Top story:భారత్ గ్లోబల్ పవర్.. తెరపైకి కొత్త కూటమి పాకిస్తాన్, టర్కీకి ఇక చుక్కలే…!

ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గ్లోబల్ పాలిటిక్స్‌ను శాసించే కూటమిని తెరపైకి తెచ్చారు.

Post Published By: dialnews
Updated : 24 February 2026, 11:11 AM IST

ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గ్లోబల్ పాలిటిక్స్‌ను శాసించే కూటమిని తెరపైకి తెచ్చారు. భారత్‌ను గ్లోబల్ పవర్‌గా అభివర్ణించిన నెతన్యాహు.. మిడిల్ ఈస్ట్, గ్లోబల్ పాలిటిక్స్‌ను శాసించే ఆరు దేశాల కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందన్నారు. మోడీ తన మిత్రుడని పేర్కొన్న నెతన్యాహు, మధ్యప్రాచ్యం చుట్టూ ఏర్పడబోయే కూటమిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఫిబ్రవరి 25 నుంచి ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నెతన్యాహు చేసిన ఈ కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా భారత్, ఇజ్రాయెల్ శత్రు దేశాల్లో న్యూ అలియన్స్ మోస్ట్ డిబేటబుల్ ఇష్యూగా మారిపోయింది. ఇంతకూ, మోడీ పర్యటన వేళ నెతన్యాహు తెరపైకి తెచ్చిన కొత్త కూటమి ఏంటి? ఇస్లామిక్ నాటోకు అది ఎలా చెక్ పెడుతుంది?

హెక్సాగన్.. మిడిల్ ఈస్ట్ చుట్టూ ఆరు శక్తులతో నెతన్యాహు ప్రతిపాదిస్తున్న సంచలన కూటమి ఇదే. ఈ కూటమిలో భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, మధ్యధరా దేశాలు, ఆసియాలోని ఇతర దేశాలు, ఇజ్రాయెల్ భాగస్వామ్య పక్షాలుగా ఉండబోతున్నాయి. ఇది కేవలం వాణిజ్య కూటమి కాదు. తీవ్రవాద భావజాలం కలిగిన రాడికల్ షియా, సున్నీ వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమిగా ఇజ్రాయెల్ భావిస్తోంది. 2023లో జీ-20 సదస్సు వేదికగా భారత్ 'ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరప్ ఎకనామిక్ కారిడార్'ను ప్రకటించింది. నెతన్యాహు ప్రతిపాదించిన హెక్సాగన్ వ్యూహం ఐఎంఈసీకు మరింత బలాన్ని చేకూర్చనుంది. కేవలం రైల్వే లైన్లు, ఓడరేవుల అనుసంధానం మాత్రమే కాకుండా, ఈ దేశాల మధ్య బలమైన రాజకీయ, సైనిక బంధాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెక్సాగన్ ఉద్దేశంగా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. కానీ, ఇప్పుడే హెక్సాగన్‌ కూటమిని ఎందుకు తెరపైకి తెచ్చారు?
సౌదీ అరేబియా, పాకిస్తాన్ గతేడాది సెప్టెంబర్‌లో రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి.

సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్‌పై ఏదైనా దాడి జరిగితే అది రెండింటిపై దాడిగా పరిగణిస్తామని ఆ రక్షణ ఒప్పందంలో ఉంది. ఇది నాటో ఆర్టికల్-5ను పోలి ఉంటుంది. టర్కీ కూడా సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలో చేరుతుందని ఊహాగానాలున్నాయి. పాకిస్తాన్ అణుశక్తి కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం. ఇది ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ప్రాభవాన్ని కూడా పెంచుతుందని చెబుతారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెన్నెట్ పాకిస్తాన్‌, టర్కీ నేతృత్వంలో ఇస్లామిక్ నాటో కూటమి ఆవిర్భవించబోతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే ఫ్యూచర్‌లో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చెందారు. ఇస్లామిక్ నాటో అలియన్స్ గురించి నెతన్యాహుకు కూడా ఆందోళన ఉంది. ఆమాటకొస్తే.. పాకిస్తాన్ నేతృత్వంలో ఏర్పడబోయే ఆ కూటమి గురించి భారత్‌కూ ఆందోళన ఉంది. హెక్సాగన్‌ తెరపైకి రావడానికి కారణం కూడా ఇదే. పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతల సమయంలోనూ ప్రధాని మోడీ టెల్ అవీవ్‌ పర్యటనకి వెళ్లాలనుకోవడానికీ రీజన్ ఇదే అనేవారూ ఉన్నారు. మరి ఈ కూటమి ఇస్లామిక్ నాటోకు ఎలా చెక్ పెడుతుంది?
.

హెక్సాగన్ కూటమిని ప్రధానంగా రెండు శక్తులకు వ్యతిరేకంగా రూపొందిస్తున్నారు.మొదటిది రాడికల్ షియా గ్రూప్. ఇరాన్ నాయకత్వంలోని హెజ్బుల్లా, హౌతీలు వంటి వాటికి లెక్క సరిచేయడమే దీని లక్ష్యం. రెండోది టర్కీ, పాకిస్తాన్, కొన్ని తీవ్రవాద భావజాలం ఉన్న సున్నీ గ్రూపులకు చెక్ పెట్టడం. ఇటీవల టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఒక 'ఇస్లామిక్ మిలిటరీ కూటమి' ఏర్పాటు చేయవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. నెతన్యాహు షడ్భుజి కూటమి దీనికి ఒక శక్తిమంతమైన సమాధానంగా విశ్లేషకులు చెబుతున్నారు. హెక్సాగన్‌లో మూడు రకాల రక్షణ కవచాలు ఉన్నాయి. మొదటిది భారత్, ఇజ్రాయెల్ అధునాతన రక్షణ సాంకేతికత. రెండోది ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా వ్యాపార ప్రయోజనాలు. మూడోది గ్రీస్, సైప్రస్, UAV వంటి కొన్ని అరబ్ దేశాలను కలుపుకోవడం ద్వారా అంతర్జాతీయ మద్దతును సంపాదించడం. దీనిలో భారత్ పాత్ర ఎందుకంత కీలకం అన్న ప్రశ్నకే వస్తే.. పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే, దాన్ని సమర్థంగా ఎదుర్కోగల ఏకైక దేశం భారత్ అని ఇజ్రాయెల్ నమ్ముతోంది. అంతేకాదు,భారత్‌కు అరబ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ 'ఇస్లామిక్ నాటో' వైపు వెళ్తే, భారత్ ఈ హెక్సాగన్‌ ద్వారా వారిని వ్యూహాత్మకంగా ఒంటరి చేయగలదు. అందుకే, ఇండియాను గ్లోబల్ పవర్‌ అని కీర్తించారు నెతన్యాహు. మరి ఈ పర్యటనలో హెక్సాగన్ గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

 

Published : 
  • 24 February 2026, 11:11 AM IST