టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ.. 'పుష్ప 2' సృష్టించిన సునామీని తిరిగి తీసుకురాగల మొనగాడు ఎవరు అని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియాను షేక్ చేస్తే, ఇప్పుడు ఆ రికార్డుల కోటను బద్దలు కొట్టడానికి తన్ని బావ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న "పెద్ది" కేవలం ఒక సినిమా కాదు.. ఇది బాక్సాఫీస్ దగ్గర ఒక యుద్ధం! మరి 'పెద్ది' నిజంగానే పుష్పరాజ్ రికార్డులను తుడిచిపెట్టగలదా? అనేది అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పక్కా మాస్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఈ 'పెద్ది'. 'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బుచ్చిబాబు సానా, ఈ కథ కోసం ఏకంగా 4 ఏళ్లు కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్ మామూలుగా లేదు. ఇప్పటికే విడుదలైన "రయ్ రయ్ రా రా" సాంగ్ మరియు గ్లింప్స్ వ్యూస్ పరంగా 'పుష్ప 2' రికార్డులను బ్రేక్ చేశాయి. ఒక్క తెలుగులోనే 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి తన సత్తా ఏంటో చూపించాడు పెద్ది.
పుష్ప 2' 10 రోజుల్లోనే 1290 కోట్లు వసూలు చేసి, లైఫ్ టైమ్ కలెక్షన్లలో 1800 కోట్లను టచ్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో 'పుష్ప' మేనియా ఓ రేంజ్‌లో ఉంది. అయితే 'పెద్ది' టీమ్ ప్లానింగ్ వేరే లెవల్లో ఉంది. ఇది ఒక ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలకు ఎప్పుడూ మాస్ ఆదరణ ఎక్కువ ఉంటుంది. 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చరణ్ చూపించిన విశ్వరూపం మనందరికీ తెలుసు. ఇప్పుడు 'పెద్ది'లో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఉంటుందని టాక్. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. 'పుష్ప 2' కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలాగైతే ప్లస్ అయ్యిందో, పెద్దికి రెహమాన్ మ్యూజిక్ గ్లోబల్ లెవల్ రీచ్ ఇస్తుంది.
పెద్ది సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్.. 'పుష్ప 2' ను నిర్మించిన వారే. కాబట్టి ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, హిందీ మార్కెట్‌లో ఎలా రిలీజ్ చేయాలి అనే విషయంలో వీరికి మాస్టర్ ప్లాన్ ఉంది. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమా రాబోతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, 'పెద్ది' సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 200 కోట్లు దాటేసింది. ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 9.5 మిలియన్ డాలర్లకు అంటే, సుమారు 40 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్. రామ్ చరణ్‌కు RRR తర్వాత నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. 'పెద్ది' గనుక అక్కడ క్లిక్ అయితే, పుష్ప 2 హిందీ వసూళ్లైన 600 కోట్లును సవాల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం వల్ల బాలీవుడ్ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ ఉంది. ఏప్రిల్ 30, 2026న 'పెద్ది' థియేటర్లలోకి రాబోతోంది. 'పుష్ప 2' రికార్డులను బ్రేక్ చేయాలంటే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు మేకింగ్, రెహమాన్ మ్యూజిక్ - ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర ఖాయం.