40% finish… 2వ డ్రాగన్ నిర్ణయంతో…!

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ 70 నుంచి 80 శాతం పూర్తైందని వార్తలొచ్చాయి. తీరా చూస్తే 40శాతం షూటింగ్ మాత్రమే పూర్తైందట. ఇంకా 60శాతం పూర్తికాలేదు. డెఫినెట్ గా ఇది ఫ్యాన్స్ కంగారు పడాల్సిన విషయమే.. కాని ఇక్కడే ఈ ప్రాజెక్టులో ట్విస్ట్ ఫ్యాన్స్ కి సూపర్ మాస్ పండగని తీసుకొస్తోంది. ఫుల్ మీల్స్ ని రెడీ చేస్తోంది. అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు.. పరోక్షంగా ప్రశాంత్ నీల్ టీం లైన్ […]

Post Published By: dialnews
Updated : 28 March 2026, 3:34 PM IST

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ 70 నుంచి 80 శాతం పూర్తైందని వార్తలొచ్చాయి. తీరా చూస్తే 40శాతం షూటింగ్ మాత్రమే పూర్తైందట. ఇంకా 60శాతం పూర్తికాలేదు. డెఫినెట్ గా ఇది ఫ్యాన్స్ కంగారు పడాల్సిన విషయమే.. కాని ఇక్కడే ఈ ప్రాజెక్టులో ట్విస్ట్ ఫ్యాన్స్ కి సూపర్ మాస్ పండగని తీసుకొస్తోంది. ఫుల్ మీల్స్ ని రెడీ చేస్తోంది. అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు.. పరోక్షంగా ప్రశాంత్ నీల్ టీం లైన్ లో ఉన్నది ఒక్క డ్రాగన్ కాదు రెండు డ్రాగన్స్ అని తేల్చేస్తుున్నాడు.. అంటే మూవీలో ఇద్దరు డ్రాగన్స్ గా ఎన్టీఆర్ కనిపించటం కాదు.. రెండు భాగాలుగా ఈ మూవీ వస్తోందని కన్పామ్ అవటం.. అసలే దేవర స్టైల్లో డ్యూయెల్ రోల్ వేస్తున్న ఎన్టీఆర్, రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 90 రోజుల కండీషన్ పెట్టాడు. 90 రోజుల గ్యాప్ లో రెండు సినిమా లతో దాడికి డ్రాగన్ రెడీ అవుతున్నట్టున్నాడు.. ఇంతకి ఇది ఎప్పుడు అఫీషియల్ గా కన్ఫామ్ అవుతుంది..? టీజర్ తో ట్విస్ట్ లన్నీంటికి బ్రేకులు పడుతాయా?

జస్ట్ ఇమాజిన్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ సంక్రాంతికి వచ్చి, తర్వాత ఉగాదికి దాన సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా ధురందర్ 1 వచ్చిన కొంత గ్యాప్ కే ధురందర్ 2 వచ్చినట్టే డ్రాగన్ రెండు భాగాలు కొంత గ్యాప్ తో వస్తే ఇక పూనకాలే.. ఐతే డ్రాగన్ రెండు భాగాలనేది మొన్నటి వరకు ప్రచారమే అన్నారు. దాన్ని ఇప్పుడెలా కన్పామ్ చేస్తారంటూ ప్రశ్నలు ఎదురౌతున్నాయి. వాటికే ఫిల్మ్ టీం పరోక్షంగా సమాధానం చెబుతోంది.
అందుకే ఈ సినిమా 40శాతం షూటింగ్ వార్త వైరలైంది. ఔను ఎప్పుడో షూటింగ్ మొదలు పెడితే, ఇంకా 40శాతం మాత్రంమే డ్రాగన్ పూర్తవటమేంటి? అంటే ముందు కొంత షూట్ చేసి, తర్వాత కథ మార్చి మళ్లీ షూటింగ్ చేయటం వల్లే ఇలా షూటింగ్ డీలే అయ్యిందా అన్నా డౌట్లు కూడా ముందు పెరిగాయి. తర్వాతే డ్రాగన్ స్ట్రాటజీ షాక్ ఇస్తూనే కిక్ ఇవ్వటం మొదలు పెట్టింది.

నిజానికి ఈ పాటికే డ్రాగన్ షూటింగ్ పూర్తవ్వాలి..ముందు అనుకున్న రిలీజ్ డేట్ ప్రకారం చూస్తే ఏప్రిల్ లో రిలీజ్.. కనీసం వాయిదా పడిన డేట్ జూన్ లో అయినా ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే, కనీసం ఈ పాటికి షూటింగ్ అయిపోయి ఉండాలి.. కాని 40శాతమే డ్రాగన్ షూటింగ్ పూర్తవటం వెనకున్నరీజన్, సీక్వెల్ ప్లానింగే అని కన్ఫామ్ అవుతోంది.ముందు నెగెటీవ్ ప్రచారం చేసినట్టు, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ చేసినట్టు కథలో మార్పులో, మరో అంశమో ఈ సినిమా షూటింగ్ ని డిలే చేయలేదని తెలుస్తోంది. ఒక భాగంగా ప్లాన్ చేసిన డ్రాగన్ మూవీని, తర్వాత రెండు భాగాలుగా ప్లాన్ చేయటం వల్లే, కొంత టైం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక రెండు పాత్రలకోసం డైట్ ప్లాన్ కూడా మారటంతో కూడా ఇలా కూడా ఎన్టీఆర్ టైం తీసుకోవాల్సి వచ్చిందట.

అలాచూసినా కథకోసమో, పాత్రలో మార్పులకోసమో టైం తీసుకున్నారంటే, జరిగిన ప్రచారం నిజమే అనుకోవాలి. కాని అందులో కూడా వాస్తవం లేదని అనుకోడానికి రీజన్ రెండో డ్రాగన్. జోర్డాన్, ఆఫ్రికాలో కొన్ని లొకేషన్ లు సీక్వెల్ తాలూకు షూటింగ్ ని కూడా చేయాల్సి వచ్చిందట. డ్రాగన్ 1 మూవీ షూటింగ్ 40శాతమే అయినా, రెండో డ్రాగన్ షూటింగ్ 25 శాతం పూర్తైందని తెలుస్తోంది.అంటే ఒకరకరంగా ఒకే సారి రెండు భాగాల షూటింగ్స్ ని ప్యార్ లల్ గా తీస్తున్నట్టే.. ఈ మూవీలో ఒక్కో పాత్ర కోసం ఒక్కో లా సన్నబడ్డ ఎన్టీఆర్, ఇలా సీక్వెల్ కోసం మళ్లీ మల్లీ లుక్ మార్చుకోవటం కష్టం.. అందుకే ఒక లుక్ తో రెండు భాగాల్లో సీన్లు తీసి, మరో లుక్ తో మిగతా పార్ట్ షూటింగ్ చేస్తున్నారట. అందుకే డ్రాగన్ 40శాతం షూటింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డ్రాగన్ 2 షూటింగ్ కూడా కొంతవరకు జరగటం చూస్తుంటే, ఇది మరో ధురంధర్ ఫ్రాంచైజీలా మారేలా ఉంది.

Published : 
  • 28 March 2026, 3:34 PM IST