పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ‘ది హండ్రెడ్ లీగ్’-2026 వేలంలో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం ఉండబోతున్నట్లు సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా వెలుగొందుతోంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్కసారి ఆడితే ఆటగాళ్ల రాతే మారిపోతుందనేంతలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఐపీఎల్లో పది జట్లు ఉండగా.. ఇందులోని మెజారిటీ ఫ్రాంఛైజీలు విదేశీ లీగ్‌లలోనూ పెట్టుబడులు పెడుతున్నాయి. సౌతాఫ్రికా లీగ్ ‘మనోళ్ల’దే ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు రాంఛైజీలూ ఐపీఎల్ జట్ల యజమానుల చేతిలోనే ఉన్నాయి. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్, ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ కింగ్స్, పర్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్.. ఐపీఎల్‌లోని హైదరాబాద్, ముంబై, లక్నో, చెన్నై, రాజస్తాన్, ఢిల్లీ ఫ్రాంఛైజీల యాజమాన్యంలో కొనసాగుతున్నాయి.
ఇటీవల ‘ది హండ్రెడ్ లీగ్’లోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులు అడుగుపెట్టారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ఎంఐ లండన్, సదరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ లీడ్స్ వీరి చేతుల్లోనే ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్ తాజా ఎడిషన్‌కు సంబంధించి మార్చి 11న మహిళలు, మార్చి 12న పురుష ప్లేయర్ల వేలం లండన్‌లో జరగనుంది. దీని కోసం పద్దెనిమిది దేశాల నుంచి దాదాపుగా వెయ్యి మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో పాకిస్తానీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే, మాంచెస్టర్, లండన్, సదరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ యాజమాన్యాలు పాక్ క్రికెటర్లను ఎంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కింది. టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తమకోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసినా.. బంగ్లాదేశ్ కోసమంటూ భారత్‌ను నిందించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచి బహిష్కరిస్తామని తొలుత హడావుడి పలికింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది.
అయితే, అందరూ ఊహించినట్లుగానే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో యూటర్న్ తీసుకుని భారత్‌తో ఆడింది. టీమిండియా చేతిలో మరోసారి చిత్తుగా ఓడింది. ఐపీఎల్లో నిషేధంఇక ఇప్పటికే పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ క్రికెటర్లపై ఐపీఎల్లో నిషేధం విధించింది. ఇప్పుడు ఈ పీసీబీ మరింత ఓవరాక్షన్ చేసిన నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాదిరిగానే.. ది హండ్రెడ్‌లోనూ భారత్‌కు చెందిన ఫ్రాంఛైజీలు పాక్ క్రికెటర్లను సెలక్ట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో పాటు ILT20లోనూ పాక్ ప్లేయర్లపై అనధికారిక నిషేధం కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగమైన అమెరికాకు చెందిన డిజర్ట్ వైపర్స్ మాత్రమే పాకిస్తాన్‌ను కొంతమంది ఆటగాళ్లను ఎంచుకుంది.