స్పెషల్ సాంగ్ ఉందా? లేదా…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

Post Published By: dialnews
Updated : 24 February 2026, 12:54 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'లో అలాంటి మాస్ ఐటమ్ సాంగ్ ఉందా? లేదా? అనే దానిపై డైరెక్టర్ హరీష్ శంకర్ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. 2026 మార్చి 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో 'కెవ్వు కేక' లాంటి ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్ ఉండబోదని వినికిడి.

డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ.. "ఈ సినిమాలో ప్రత్యేకంగా ఒక ఐటమ్ సాంగ్ లేదు. కానీ, సినిమాలో ఉండే ప్రతి పాట ఒక ఐటమ్ సాంగ్ లాగే స్పెషల్ గా ఉంటుంది." అని అన్నారు. అంటే, కేవలం ఒక పాటకే పరిమితం కాకుండా, ప్రతి సాంగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేశారట. దేవి శ్రీ ప్రసాద్ తన మార్కు మాస్ బీట్స్‌తో మళ్ళీ మేజిక్ చేయబోతున్నారని ఇప్పటికే స్పష్టంగా అర్థమయింది.

ఇక రీసెంట్ గా విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట పవన్ కళ్యాణ్ 'మానరిజమ్స్' ని, ఆయన 'స్టార్‌డమ్' ని మరింత నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. యూట్యూబ్ లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. "నేను మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టినట్టే!" అనే డైలాగ్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. సినిమాలో శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరితో పవన్ కళ్యాణ్ చేసే డ్యాన్స్ నెంబర్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటాయని టాక్. ఉస్తాద్ షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

 

Published : 
  • 24 February 2026, 12:54 PM IST