బాల్యంలో కటిక పేదరికం అనుభవించిన హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు కోటీశ్వరులు కూడా కలలు కనే లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన కార్లు, కోట్లు విలువ చేసే వాచీలు, వజ్రాలు పొదిగిన నగలు.. అసలు హార్ధిక్ పాండ్యా లైఫ్ స్టైల్ చూస్తే జల్సాలు చేసేవాళ్లు కూడా జెలసీతో చచ్చిపోతారు. గుజరాత్ టైటాన్స్‌కి 2022 సీజన్లో టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత నెల రోజుల్లో హార్ధిక్ పాండ్యా, బహిరంగంగా ఖర్చు చేసిన మొత్తం దాదాపు 20 కోట్లు....నటాశా స్ట్రాంకోవిక్తో విడాకులు తీసుకున్న హార్ధిక్ పాండ్యా, ఫిబ్రవరి 22న తన కొడుకు అగస్త్య పాండ్యాకి 4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చాడు. విడాకుల తర్వాత మాజీ భార్యకి, కొడుక్కి ఇంత ఖరీదైన కారు కొనివ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
మాజీ భార్యకి 4 కోట్ల కారు బహుమతిగా ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, నెల తిరక్కుండానే తన కోసం రూ.12 కోట్ల కారు కొన్నాడు. మార్చి 15న రూ.12 కోట్ల విలువైన ఫెర్రారి కారుని కొనుగోలు చేసి, ప్రియురాలితో కలిసి దానికి పూజలు కూడా చేశాడు.బరోడాలో పుట్టి పెరిగిన హార్ధిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ కెరీర్ ఇచ్చింది. ముంబై ఇండియన్స్‌కి 10 లక్షలతో ఆడిన హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు సీజన్‌కి రూ.16.35 కోట్లు తీసుకుంటున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్‌కి ఇటీవలే తలా 10 వేలు ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా ముంబైలో జరిగిన మ్యాచులకు పిచ్, నెట్స్, సౌకర్యాలు అందించిన స్టాఫ్‌కి ఇలా కృతజ్ఞతగా ఇలా చెక్స్ ఇచ్చాడు.
ఇలా స్టాఫ్ కోసం దాదాపు లక్షన్నర రూపాయల దాకా ఖర్చు చేశాడు. ఇది అతనికి చాలా చిన్నమొత్తమే కావచ్చు. కానీ ఎన్నో వందల కోట్లు సంపాదించినవాళ్లకి కూడా రాని ఆలోచన, హార్ధిక్ పాండ్యాకి రావడం.. ఇలా వారి కష్టాన్ని గుర్తించడం చాలా గొప్ప విషయమనీ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.తన ప్రియురాలు మహీకా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన మెర్సిండేజ్ బెంజ్ V-క్లాస్ కారుని కొనిచ్చాడు.ఇలా ఫిబ్రవరి 22 నుంచి, మార్చి 29 వరకూ 35 రోజుల్లో దాదాపు 20 కోట్ల వరకూ ఖర్చు చేశాడు హార్ధిక్ పాండ్యా. ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం, ఎన్ని కష్టాలు పడ్డామనేది ముఖ్యం కాదు ఎంత సంపాదించాం, లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేశామనేదే ముఖ్యమని హార్ధిక్ పాండ్యా లైఫ్ స్టైల్ చూసి అర్థం చేసుకోవచ్చని ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.