Spl story: లగ్జరీ కార్లు, విల్లాలు, విరోష్ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లంటే..!

ఫేమస్ సినీ నటుల ప్రాపర్టీలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఒక సెన్సేషన్. ట్రేండింగ్ లో ఉన్న వాళ్ళ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది.

Post Published By: dialnews
Updated : 24 February 2026, 6:44 PM IST

ఫేమస్ సినీ నటుల ప్రాపర్టీలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఒక సెన్సేషన్. ట్రేండింగ్ లో ఉన్న వాళ్ళ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఇలా ఇప్పుడు రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ఆస్తుల గురించి సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అసలు ఈ ఇద్దరి ఆస్తుల వాల్యూ ఎంత..? వాళ్లకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటీ..? వాళ్ళ ఇళ్ళ విలువ ఎంత..? వ్యాపారాలు ఏంటీ..? ఒకసారి చూద్దాం.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. సౌత్ ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో ఒకరు. పుష్ప సీరీస్, యానిమల్ సినిమాలతో ఆమెకు భారీగా పాపులారిటీ వచ్చింది. ఆమె ఆస్తుల విలువ భారీగానే ఉంది. డెక్కన్ క్రానికల్ లెక్కల ప్రకారం.. రష్మిక నికర ఆస్తుల విలువ దాదాపు రూ.66 కోట్ల వరకు ఉంది. ఒక్కో సినిమాకు 4 నుంచి 8 కోట్ల వరకు ఆమె వసూలు చేస్తోంది. తర్వాతి చేసే సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాల విలువ కాస్త భారీగానే ఉంటుందని అంచనా. వ్యాపారంలో కూడా రష్మిక పెట్టుబడులు పెట్టింది. లైన్ డియర్ అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఆమె వ్యాపారాల్లో ఒకటి.

పాన్ ఇండియా హీరోయిన్ గా డామినేట్ చేస్తున్న ఈ కూర్గ్ హీరోయిన్ కు.. సొంత రాష్ట్రం కర్ణాటకతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నాయి. బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన ఇల్లు ఉంది. అలాగే హైదరాబాద్, ముంబై, గోవా, ఆమె స్వస్థలం కూర్గ్‌ లో కూడా ఆస్తులు ఉన్నాయి. ముంబైలో ఓ ఇంటికి గృహ ప్రవేశం కూడా చేసింది రష్మిక. ఇక తన సొంత ఊరు కూర్గ్ లోని విరాజ్ పేటలో.. పచ్చని అడవిలో ఆమెకు విల్లా ఉంది. దాని ధర ఏకంగా 8 కోట్లు. ప్రశాంతతను ఎక్కువగా కోరుకునే రష్మిక, అక్కడ విల్లా కట్టుకుంది.

ఇక రష్మిక కార్ల లిస్టు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుండయ్ క్రెటా కార్లు రష్మిక సొంతం. ఇక ఆమె కాబోయే భర్త విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ కూడా ఎక్కువే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతని ఆస్తులు పెరిగాయి. దీనికి కారణం అతని ప్లానింగ్. నికర ఆస్తుల విలువ రూ.66 కోట్ల నుండి రూ.70 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. లైఫ్‌ స్టైల్ ఆసియా 2023లో అతని నికర ఆస్తుల విలువ రూ.66 కోట్లు అని తెలిపారు.

డెక్కన్ క్రానికల్ లెక్కల ప్రకారం చూస్తే, 2026లో రూ.70 కోట్లు. వ్యాపార రంగంలో విజయ్ భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు విజయ్ తీసుకుంటాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం దాదాపు రూ. 40 లక్షల వరకు తీసుకునే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహ యజమాని కూడా. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ లో విజయ్‌కు దాదాపు రూ.15 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఉందట.

ఇక ఖరీదైన కార్లు కూడా అతని సొంతం. డెక్కన్ క్రానికల్ నివేదిక ప్రకారం.. బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, ఒక వోల్వో XC90, రేంజ్ రోవర్ కారు అతని సొంతం. వీటితో పాటుగా ఖరీదైన బైక్ లు కూడా విజయ్ కు ఉన్నాయి. అలాగే ఒక ప్రైవేట్ జెట్ కూడా కొనుగోలు చేసాడు. దాని ధర 30 కోట్ల వరకు ఉంటుంది. అలాగే పలు బ్రాండ్ లకు విజయ్ బ్రాండ్ అంబాసీడర్ గా ఉన్నాడు. వాటికి ఒకటి నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. రౌడీ వేర్ అనే బ్రాండ్ కూడా విజయ్ సొంతం. ఇలా ఇద్దరి ఆస్తుల విలువ రూ. 130 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

Published : 
  • 24 February 2026, 6:44 PM IST