Top story:దమ్ముంటే రారా, ఇరాన్ డెడ్లీ వార్నింగ్, ఇరాన్ ఈ అటాక్ చేస్తే అమెరికాకు సావే..!

నువ్వు ఒక చెంప మీద కొడితే.. నీ రెండు గూబలు గుయ్యిమంటాయి. యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటదో నీ ఊహకే వదిలేస్తున్నా.. నా సైకిల్ పంక్చర్ చేస్తే.. నీ విమానాన్నే లేపేస్తా.. సౌత్ పార్స్ మీద అటాక్ చేస్తే.. ఖతార్ గ్యాస్ ప్లాంట్ లేపేసా..

Post Published By: dialnews
Updated : 23 March 2026, 9:30 PM IST

నువ్వు ఒక చెంప మీద కొడితే.. నీ రెండు గూబలు గుయ్యిమంటాయి. యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటదో నీ ఊహకే వదిలేస్తున్నా.. నా సైకిల్ పంక్చర్ చేస్తే.. నీ విమానాన్నే లేపేస్తా.. సౌత్ పార్స్ మీద అటాక్ చేస్తే.. ఖతార్ గ్యాస్ ప్లాంట్ లేపేసా.. ఇప్పుడు పవర్ కట్ చేస్తావా..? దమ్ముంటే చెయ్యి రా చూసుకుందాం అంటుంది ఇరాన్. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అత్యంత భయంకరమైన స్టేజ్ కు, భీకరంగా మారుతోంది. ఇరాన్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ అంత ఆషామాషీ కాదు. ఇప్పటికే ఇరాన్ మొండితనం చూసిన ప్రపంచం.. లేటెస్ట్ వార్నింగ్ తో చెమటలు కక్కుతోంది.

ఇరాన్ ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్‌ను మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేస్తోంది. 'మాపై ఒక్క దాడి జరిగితే.. మీ అణు విద్యుత్ కేంద్రాలు, నీటి ప్లాంట్లను నేలమట్టం చేస్తాం' అంటూ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా యూఏఈకి ఇరాన్ ఇచ్చిన అల్టిమేటం ఏంటి? ఇరాన్ సైనిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్, ఇరాన్ యొక్క చమురు నిల్వలు లేదా మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, ఇరాన్ ఊరుకోదు.

తమపై దాడికి సహకరించే ఏ దేశాన్నైనా శత్రువుగానే పరిగణిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా వంటివి తమ మనుగడ కోసం పూర్తిగా విద్యుత్ మరియు సముద్రపు నీటిపైనే ఆధారపడతాయి. ఇరాన్ గనుక ఈ కేంద్రాలను ధ్వంసం చేస్తే, ఆయా దేశాల్లో అంధకారం నెలకొనడమే కాకుండా, తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం యుద్ధం కాదు.. ఒక దేశం యొక్క పునాదులనే కూల్చేసే వ్యూహం. ఇరాన్ చేస్తున్న ఈ హెచ్చరికల వెనుక ప్రధాన ఉద్దేశ్యం.. అమెరికాను ఒత్తిడికి గురి చేయడం.

ఇరాన్ ఇస్తున్న ఈ వార్నింగ్ లు కేవలం మాటలకే పరిమితమవుతాయా? లేక నిజంగానే గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతాయా? పరిస్థితి చూస్తుంటే అణు యుద్ధం ముంగిట ప్రపంచం నిలబడినట్లు కనిపిస్తోంది. ఇరాన్ పనులు, సిచ్యువేషన్ చూస్తుంటే.. ఇరాన్ తన పంజా విసరడానికి సిద్ధమైంది. ఇన్నాళ్లూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఇరాన్, ఇప్పుడు నేరుగా గల్ఫ్ దేశాల గొంతు పట్టుకుంటామని బెదిరిస్తోంది. ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో చూస్తే.. అమెరికా వణకడం ఖాయమే.

యూఏఈలోని ప్రఖ్యాత 'బరాకా' అణు విద్యుత్ కేంద్రం.. ఇరాన్ ఫస్ట్ టార్గెట్. దీని మీద ఏ అటాక్ జరిగినా.. అది ధ్వంసమైతే ఆ ప్రాంతమంతా రేడియేషన్ ముప్పు పొంచి ఉంటుంది. గల్ఫ్ దేశాలు ఎడారి ప్రాంతాలు కాబట్టి, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ కన్నేసింది. ఇవి ఆగితే కోట్లాది మందికి చుక్క నీరు కూడా దొరకదు. విద్యుత్ కేంద్రాలను పేల్చేయడం ద్వారా గల్ఫ్ దేశాలను అంధకారంలోకి నెట్టడం ఇరాన్ వ్యూహం. యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ రక్షణ కోసం అమెరికాపై ఆధారపడతాయి.

కానీ ఇరాన్ దగ్గర ఉన్న వేల సంఖ్యలోని డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులు నిమిషాల్లో ఈ కేంద్రాలను చేరుకోగలవు. "మా గడ్డపై మంటలు పుడితే.. మీ దేశాల్లో జీవనమే ఉండదు" అన్నది ఇరాన్ ఇస్తున్న ఇన్ డైరెక్ట్ వార్నింగ్. ఈ యుద్ధం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈ వార్త భారత్‌కు కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే.. లక్షలాది మంది భారతీయులు యూఏఈ, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. అక్కడ విద్యుత్, నీటి కేంద్రాలపై దాడి జరిగితే మన వారి పరిస్థితి ఏంటి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అలాగే చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఒకవేళ గల్ఫ్ దేశాలపై దాడులు జరిగితే, ప్రపంచ చమురు సరఫరా ఆగిపోతుంది, గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుంది. అందుకే ఇజ్రాయెల్‌ను కట్టడి చేయాలని ఇరాన్ పరోక్షంగా అమెరికాను బెదిరిస్తోంది.

Published : 
  • 23 March 2026, 9:30 PM IST