పిఠాపురం MLA గారి తాలూకా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది.

Post Published By: dialnews
Updated : 17 March 2026, 11:50 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 'ఉప్పెన' ఫేమ్, దర్శకుడు బుచ్చిబాబు సానా తన స్పీచ్‌తో స్టేజ్‌పై పూనకాలు తెప్పించాడు. బుచ్చిబాబు మాట్లాడుతూ.. "ముందుగా ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి భక్తులకు నమస్కారం. నేను పవన్ గారికి కేవలం అభిమానిని మాత్రమే కాదు, ఆయన సినిమా చూసి దర్శకుడు అవ్వాలని కలలు కన్న కోట్లాది మందిలో ఒకడిని.

పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే వచ్చే ఆ ఎనర్జీ మరెవ్వరి దగ్గరా ఉండదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ," అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. హరీష్ శంకర్ గురించి ప్రస్తావిస్తూ.. "హరీష్ అన్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తారో మనందరికీ 'గబ్బర్ సింగ్' తోనే అర్థమైంది. పవన్ గారి బాడీ లాంగ్వేజ్‌ను, ఆయన మేనరిజమ్స్‌ను పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేయడంలో హరీష్ అన్న తర్వాతే ఎవరైనా.

ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' కేవలం సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర ఒక సునామీ కాబోతోంది. టీజర్ చూశాక నాకే మైండ్ బ్లాక్ అయింది. ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు," అని బుచ్చిబాబు పేర్కొన్నాడు. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ.. "ఈ సినిమాలో డైలాగులు థియేటర్లలో పేలుతాయి. పవన్ గారు పోలీస్ డ్రెస్ వేస్తే ఆ కిక్కే వేరు. 'భగత్ సింగ్ ఆగమనం.. బాక్సాఫీస్ విధ్వంసం' అన్నట్టుగా ఈ సినిమా ఉండబోతోంది. అభిమానులు ఏమైతే కోరుకుంటున్నారో, దానికి రెట్టింపు వినోదాన్ని హరీష్ శంకర్ ఈ సినిమాతో అందించబోతున్నారు. షూటింగ్ విజువల్స్ చూస్తుంటేనే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది," అని బుచ్చిబాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Published : 
  • 17 March 2026, 11:50 AM IST