మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ పూర్తైందా? దసరా వరకు షూటింగ్ అని ఫిల్మ్ టీమే తేలుస్తుంటే, మళ్లీ షూటింగ్ అయిపోయిందా అని అడగటంలో అర్ధం లేదు.. కాని ఇదే నిజం...నిజంగానే డ్రాగన్ పూర్తైంది... కాకపోతే ఆర్టి ఫీషియల్ ఇంటెలీజెన్స్ వర్షన్ మాత్రమే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఔను ఫస్ట్ టైం ఒక మూవీని షూటింగ్ కి ముందే పూర్తి చేసిందంటే అది డ్రాగన్ టీమే అని తెలుస్తోంది. డ్రాగన్ ని రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాను షూట్ చేసే ముందు కొంత వరకు ఏఐలో తీశాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు రెండు భాగాలను కూడా ఏఐ లో పూర్తి చేశారు.. అంటే ఇదే రిలీజ్ చేస్తారా అంటే కానేకాదు.. కేవలం క్వాలిటీ చెక్ కోసం మాత్రమే అని తెలుస్తోంది. కరెక్షన్స్ కోసమే అని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు స్టోరీ బోర్డ్ వేసేవాల్లు.. ఇప్పుడు ఆ పని ఏఐ చూస్తోందా? వెండి తెరమీద డ్రాగన్ మొత్తం ఎలా ఉంటుందో సీన్ టు సీన్, షాట్ టు షాట్ ముందే రెడీ అయిపోయిందా?
డ్రాగన్ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతోంది. ఇందులో ఎలాంటి డౌట్లు లేవు... ఇది రెండు భాగాల మూవీనా? లేదంటే ఒకే భాగంలో కథలో మార్పుల వల్ల డిలే అవుతోందా ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ లుక్ కూడా రెండు సార్లు మారటం తో, రెండు పాత్రలకోసం ఇలా మ్యాన్ ఆఫ్ మాసెస్ కష్టపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలా ఆల్ మోస్ట్ అన్ అఫీషియల్ గా వస్తున్న అన్నీ వార్తలు నిజమే అనేలా సాగుతోంది డ్రాగన్ షూటింగ్. కాని ఇప్పుడు డ్రాగన్ షూటింగ్ పూర్తైందనే మాటే తూటాలా పేలుతోంది. నిజంగానే ఫిబ్రవరిలోనే డ్రాగన్ మొత్తం షూటింగ్ పూర్తైందట. అలాంటప్పుడు ఎందుకు ఫిల్మ్ టీం ఇంకా షూట్ చేస్తోంది. జోర్డాన్ లో ఎందుకు రోజుకి కోటిన్నర ఖర్చు చేసి పదిరోజుల్లో 15 కోట్లు ఖర్చు పెట్టింది? ఈ ప్రశ్నకు సమాధానమే ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో డ్రాగన్ షూటింగ్ ఎప్పుడో ఫిల్మ్ టీం పూర్తి చేసింది.
అంటే ఇదేదో థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకో, ఓటీటీ వర్షన్ కోసమో కాదు. కేవలం టోటల్ స్క్రిప్ట్ ని ముందుగా ఏఐ తో సినిమాగా మార్చి, ఫైనల్ గా అంతా ఓకే అనుకున్నాకే షూటింగ్ కి వెళ్లటం.. ఇదే ఫార్ములాతో వారణాసి టీం ముందుకెళుతోంది. మామూలుగా ఒక సెట్ వేసే ముందు దాని మినయేచర్ వేసి, ఎక్కడ ఏసీన్, ఎక్కడ ఏ షాట్ వాడాలో ముందే నిర్ణయించుకుంటారు.అప్పుడు అనవసరపు తప్పులు జరగవని ప్రీ ప్రొడక్షన్ లో చేయటం కామన్. లెజెండ్ బాపు అయితే, తన మొత్తం సినిమాను సీన్ టు సీన్, షాట్ టు షాట్ బొమ్మలేసి, ముందే సీనిమాను పేపర్ మీద రెడీ చేస్తాడు..తర్వాత దాన్నే సెట్లో షూటింగ్ సాయంతో పూర్తి చేస్తాడు.. సో ఈ పద్దతులేవి కొత్తకాదు. కాకపోతే ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ లో మొత్తం సినిమాను ముందే సీన్లు, లొకేషన్లు, సెట్లు, లైటింగ్, కాస్ట్యూమ్స్ తో సహా రెడీ చేసి కంప్లీట్ మూవీ తీయొచ్చు..
ఆ ఔట్ పుట్ విషయంలో హీరో, దర్శకుడి తో సహా అంతా చూసి, ఏమైనా మార్పులుంటే ముందే అనుకుని, ఆ మార్పులకు అనుగునంగా రియల్ లొకేషన్స్ లో సినిమా తీయొచ్చు.. మిరాయ్ మూవీకి ఇదే చేశారు.కాకపోతే కొన్ని సీన్లకే ఈ పద్దతి ఫాలో అయ్యారు. వారణాసి మూవీ లో ఆల్ మోస్ట్ గ్రాఫిక్స్ అవసరమైన సీన్లన్నీ ఇలానే ఏఐలో రెడీ చేసి, ఆ ఔట్ పుట్ ని బేస్ చేసుకుని, షూట్ చేస్తోంది రాజమౌలి టీం.ఈ విషయంలో సీన్లు, లొకేషన్స్ తో ఆగకుండా, ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు డ్రాగన్ ని పూర్తిగా ఏఐ లో రెడీ చేసేసింది ఫిల్మ్ టీం. డిసెంబర్ లోనే సగం వరకు మూవీ ఏఐలో రెడీ అయ్యిందట. దాని ఆధారంగానే డ్రాగన్ షూటింగ్ రియల్ లొకేషన్స్ లో జరుగుతోంది. మిగతా పార్ట్ ఏఐ వర్క్ కూడా లాస్ట్ మంత్ లోనే అయిపోయింది. అంటే డ్రాగన్ ఏఐ వర్షన్ వందశాతం రెడీ.. దాని ఆధారంగా, లొకేషన్లు, సీన్లు, సెట్లు అన్నీ రెడీ చేసి రియల్ వరల్డ్ లో సినిమా తీస్తోంది ఫిల్మ్ టీం. ఏఐ వర్షణ్ నచ్చే ఎన్టీఆర్ కూడా తన హెల్త్ తో రిస్క్ చేస్తూ డ్రాగన్ కోసం ఇంతకష్టపడుతున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది.. సో ఏఐ వల్ల సినిమా తీసే ముందే, మొత్తం మూవీని చూసుకునే ఛాన్స్ఉండటంతో, ఇది హీరోల కాన్ఫిడెన్స్ పెంచేందుకు బానే ఉపయోగ పడుతుందనంటున్నారు.