ కూడా ఒక రేంజ్‌లో ఉంటుంది. ప్రభాస్‌ను మొదటిసారి పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తున్న స్పిరిట్ సినిమాలో మ్యూజిక్ బాధ్యతలు ఎవరికి అప్పగించారో తెల్సితే ఆశ్చర్యం కలగకమానదు. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. హర్షవర్ధన్ రామేశ్వర్ అంటే ఎవరో కాదు.. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన వ్యక్తి. సందీప్ రెడ్డి వంగాకు హర్షవర్ధన్ మీద విపరీతమైన నమ్మకం.

ముఖ్యంగా 'యానిమల్' సినిమాలో ఆయన ఇచ్చిన BGM సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. అందుకే ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ సినిమాకు కూడా ఆయననే ఎంపిక చేశాడు. హర్షవర్ధన్ మన తెలుగు వ్యక్తి, అందులో ఆయన రాజమండ్రికి చెందినవారు కావడం విశేషం. సాధారణంగా షూటింగ్ అయ్యాక BGM చేస్తారు. కానీ సందీప్ రెడ్డి వంగా స్టైల్ వేరు. 'స్పిరిట్' సినిమా షూటింగ్ మొదలవ్వకముందే హర్షవర్ధన్ రామేశ్వర్ 70 శాతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పూర్తి చేశాడు.

సెట్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ షూటింగ్ చేస్తే, నటీనటుల మూడ్ మరియు ఎమోషన్ పర్ఫెక్ట్‌గా వస్తుందని సందీప్ నమ్మకం. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉండబోతున్నాయి. అందులో ప్రభాస్ కోసం ఒక పవర్ ఫుల్ థీమ్ సాంగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం. హర్షవర్ధన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "స్పిరిట్ మ్యూజిక్ 'యానిమల్' కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది" అని చెప్పడంతో స్పిరిట్ మీద అంచనాలు మరోమెట్టుకు చేరుకున్నాయి.

Published : 
  • 20 February 2026, 8:50 PM IST