“పంచముఖ”.. ఇదెక్కి మాస్ ట్విస్ట్.. ఇకఫూనకాలే…!

పంచముఖాలతో దేవుడి విగ్రహాలు కామన్.. ఐతే ఇప్పుడు పంచముఖ హీరోయిజం చూడబోతున్నామా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో హీరో వేసే పాత్రమీద చాలా ప్రచారాలున్నాయి.

Post Published By: dialnews
Updated : 30 March 2026, 7:15 PM IST

పంచముఖాలతో దేవుడి విగ్రహాలు కామన్.. ఐతే ఇప్పుడు పంచముఖ హీరోయిజం చూడబోతున్నామా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో హీరో వేసే పాత్రమీద చాలా ప్రచారాలున్నాయి. గాడ్ ఆఫ్ వార్ గా లార్డ్ సుబ్రహ్మణ్యం ఆదారంగా ఈ కథ రెడీ అయ్యిందన్నారు. ఇంతకి హీరోది దేవుడి పాత్రా అంటే కానే కాదు.. అలాని నార్మల్ హ్యూమన్ రోలా అంటే అది కూడా కానేకాదంటున్నారు. పంచముఖాలతో ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉంటుంది.. ఒకసారి ఊహించుకోండి... ఇప్పుడు ఎన్టీఆర్ ని గాడ్ ఆఫ్ వార్ లో చూపించేందుకు 150 లుక్స్ రెడీ చేసిన త్రివిక్రమ్, అందులో ఈ లుక్ ని కూడా ఉంచాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పిడిది హాట్ టాపిక్ అయ్యింది. ఒకే వ్యక్తికి ఐదు ముఖాలా? అంటే ఐదు పాత్రల్లో కనిపిస్తాడా ? ఈ రెండీంట్లో మొదటి ప్రశ్నే నిజమయ్యేలా ఉంది. ఆలెక్కన ఎన్టీఆర్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడనే ప్రచారమే నిజమయ్యేలా కనిపిస్తోంది.. ఇంతకి ఏదినిజం?

డ్రాగన్ తర్వాత దేవర 2 ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ లో ఐదు కోణాలను వాడుకోబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. గాడ్ ఆఫ్ వార్ కథ విషయంలో జరిగిన వివాదం అటుంచితే, ఎన్టీఆర్ తో ఐదు పాత్రలు వేయించబోతున్నాడు త్రివిక్రమ్. ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ప్రచారం.ఆంద్రావాల నుంచి అదుర్స్ వరకు, దేవర నుంచి డ్రాగన్ వరకు డ్యూయెల్ రోల్ లో కనిపించిన ఎన్టీఆర్ జైలవకుశ లో 3 పాత్రలు వేశాడు.అందులో ఒకటి నెగెటీవ్ రోల్ కూడా... ఐతే గాడ్ ఆఫ్ వార్ మూవీలో మాత్రం ఎన్టీఆర్ వేసేది ఐదు పాత్రలు.. అలాని ఐదుగురు ఎన్టీఆర్స్ ఉంటారనుకుంటే అది కూడా నిజం కాదు.. అక్కడే కథలో భారీ ట్విస్ట్ ఉండేలా ఉంది. లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా తెరకెక్కే కథలో, ఎన్టీఆర్ పాత్ర పంచముఖ అనంటున్నారు. అంటే ఐదు ముఖాలుండటం..

ఇది పాత్ర పేరో లేదంటే, అలాంటి లుక్ చూసి అలా అంటున్నారో కాని, ఇప్పుడీ లుక్ తో పోస్టర్ వస్తే ఎలా ఉంటుంది. ఆ ప్రయత్నాల్లోనే త్రివిక్రమ్ టీం ఉంది. ఎన్టీఆర్ రెండు చేతులు, రెండు కాల్లు కాని ఐదు ముఖాలు.. ఇది తన కొత్త మూవీ తాలూకు సరికొత్త లుక్. ఏకంగా 150 లుక్స్ తో హీరో పాత్రని డిజైన్ చేయించాడట త్రివిక్రమ్. విషయం ఏంటంటే, తమిల్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం 83 లుక్స్ ని దర్శకుడు డిజైన్ చేయించాడు.దానికంటే రెండు రెట్లు ఎన్టీఆర్ పాత్ర కోసం త్రివిక్రమ్150 లుక్స్ ప్లాన్ చేశాడు. అదే వార్తనుకుంటే, ఇప్పుడు అంతకుమించి మరో ప్రచారం షాక్ ఇస్తోంది. అదే పంచముఖ పాత్ర.. ఐదు ముఖాలతో ఎన్టీఆర్ లుక్ ని చూసిన టీం పుణ్యమాని, ఇండస్ట్రీలో ఇప్పడీ ప్రచారం షాక్ వేవ్ ని క్రియేట్ చేస్తోంది. ఏదో ఒక బాడీకి ఐదు తలలు పెట్టడం కాకుండా, పది తలల రావణాసుడి లుక్ కి సగం వర్షన్ లా ఈ పాత్ర లుక్ ఉందట.కాకపోతే ఒకే వ్యక్తికి ఐదు తలలు అది హీరో పాత్రకి అనగానే పాత్రతోనే ఇదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందంటున్నారు. కేవలం పోస్టర్ కోసం ఇలా చేస్తున్నారా? లేదంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిగా ఎన్టీఆర్ ఐదు పాత్రల్లో ఒకే వ్యక్తిగా కనిపిస్తాడా అన్నది, లుక్ అఫీషియల్ గా రివీల్ అయితేనే చెప్పొచ్చు.

Published : 
  • 30 March 2026, 7:15 PM IST