శివ మనసులో శృతి' మూవీతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న అందాల భామ రెజీనా కసాండ్రా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ సీనియర్ హీరోయిన్, తాజాగా బాలీవుడ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెజీనా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ ప్రయాణం గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. సౌత్ ఇండియన్ నటి కావడంతో అక్కడ తన పట్ల వివక్ష చూపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
సాధారణంగా సౌత్ వాళ్లకి హిందీ రాదని చిన్నచూపు చూస్తారు, కానీ రెజీనాకు హిందీ అనర్గళంగా వచ్చు. అయినప్పటికీ, మాటల్లోనే కాకుండా ప్రవర్తనలో కూడా తనని చాలా నీచంగా చూశారని, కొన్ని సందర్భాల్లో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ధైర్యంగా చెప్పారు. అప్పట్లో వివక్ష ఉన్నా, ఇప్పుడు 'పాన్ ఇండియా' ట్రెండ్ వల్ల భాషల మధ్య గోడలు తగ్గిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం, ప్రైమ్ వీడియోలో రాబోతున్న ఒక భారీ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో రెజీనా లీడ్ రోల్ చేస్తున్నారు. హాలీవుడ్ సిరీస్ 'మేర్ ఆఫ్ ఈస్ట్ టౌన్' స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో ఆమె ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది.
నయనతార లీడ్ రోల్ చేస్తున్న 'మూకుతి అమ్మన్ 2'లో రెజీనా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు తమిళంలో 'ఫ్లాష్ బ్యాక్' మరియు 'అనంతన్ కాడు' వంటి చిత్రాలు 2026లో విడుదల కాబోతున్నాయి." బాలీవుడ్లో సన్నీ డియోల్ సరసన నటించిన 'జాట్' మరియు నవాజుద్దీన్ సిద్దికీతో చేస్తున్న 'సెక్షన్ 108' ఆమె కెరీర్‌కి చాలా కీలకంగా మారాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రెజీనా 9 ఏళ్ల వయసులోనే టీవీ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె, నటనలో మాత్రమే కాదు.. చదువులో కూడా టాపర్. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా 'అవే', 'ఎవరు' వంటి సినిమాల్లో నెగటివ్ మరియు ఛాలెంజింగ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు.