రెబల్ రికార్డు బ్రేక్.. 10 ఏళ్ల రికార్డు పదిలమేనా…!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికీ పాన్ ఇండియా కింగ్ గా కంటిన్యూ అవటానికి రీజన్ 5 పాన్ ఇండియా హిట్లనంటారు. కాని అసలు రీజన్ మాత్రం బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డే.. ఆ మూవీ వచ్చి పదేళ్లవుతోంది. అయినా ఇంతవరకు ఆ సినిమా క్రియేట్ చేసి కొన్ని రికార్డులని మరే మూవీ బ్రేక్

Post Published By: dialnews
Updated : 30 March 2026, 6:50 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికీ పాన్ ఇండియా కింగ్ గా కంటిన్యూ అవటానికి రీజన్ 5 పాన్ ఇండియా హిట్లనంటారు. కాని అసలు రీజన్ మాత్రం బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డే.. ఆ మూవీ వచ్చి పదేళ్లవుతోంది. అయినా ఇంతవరకు ఆ సినిమా క్రియేట్ చేసి కొన్ని రికార్డులని మరే మూవీ బ్రేక్ చేయలేదు. కనీసం దాని దరిదాపుల్లోకి వెళ్లలేదు.. ఐతే బాహుబలి 2 రికార్డుని రీచ్ అయ్యే ప్రయత్నం మాత్రం ఒకరికి కుదిరేలా ఉంది. ధురందర్ 2 మూవీ ఆల్రెడీ కల్కీ రికార్డుని బ్రేక్ చేసిందంటున్నారు. కాకపోతే బాహుబలి 2 రికార్డు మాత్రం ఇంకా పదిలమే..మరి అది బ్రేక్ అవుతుందా? అమెరికాలో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డుని బ్రేక్ చేయటమో, రీచ్ అవటంమో చేయాలంటే పదేళ్ల టైం పడుతుందా? ఇంతకి ఏంటా రికార్డు?

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ రికార్డుని ధురందర్ సీక్వెల్ బ్రేక్ చేసింది. అది కూడా యూఎస్ లో .. ఇది నిజంగా షాకింగ్ న్యూసే.. ఎందుకంటే కల్కీ యూఎస్ లో రాబట్టిన 18 మిలియన్ల వసూళ్లని ఏ హిందీ మూవీ కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయింది. కాని ధురందర్ 1200 కోట్ల రాబట్టినా అది జరగలేదు. కాని దాని సీక్వెల్ వచ్చి షాక్ ఇస్తోంది.ధురందర్ 2 విడుదలైన వన్ వీక్ లో వెయ్యికోట్లు వరల్డ్ వైడ్ గా రాబట్టడమే కాదు. అదే వన్ వీక్ లో 20 మిలియన్ డాలర్లు రాబట్టి, కల్కీ తాలూకు యూఎస్ రికార్డుని బ్రేక్ చేసింది. యూఎస్ లో 20 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అంటే వన్ వీక్ లో 160 కోట్లు రాబట్టి నిజంగా షాక్ ఇస్తోంది ధురందర్ 2.. ఇంతరవకు బానే ఉంది.. కాని బాహుబలి 2 రికార్డు పరిస్థితేంటి?

1850 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఇంతవరకు ఏ సినిమా టచ చేయలేదు. దంగర్ 2 వేల కలెక్ష్సన్స్ లో 800 కోట్లు మాత్రమే వరల్డ్ వైడ్ గా వచ్చాయి.. ఒక్క చైనా వసూళ్ళే 1200 కోట్లు.. అలా ఓవరాల్ గా దంగలే నెంబర్ వన్ అయినా.. చైనా కలెక్షన్స్ పక్కన పెడితే, వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ తో బాహుబలి 2నే ఇప్పటికి టాప్ ప్లేస్ లో ఉంది.ఇక యూఎస్ కలెక్షన్స్ చూస్తే 22 మిలియన్ డాలర్స్ తో ఇప్పటికీ బాహుబలి 2 నే నెంబర్ వన్.. సో దాన్ని ధురందర్ 2 బ్రేక్ చేస్తుందా అంటే, ఎవరైనా చాలా ఈజీ అనేయొచ్చు.. కాని అక్కడే ఇబ్బందులు ఎదురౌతాయి... ధురందర్ 2 బానే ఆడింది.. ఆడుతోంది. కాని రిలీజై 9 రోజులు గడుస్తోంది.. యూఎస్ లో ఆల్రెడీ ఇండియన్స్ 80 శాతం వరకు చూసేసినట్టు నెంబర్స్ చెబుతున్నాయి.

సో మిగతా 20శాతం ఎన్నారైలు చూస్తారా? వాళ్లు చూసినా 22 మిలియన్స్ దాటుదాయా అంటే, కష్టమే.. ఎందుకంటే, యూఎస్ లో సెటిలైన ఎన్నారైల నెంబర్స్ ప్రతీ ఏడాది స్థిరంగా ఉంటుంది. కాని అక్కడికెళ్లి చదువుకునే ఇండియన్స్ నెంబర్సే లక్షల్లో మారుతాయి.. సో వాళ్ల నెంబర్స్ తగ్గాయంటే, యూఎస్ లో ఇండియన్ మూవీ వసూళ్లు కూడా తగ్గే ఛాన్స్ఉంది. అదే కాదు యూఎస్ లో ఏ మూవీ రిలీజ్ అయినా, ఆ ఊపు మొదటి ఐదు లేదంటే 7 రోజులుండటమే ఎక్కువ.. తర్వాత ఆ జోరు తగ్గుతుంది. అలాకాకుండా నెలరోజులకు పైగా యూఎస్ ని కుదిపేసిన మూవీ అంటే బాహుబలి 2నే.. అందుకే దాని రికార్డుని ధురందర్ 2 టచ్ చేసేంత ధూరంలోనే ఉన్నా, 20 మిలియన్లు ఈజీగానే వచ్చినా, మిగతా 2 మిలియన్స్ రావటం అంత ఈజీ కాదంటున్నారు.

Published : 
  • 30 March 2026, 6:50 PM IST