వారణాసి టీం నుంచి ఏదో పెద్దగా సాలిడ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేలా ఉంది. ఏదో రూమర్ కాదు.. కేవలం వార్తగా మాత్రమే చూసేవిషయ కాదు.. 1400 కోట్ల సినిమా వీషయంలో రాజమౌలఇ 10 వేల కోట్ల రూమర్ ని నిజం చేయబోతున్నాడు.. 10 వేల కోట్ల రూమర్ కనుక నిజమైతే మాత్రం, 30 వేల కోట్ల పూనకాలు వచ్చినట్టే.. అంతా ధురందర్ మాయే అనంటున్నారు. రెండు భాగాల ధురందర్ ఇప్పుడు రాజమౌళి మనసు మార్చినట్టుంది. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన వారనాసిని, మధ్యలో ఒక్కబాగంగానే తీసుకొస్తామనన్న జక్కన్న, యూ టర్న్ తీసుకుంటున్నాడా..? గ్లోబల్ ట్రాటర్, టైం ట్రాటర్ గా ఈమూవీ రెండు టైటిల్స్ లో రానుందన్న రూమరే నిజమౌతోందా..? ఇంత సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తోంది. దాన్నే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారా?
10 వేల కోట్ల రూమర్, 30 వేలకోట్ల నిజంగా మారబోతోందంటే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ పెద్ద షాక్ వేవ్ వచ్చినట్టే.. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. 1400 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తీస్తున్న వారణాసి, డబుల్ ఇంపాక్ట్ ఇవ్వటం ఇక లాంచనంగానే కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి నాలుగు గంటల నిడివితో వస్తుందన్నారు.కాని ఇప్పుడా నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఉన్నారు.. వారణాసి ఒకటి కాదు, రెండు భాగాలుగా రిలీజ్ చేయాల్సిందే న్న నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. 30 నిమిషాల రామాయణ యుద్దం ఎపిసోడ్ తోపాటు, 30 నిమిషాల టైం ట్రావెల్ ఎపిసోడ్ షూటింగ్ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మొదట్నుంచి వారణాసి ఒక మూవీగా వస్తుందా, రెండు భాగాలుగా వస్తుందా అన్న డౌట్లు డౌట్ గానే మిగిలిపోయాయి.
ఐతే రాజమౌళి కూడా ఇది ఒకే భాగంగా వస్తోందని అమెరికన్ యూ ట్యూబర్స్ కి తేల్చాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ నిర్ణయం మారేలా ఉంది. అప్పట్లో ఇది రెండు భాగాలంటే, కాదని రాజమౌళినే ఖండించాడు. నిజానికి వారణాసి గ్లోబ్ ట్రాటర్, వారణాసి టైం ట్రాటర్ ఇలా రెండు టైటిల్స్ తో రెండు భాగాలుగా రాబోతున్న సినిమా అని పెద్ద ప్రచారం జరిగింది.కాని అదేం కాదన్న రాజమౌలి, ఇప్పడు సడన్ గా మనసు మార్చుకోవటానికి 3 కారణాలున్నాయి. ఒకటి రామ రావణ యుద్దం ఎపిసోడ్, రెండోది టైం ట్రావెల్ యాక్షన్ ఎపిసోడ్ , మూడో కారణం హిందీ మూవీ ధురందర్. ఒకే సినిమా 8 గంటల డ్యూరేషన్ వస్తే, గంట కత్తిరించి, మూడున్నర గంటల నిడివితో రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. రెండూ కూడా నెలల గ్యాప్ తోనే వచ్చి వేలకోట్లు కొల్లగొట్టేస్తున్నాయి.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీ రాజమౌలఇ అప్లై చేసేలా ఉన్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్న వారనాసిని, దసరాకు మార్చేలా ఉన్నాడు..2027 దసరా కు వారణాసి గ్లోబ్ ట్రాటర్, 2028 సంక్రాంతికి వారణాసి టైం ట్రాటర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. కారణం రామాయణం సీన్, టైం ట్రావెల్ సీన్ హెవీగా రావటంటో, ఒకే సినిమాలో ఇంత కంటెంట్ చూపించటం, ఎడిట్ చేయటం కష్టమయ్యేలా ఉందట. అందుకే రిలీజ్ డేటే కాదు, రెండు భాగాలుగా మూవీని రిలీజ్ చేయాలనే ఫేట్ మార్చే డిసీజన్ కూడా తీసుకున్నాడట జక్కన్న.. దీని ఎనౌన్స్ మెంటే ఏప్రిల్ లో రావొచ్చని తెలుస్తోంది. అప్పుడే ఎందుకు ఈవిషయాన్ని ఎనౌన్స్ చేయబోతున్నారో తేలలేదు కాని, మహేశ్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం వారణసి డబుల్ ధమాకా ఇచ్చేలా ఉంది.. ఫ్యాన్స్ లోపూనకాలు లోడయ్యే టైం వచ్చినట్టుంది.