టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మంధన మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. 2018 లో వచ్చిన గీత గోవిందం సినిమా నుంచి ప్రేమలో పడ్డ ఈ జంట.. ఈ 8 ఏళ్ళ నుంచి లైఫ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసి, కెరీర్ లో సెటిల్ అయి.. చివరకు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఉదయపూర్ లో అత్యంత గ్రాండ్ గా జరుగుతోన్న ఈ పెళ్లి వేడుకలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి పెళ్ళికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
అలాగే ఆస్తులు, పెళ్లి ఖర్చు, పెళ్లి చేసుకునే రిసార్ట్ ఖర్చు సహా అనేక విషయాలపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇదే టైం లో వైరల్ అవుతోన్న మరో టాపిక్.. వీళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత..? సాధారణంగా సినిమా వాళ్లకు ఏజ్ గ్యాప్ ఎక్కువగానే ఉంటుంది. మరి వీళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత ఒకసారి చూస్తే.. విజయ్ దేవరకొండ 9 ఆగస్టు 1989లో పుట్టాడు. అతని వయసు 36 ఏళ్ళు. అంటే 2026 ఫిబ్రవరి 26 నాటికి. ఇక రష్మిక మందన్న 5 ఏప్రిల్ 1996 పుట్టింది. ఆమె వయసు 29 ఏళ్ళు. ఏజ్ గ్యాప్ చూస్తే.. ఇద్దరి మధ్య 6 సంవత్సరాల గ్యాప్ ఉంది.
ఇక వీరి పెళ్లి జరుగుతోన్న ఐటీసీ హోటల్ చాలా కాస్ట్లీ హోటల్ గా చెప్తున్నారు. ఒక్క నైట్ కు దాదాపు 1.5 లక్షలు ఇక్కడ చార్జ్ చేస్తారట. లేక్ సిటీలో జరుగుతోన్న పెళ్ళికి మొత్తం వంద మంది అతిధులు హాజరు కానున్నారు. ఇక మెనూ కూడా కంప్లీట్ గా స్పెషల్ గా ఉండనుంది. సౌత్ ఇండియా ఫేమస్ వంటలు ఇక్కడ వండనున్నారు. అరటి ఆకులపై అక్కడ భోజనం వడ్డిస్తారట. కొబ్బరి నీళ్ల నుంచి ప్రతీ ఒక్కటి స్పెషల్ గా ప్లాన్ చేసారు.