‘పంజా’ డైరెక్టర్ అక్షయ్ కుమార్ హీరోగా…!

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో 'హైవాన్' ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అటు బాలీవుడ్ లో

Post Published By: dialnews
Updated : 7 March 2026, 10:55 AM IST

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో 'హైవాన్' ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అటు బాలీవుడ్ లో, ఇటు సౌత్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు అత్యంత ప్రధాన ఆకర్షణ దీని దర్శకుడు. తమిళంలో అజిత్ తో 'బిల్లా', 'ఆరంభం', తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన విష్ణు వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు వర్ధన్ గతంలో హిందీలో 'షేర్షా' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను అందించాడు. స్టైలిష్ యాక్షన్ సినిమాలను తీయడంలో ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర ఉంది.

అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ మరియు విష్ణు వర్ధన్ మేకింగ్ తో 'హైవాన్' ఒక గ్లోబల్ లెవల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది. సోషల్ మీడియాలో వినపడుతున్న టాక్ ప్రకారం, ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్. హైవాన్' అంటే రాక్షసుడు అని అర్థం. ఇందులో అక్షయ్ కుమార్ పాత్ర చాలా అగ్రెసివ్ గా, శత్రువుల పట్ల కనికరం లేని వ్యక్తిగా ఉంటుందని సమాచారం.ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సాగే ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ అని కూడా వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా అక్షయ్ కుమార్ మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ అవతార్ లో కనిపిస్తాడట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇందులో అక్షయ్ కుమార్ సరసన ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారనే చర్చ నడుస్తోంది, సౌత్ నుండి ఒక ప్రముఖ హీరోయిన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.విలన్ పాత్ర కోసం కూడా ఒక స్టార్ హీరోని రంగంలోకి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ కు ఆశించిన విజయాలు దక్కడం లేదు. కానీ 'హైవాన్' లాంటి పక్కా యాక్షన్ సినిమాతో ఆయన మళ్ళీ ఫామ్ లోకి రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.'హైవాన్' లో ఉండే స్టంట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లు బాడీ లాంగ్వేజ్ పరంగా అక్షయ్ కుమార్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.విష్ణు వర్ధన్ టేకింగ్ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేస్తుందని అంచనా. మొత్తానికి 'హైవాన్' సినిమాతో అక్షయ్ కుమార్ తనలోని అసలైన ఖిలాడీని మళ్ళీ చూపించబోతున్నారు.

Published : 
  • 7 March 2026, 10:55 AM IST