పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అనిపించేలా వచ్చిన సినిమా ఓజీ.. ఈ మూవీతో మళ్లీ ఒకప్పటి ఖుషీ, ఒకప్పటి బద్రి మనముందుకొచ్చాడన్నారు. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ మూవీ ఒరిజినల్ గ్యాంగ్ స్టరే ఇప్పుడు తన ఉస్తాద్ భగత్ సింగ్ కి తలనొప్పిగా మారుతోందా? ఇలాంటి డౌట్ కి రీజన్ ఉస్తాద్ భగత్ సింగ్ కి అసలు ఏమాత్రం హైప్ రాకపోవటం. రీసెంట్ గా సాంగ్ వదిలితే అది కనీసం నాని మూవీ పారడైజ్ పాటతో పోటీ పడలేకపోయింది. హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ సినిమా అంటే ఎవరికైనా గబ్బర్ సింగే గుర్తొస్తుంది... డెఫినెట్ గా ఇది పవర్ ఫుల్ హిట్ కాంబినేషన్. అయినా కాని ఉస్తాద్ భగత్ సింగ్ పాటే కాదు, దాని అప్ డేట్స్ అంటే పెద్దగా బజ్ క్రియేట్ కావట్లేదు.. అంతా ఓజీ కింద ఉస్తాద్ నలిగిపోతున్నాడనంటున్నారు. నిజంగానే ఉస్తాద్ భగత్ సింగ్ ని ఓజీ ఓవర్ షాడో చేసిందా? ఏపీ పొలిటికల్ సిచ్చువేషన్ కూడా పవన్ సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తోందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొలిటికల్ గా విడిపోయారా? ఏపీ రాజకీయాల వల్ల, పవన్ పొలిటికల్ ఇమేజ్, సినిమా ఇమేజ్ ని ఓవర్ షాడో చేస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు పవర్ స్టార్ ఫ్యాన్స్ పరిస్థితి మీద ఫోకస్ చేయాల్సిందే. పవన్ మీద మాట పడితే, సోషల్ మీడియాలనే కాదు, బయట కూడా మాటల తూటాతో, కామెంట్ల వేటతో దూసుకొస్తుంది పవన్ ఫ్యాన్స్ బ్యాచ్.అలాంటి సూపర్ పవర్ ఫుల్ ఫ్యాన్స్ పవన్ సొంతం. కాని ఉస్తాద్ భగత్ సింగ్ కి మాత్రం ఇప్పుడు బజ్ రాకపోవటానికి, మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఓజీ క్రియేట్ చేసిన సూపర్ సెన్సేషన్...రెండు ఏపీ పాలిటిక్స్ వల్ల, పవర్ స్టార్ ఫ్యాన్స్ పార్టీల వారిగా కొంత విడిపోవటం, కొంత నిరుత్సాహం పడటం..మూడు పవన్ తన సినిమాల్లో తను కాకుండా డూప్స్ పెట్టి పని కానిచ్చేస్తున్నాడనే ప్రచారంతో కూడా ఫ్యాన్స్ విసిగెత్తిపోతున్నారా?
పవన్ నటించిన సినిమా బాగున్నా లేకున్నా, ఆ భారం మోసే ఫ్యాన్స్ తన సొంతం. కాని పవనే సినిమాలో లేకపోతే, ఎక్కువగా డూప్స్ తో షూటింగ్ జరిగితే.. ఇదే సమస్య హరి హర వీరమల్లు టైంలో ఎదురైంది.. అందుకే అప్పట్లో కథ, కథనాలు,మేకింగే కాదు, అసలు పవన్ లేకుండా డూప్ తో సీన్లేంటనే డిసప్పాయింట్ మెంట్ పవన్ ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపించింది.ఇక ఓజీ లో అలాంటి పరిస్తితి లేదా అంటే ఉంది... ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లో కూడా పవన్ కొన్ని సీన్లు తను లేకుండా డూప్ తో కానిచ్చేశాడు. ఇందులో విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ పరోక్షంగా, నటులు లేకుండా డూబ్స తో కలిసి నటించాల్సి వస్తోందని అన్న మాట అప్పట్లో వివాదం కూడా అయ్యింది. కాని ఇందులో కొంత నిజముంది. కాకపోతే ఓజీ పాత్ర తెగనచ్చటంతో పవన్ కూడా చాలా తక్కువ సీన్లే డూప్ తో చేయించాడని,మెజారిటీ సీన్స్ లో తనే నటించాడనంటారు.
కాని ఉస్తాద్ భగత్ సింగ్ లో మెజారిటీ సీన్స్ పవన్ డూప్ తోనటించటం వల్ల ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీ మీద క్యూరియాసిటీ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఇది కాకుండా ఓజీ మూవీ హైలీ స్టైలిష్ గా ఉండటంవల్ల, కూడా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్, సాంగ్ కూడా ఓజీ ముందు తేలిపోతున్నాయనంటున్నారు. ఇక అసలు సిసలైన విలన్ పాలిటిక్స్.. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో వైసీపీ ని ఇష్టపడే వాళ్లు కూడా ఉండటంతో, ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ లో లడ్డు వ్యవహరాం కూడా పవన్ సినిమా మీద ప్రభావం చూపిస్తోందనంటున్నారు. ఎందుకంటే అపోజిట్ పార్టీని ఇష్టపడే వాల్లలో కూడా పవన్ ఫ్యాన్స్ ఉండొచ్చు.. వాళ్లు పొలిటికల్ గా నొచ్చుకుంటే, దాని ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మీదుండొచ్చు.. కాకపోతే అదంతా తాత్కాలికమే.. ఏపీ పాలిటిక్స్ మల్లీ కాస్త సద్దు మనిగాక, సీన్ మారొచ్చు.. కాని ఉస్తాద్ భగత్ సింగ్ మీద మాత్రం బజ్ కాని హైప్ కాని పవన్ గత సినిమాలతో పోలిస్తే అంతగా క్రియేట్ కావట్లేదనంటున్నారు.