కాపాడు దేవర.. వాళ్ల షాక్ నుంచి కాపాడాల్సిందే…!

దేవర 670 కోట్ల వసూళ్ళు రాబట్టిన మూవీ... 1000 కోట్లతో పోలిస్తే ఈ నెంబర్ తక్కువే కావొచ్చు.. కాని రాజమౌళి సెంటిమెంట్ నుంచి ఎన్టీఆర్ ని బయట పడేసినమూవీ ఇది. ట్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి వెంటనే వచ్చిన రెండో పాన్ ఇండియా హిట్.

Post Published By: dialnews
Updated : 24 March 2026, 7:15 PM IST

దేవర 670 కోట్ల వసూళ్ళు రాబట్టిన మూవీ... 1000 కోట్లతో పోలిస్తే ఈ నెంబర్ తక్కువే కావొచ్చు.. కాని రాజమౌళి సెంటిమెంట్ నుంచి ఎన్టీఆర్ ని బయట పడేసినమూవీ ఇది. ట్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి వెంటనే వచ్చిన రెండో పాన్ ఇండియా హిట్. అప్పటి వరకు ఆచార్య డిజాస్టర్ తో డీలా పడ్డ కొరటాల శివ కూడా, ఈ సినిమాతోనే గట్టెక్కాడు.. కట్ చేస్తే, ఎన్టీఆర్ వార్ 2చేశాడు..దాని రిజల్ట్ ఎలా ఉన్నా, డ్రాగన్ తో పాన్ వరల్డ్ ఎటాక్ కి సిద్ధమౌతున్నాడు. పైప్ లైన్ లో త్రివిక్రమ్ మూవీ ఉంది. నెల్సన్ దిలీప్ సినిమాతో పాటు సందీప్ రెడ్డి కూడా స్టోరీ లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవర అవసరమొచ్చింది.. దేవర సీక్వెల్ ఉంటుందని ఎన్టీఆర్ తేల్చాడు.. కొరటాల శివ కూడా ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడు..ఐతే అనుకోని మూడు హెవీ పంచ్ లు కొరటాల శివకి తగిలాయి... మామూలు దెబ్బలు కావు.. తన ఫ్యూచరే డైలామాలో పడే పరిస్థితి వచ్చింది.. అందుకే అర్జెంట్ గా దేవరనే వచ్చి తనని కాపాడాలా? అంతగా తనకొచ్చిన సమస్యలేంటి?

దేవర సీక్వెల్ వస్తుంది.. ఉంటుంది.. ఈ మాట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు సార్లు కన్ఫామ్ చేస్తే, కళ్యాణ్ రామ్ అండ్ కో మూడు సార్లు ఫిక్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు అర్జెంట్ గా దేవర రెండో సారి రావాలి.. ఎన్టీఆర్ కి రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా హిట్ ఇచ్చిన కొరటాల శివని ఆదుకోవాలి. ఔను, డ్రాగన్ తర్వాత దేవర సీక్వెలే తెరకెక్కుతుందనే క్లారిటీతో ప్రచారం జరుగుతోంది.త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ కమిటైన మూవీ వివాదాల తర్వాత కూడా వెంటనే మొదలవ్వకపోవచ్చంటున్నారు. గాడ్ ఆఫ్ వార్ కి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. కాబట్టి డ్రాగన్ అయిపోగానే దేవర 2నే పట్టాలెక్కుతుందన్నారు. కాబట్టే కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడన్నారు. అలాంటప్పడు కొరటాల శివ ని ఆదుకునేందుకు దేవర రెండో సారి ఎందుకు ల్యాండ్ అవ్వాలనే మాట వినిపిస్తోంది.

కారణం డ్రాగన్ రెండో భాగం. జూన్ లోగా డ్రాగన్ మొదటి భాగం, దసరాలోగా రెండో భాగం పూర్తవుతుందని తెలుస్తోంది. ఒకేసారి రెండు భాగాలను షూట్ చేసి, ధురందర్ స్టైల్ ని ఫాలో అవుతోంది ప్రశాంత్ నీల్ టీం. కాని దసరా అంటే ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ సీన్ లోకి వస్తే ఎలా..? అదే టెన్షన్ కొరటాల శివకి ఉందా?అందుకే నటసింహం బాలయ్యని కలిసి కథ చెప్పాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా స్టోరీ లైన్ అందించాడా? విచిత్రం గా నాగచైతన్య కు కూడా కథ చెప్పి ఒప్పించలేకపోయాడా? ఇలా ఒకటి కాదు రెండు కాదు, ముచ్చటగా మూడు దెబ్బలు తగిలినట్టున్నాయి.. అసలే ఆచార్య ప్లాప్ తర్వాత దేవరతో అతి కష్టం మీద గట్టెక్కాడు కొరటాల శివ. అలాంటి తను పాన్ ఇండియా లెవల్లో దేవర 2 తీసీ, తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.

కాని ఎన్టీఆర్ కమిట్మెంట్స్ వల్ల, లెక్కలు మారుతున్నాయి. దేవర 2 వెంటనే చేస్తా అని తారక్ మాటిచ్చినా, త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ లకు అంతకంటే ముందే మాటిచ్చాడు. కాబట్టి, వాటిలో ఏది ముందు కెళ్లినా, కనీసం రెండేళ్లవరకు కొరటాల శివకి దేవర 2 తీసే ఛాన్స్ రాదు.. అలా చూస్తే ప్రభాస్, మహేశ్, బన్నీ, చరణ్ ఎవరూ కొరటాల శివకి కొన్నలేళ్ల వరకు అందుబాటులో ఉండరు. బాలయ్య, పవన్ తో ప్రాజెక్ట్స్ ఓకే కాలేదు. నాగచైతన్య సైతం ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టే దేవర2 ఎట్టి పరిస్థితుల్లో పట్టాలెక్కడ కొరటాలకు చాలా అవసరం.. అందుకే తనని కాపాడేది మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరే.. అందుకే దేవర 2 విషయంలో మరింతగా ప్రయత్నాలు పెంచేస్తున్నాడట కొరటాల శివ. అందులో భాగంగానే దేవర2 కోసం గతంలో తీసిన ఫుటేజ్ తో గ్లింప్స్ రిలీజ్ చేస్తే తన ప్రాజెక్ట్ లైన్ లో ఉంటుందనే , ఆ ప్రయత్నాలు పెంచుతున్నట్టు తెలుస్తోంది.

Published : 
  • 24 March 2026, 7:15 PM IST