టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఏమో గాని సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. వీరి పెళ్లిపై నేషనల్ మీడియా కూడా ఓ కన్నేసి ఉంచింది. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో నేషనల్ మీడియా సందడి చేస్తోంది. తాజాగా పెళ్లి ముహూర్తం, పెళ్ళికి వెళ్ళిన, వెళ్ళే అతిధుల గురించి ఇంట్రస్టింగ్ విషయాలు బయటపెట్టింది. రాజస్థాన్ లో లేక్ సిటీ అయిన ఉదయపూర్ లో వీరి పెళ్లి ఓ రేంజ్ లో జరగనుంది. రేపు ఉదయం ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు.
నేడు మధ్యాహ్నం నుంచే హల్దీ, మెహందీ వేడుకలు మొదలు కాగా, సంగీత్ కార్యక్రమాన్ని నైట్ నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే పెళ్లికి వెళ్ళాల్సిన వంద మంది అతిధులలో కొందరు ఇప్పటికే.. ఉదయపూర్ చేరుకున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ది గర్ల్ ఫ్రెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ అక్కడికి చేరుకున్నారు. ఇక తెలంగాణాకు చెందిన మాజీ మంత్రులు కేటిఆర్, హరీష్ రావు ఫ్యామిలీలు కూడా పెళ్ళికి వెళ్తాయి.
అలాగే ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడుకు కూడా ఆహ్వానం అందినట్లు చెప్తున్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబాని కూడా వివాహానికి హాజరు అవుతారని టాక్. ఇక పెళ్లి రేపు ఉదయం 8 గంటలకు చేసుకోనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. తెలుగు, కొడవ సంస్కృతిలో ఈ పెళ్లి జరుగుతుంది. ఇక ప్రముఖులు అందరూ అక్కడికి చేరుకోవడంతో భద్రతను కట్టుదిట్టం చేసింది రాజస్థాన్ సర్కార్. సిఆర్పీఎఫ్ పహారాలో హోటల్ ఉంది.