మాస్టర్ ప్లాన్ తో ఇరాన్ డైలీ ఇన్కం రూ. 1100 కోట్లా..? చీకట్లో చమురు రవాణా…!

ప్రపంచం మొత్తం చమురు ధరలు పెరిగిపోతాయని వణికిపోతుంటే.. ఒక దేశం మాత్రం రోజుకు వేల కోట్లు గడిస్తోంది. అవును.. హర్మూజ్ జలసంధి  యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ఇరాన్ ఖజానా మాత్రం కళకళలాడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ రోజుకు 139 మిలియన్ డాలర్లు..

Post Published By: dialnews
Updated : 28 March 2026, 10:20 AM IST

ప్రపంచం మొత్తం చమురు ధరలు పెరిగిపోతాయని వణికిపోతుంటే.. ఒక దేశం మాత్రం రోజుకు వేల కోట్లు గడిస్తోంది. అవును.. హర్మూజ్ జలసంధి  యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ఇరాన్ ఖజానా మాత్రం కళకళలాడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ రోజుకు 139 మిలియన్ డాలర్లు.. అంటే మన భారత కరెన్సీలో దాదాపు 1100 కోట్ల రూపాయలకు పైగా కేవలం చమురు అమ్మకాల ద్వారా సంపాదిస్తోంది. అసలు ఈ సంక్షోభం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి..? ప్రపంచం మొత్తం చమురు ధరలకి భయపడుతుంటే, ఇరాన్ కి ఇది ఎలా వరంగా మారింది?“హర్మూజ్ జలసంధి”.. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా దీనిదే. ఇది మూతపడితే ప్రపంచం అంధకారంలోకి వెళ్తుంది. ఈ కీలకమైన ప్రాంతాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించినప్పటి నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరగడం ఇరాన్‌కు వరంగా మారింది. ఆంక్షలు ఉన్నప్పటికీ, రహస్య మార్గాల ద్వారా ఇరాన్ తన చమురును విక్రయిస్తూ భారీగా లాభపడుతోంది. రోజుకు 139 మిలియన్ డాలర్ల ఆదాయం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ఆదాయమే ఇరాన్ సైనిక శక్తికి, వారి మొండితనానికి ప్రధాన బలం.

ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర పెరగడం ఇరాన్ కి జాక్‌పాట్ లా తగిలింది. అమెరికా ఎంత అడ్డుకున్నా, ఘోస్ట్ ఫ్లీట్స్ అంటే.. గుర్తు తెలియని నౌకలు ద్వారా ఇరాన్ తన చమురును చైనా వంటి దేశాలకు తరలిస్తోంది. హర్మూజ్ జలసంధిలో టెన్షన్ పెరిగిన ప్రతిసారీ ఆయిల్ రేట్లు పెరుగుతాయి.. ఆ రేట్లు పెరిగిన ప్రతిసారీ ఇరాన్ ఖజానా నిండుతుంది. అంటే అక్కడ గొడవ జరిగితే లాభపడేది ఇరానే.హర్మూజ్ జలసంధి.. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఒక చిన్న సముద్ర మార్గం. కానీ ప్రపంచం వాడే ఆయిల్‌లో 20 శాతం ఇక్కడి నుంచే వెళ్ళాలి.

ఇరాన్ ఈ దారిని మూసివేస్తామని చిన్న హెచ్చరిక చేసినా చాలు.. ప్రపంచ మార్కెట్ షేక్ అవుతుంది. ఇరాన్ కి తెలుసు.. ఈ దారిని తన కంట్రోల్‌లో ఉంచుకుంటే ప్రపంచ దేశాలు తన కాళ్ల దగ్గరికి వస్తాయని. ఈ పవర్‌తోనే ఆంక్షలను తుంగలో తొక్కి రోజుకు 139 మిలియన్ డాలర్లు వెనకేస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఇరాన్ సంపాదన పెరగడం అంటే మన జేబులకి చిల్లు పడటమే.ఇరాన్ తన చమురును భారీ రేట్లకి అమ్ముతుంటే, దాని ప్రభావం ఇండియా లాంటి దేశాల మీద పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ సంక్షోభాన్ని ఒక వెపన్‌లా వాడుకుంటోంది. ఈ 1100 కోట్ల సంపాదనతో ఇరాన్ తన సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఆంక్షలు పని చేయవు.. బెదిరింపులు ఆగవు. ఇరాన్ ఆయిల్ వేట ఇలాగే కొనసాగితే ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయం. మరి ఇరాన్ దూకుడుని అగ్రరాజ్యాలు ఆపగలవా? లేక చమురు సెగతో ప్రపంచం మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందా? చూడాలి.

Published : 
  • 28 March 2026, 10:20 AM IST