Top story:రండ్రా, 10 లక్షల మందితో ఇరాన్ రెడీ… భారీ సైన్యంతో ఇరాన్ ‘మహా యుద్ధం’…!

ఇప్పటిదాకా ప్రపంచం చూసింది కేవలం మిస్సైల్స్ యుద్ధం మాత్రమే.. ఆకాశం నుంచి పడే క్షిపణులు, డ్రోన్ల దాడులు ఒక ఎత్తు.. కానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలవ్వబోతోంది. అవును.. ఇరాన్ ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో నేరుగా తలపడటానికి,

Post Published By: dialnews
Updated : 28 March 2026, 9:06 AM IST

ఇప్పటిదాకా ప్రపంచం చూసింది కేవలం మిస్సైల్స్ యుద్ధం మాత్రమే.. ఆకాశం నుంచి పడే క్షిపణులు, డ్రోన్ల దాడులు ఒక ఎత్తు.. కానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలవ్వబోతోంది. అవును.. ఇరాన్ ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో నేరుగా తలపడటానికి, భూతల యుద్ధంలో శత్రువుని మట్టికరిపించడానికి ఇరాన్ సర్వం సిద్ధం చేసుకుంది. ఏకంగా 10 లక్షల మంది యోధులను యుద్ధ క్షేత్రంలోకి దింపింది. ఇది కేవలం హెచ్చరిక కాదు.. అమెరికాకు ఇరాన్ రాస్తున్న మరణశాసనం అంటున్నారు నిపుణులు.

ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ తన సైనిక బలగాలను భారీగా మోహరించింది. సుమారు 10 లక్షల మందికి పైగా సుశిక్షితులైన సైనికులు ఇప్పుడు సరిహద్దుల్లో కాపుకాస్తున్నారు. ఇందులో రెగ్యులర్ ఆర్మీతో పాటు, ప్రాణాలకు తెగించి పోరాడే 'బాసిజ్' వాలంటీర్లు కూడా ఉన్నారు. వీళ్లంతా సాధారణ సైనికులు కాదు.. తమ దేశంపైకి శత్రువు అడుగుపెడితే, ఆ శత్రువుకు సమాధి కట్టేదాకా నిద్రపోని మొండి ఘటాలు. అమెరికా టెక్నాలజీతో కొట్టొచ్చు.. కానీ ఇరాన్ గుండె ధైర్యాన్ని కొట్టడం సాధ్యమేనా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

అమెరికా సైన్యం విమానాల్లో వచ్చి బాంబులు వేసి వెళ్ళిపోవచ్చు.. కానీ ఇరాన్ గడ్డపై కాలు పెడితేనే అసలైన నరకం కనిపిస్తుంది. ఇరాన్ భౌగోళిక పరిస్థితి అమెరికాకు పెను సవాల్. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయల మధ్య దాగి ఉన్న ఇరాన్ సైన్యం.. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన వారు. 10 లక్షల మంది సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడితే, అత్యాధునిక టెక్నాలజీ ఉన్న అమెరికా సేనలు కూడా బెంబేలెత్తక తప్పదు. ఇది టెక్నాలజీకి, తెగువకు మధ్య జరగబోయే మహా సంగ్రామం.

ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. కేవలం దూరంగా ఉండి క్షిపణులు విసరడమే కాదు.. శత్రువు గుండెల్లోకి చొచ్చుకెళ్లి పోరాడటానికి సిద్ధమైంది. సరిహద్దుల వెంట కిలోమీటర్ల మేర సైన్యాన్ని మోహరించింది. "మేము ఎవరి మీదకూ యుద్ధానికి వెళ్ళం.. కానీ మా దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే, వాళ్లని భూస్థాపితం చేస్తాం" అని ఇరాన్ సైనిక కమాండర్లు గర్జిస్తున్నారు. ఈ 10 లక్షల సైన్యం కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు.. అవసరమైతే విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం.

అమెరికా తన నౌకలను, విమానాలను మోహరించొచ్చు.. కానీ ఇరాన్ దగ్గర ఉన్న ఈ 'మిలియన్ మ్యాన్ ఆర్మీ'ని ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలను మట్టికరిపించింది ఇరాన్. టెహ్రాన్‌కు చెందిన 'తస్నిమ్' వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న సైనిక నియామక కేంద్రాలు ఇప్పుడు జనసందోహంతో నిండిపోయాయి. దేశం పిలుపునివ్వడమే ఆలస్యం.. వేల సంఖ్యలో యువ వాలంటీర్లు యుద్ధ క్షేత్రానికి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు.

అమెరికా తన దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని అనుకుంటే అది పగటి కల మాత్రమే. ఇరాన్ నేల మీద ఉన్న ప్రతి అంగుళం అమెరికా సైన్యానికి ఒక సమాధిలా మారబోతోందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. మరోవైపు, అమెరికా కూడా తన పావులు కదుపుతోంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో వేల సంఖ్యలో మెరైన్‌లు సిద్ధంగా ఉండగా.. అమెరికా గర్వకారణంగా చెప్పుకునే అత్యున్నత శ్రేణి '82వ ఎయిర్‌బోర్న్ డివిజన్' దళాలు కొద్ది రోజుల్లోనే ఇక్కడ దిగబోతున్నాయి.

అగ్రరాజ్యం భయంకరమైన యుద్ధానికి స్కెచ్ వేస్తోంది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల గురించి మాట్లాడుతున్నప్పటికీ.. ఇరాన్ మాత్రం తన మొండితనాన్ని వీడటం లేదు. వాషింగ్టన్ నుంచి వచ్చే ఏ దౌత్యపరమైన ప్రతిపాదననైనా టెహ్రాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. "మాకు చర్చలు వద్దు.. యుద్ధమే సమాధానం" అనే రేంజ్ లో ఇరాన్ ఆన్సర్ ఇస్తోంది. ఇప్పుడు అమెరికాకు కూడా అదే గతి పడుతుందా..? ఇరాన్ దమ్ము ఏంటో ప్రపంచం చూడబోతోందా..? ఈ యుద్ధం ప్రపంచ గమనాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి. ఇరాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో అమెరికా భయపడుతున్న సంకేతాలు కూడా వస్తున్నాయి.

Published : 
  • 28 March 2026, 9:06 AM IST