ఫేక్ సింగ్ పవన్ కళ్యాణేనా…?

నటి పూనమ్ కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద లేదా నిగూఢమైన పోస్ట్‌లతో వార్తల్లో నిలిచే పూనమ్, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో

Post Published By: dialnews
Updated : 23 March 2026, 8:00 PM IST

నటి పూనమ్ కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద లేదా నిగూఢమైన పోస్ట్‌లతో వార్తల్లో నిలిచే పూనమ్, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా ఆమె వాడిన "ఫేక్ సింగ్" అనే పదం ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నది చర్చనీయాంశంగా మారింది.తాజాగా విడుదలైన 'ధురంధర్2' సినిమాకు సంబంధించి పూనమ్ కౌర్ ఒక పోస్ట్ చేశారు.
జస్మిత్ సింగ్ రంగీ.. ది రియల్ సింగ్, స్టోరీ ఆఫ్ రియల్ హీరో. ధురంధర్ 2 చూసేందుకు నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఏ ఫేక్ సింగ్ కూడా ఈ బాక్సాఫీస్ ముందు నిలబడలేరు అని ఆ పోస్టులో రాసుకొచ్చింది.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాల గురించి రివ్యూలు ఇచ్చే పూనమ్, ఈసారి మాత్రం బాక్సాఫీస్ రికార్డులను ప్రస్తావిస్తూనే, ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. పూనమ్ కౌర్ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే ఆయనపై పరోక్ష విమర్శలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తాజాగా ఆమె వాడిన "ఫేక్ సింగ్" అనే పదం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినదే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను పరోక్షంగా విమర్శిస్తూ ఈ విధంగా పూనమ్ కౌర్ కామెంట్స్ చేస్తుందా అనేది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్2' చిత్రంపై పూనమ్ ప్రశంసలు కురిపించారు. నిజమైన హీరోల కథలను చూడాలని, ఇలాంటి సినిమాల ముందు వేరే ఎవరూ సరితూగరని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, సినిమాను పొగుడుతూనే, పరోక్షంగా వేరొకరిని తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది.
పూనమ్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. "ఎప్పుడూ పరోక్షంగా విమర్శించడం మానుకొని, ధైర్యం ఉంటే నేరుగా మాట్లాడాలి" అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం పూనమ్ చెప్పిన దాంట్లో తప్పేముందని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి పూనమ్ కౌర్ చేసిన ఈ 'ఫేక్ సింగ్' వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. గతంలోనూ ఆమె పలువురు దర్శకులు, హీరోలపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

Published : 
  • 23 March 2026, 8:00 PM IST