టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నెట్టింట వైరల్ అవుతున్న ఒక ఆసక్తికరమైన వార్త నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ బ్లాక్ మరియు విజువల్ స్టైల్‌పై అదిరిపోయే అప్డేట్స్ బయటకు వచ్చాయి. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇంటర్వెల్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాల్లోని ఇంటర్వెల్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ సినిమా కోసం నీల్ అంతకు మించిన ప్లాన్ చేస్తున్నారట.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక విమానం నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో సెట్ చేసిన ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతోందట. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సీన్‌ను చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ తనదైన స్టైల్లో చేసే ఈ విన్యాసాలు ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని టాక్.ప్రశాంత్ నీల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన సినిమాల్లో ఉండే 'డార్క్ థీమ్'. బ్లాక్ అండ్ గ్రే టోన్స్‌తో నిండిన విజువల్స్ ఆయన సిగ్నేచర్ స్టైల్. కానీ, ఎన్టీఆర్ సినిమా విషయంలో నీల్ తన పంథాను మార్చుకోబోతున్నారట.
ఈసారి ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ డార్క్ షేడ్స్‌కు భిన్నంగా వెళ్తున్నారు. ఈ సినిమాను చాలా కలర్‌ఫుల్ విజువల్స్ తో, రిచ్ కలర్ ప్యాలెట్‌తో తెరకెక్కించబోతున్నారట. దేవర' తర్వాత ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ లెవల్‌కు వెళ్లడంతో, ఈ సినిమాను కూడా పాన్-వరల్డ్ స్థాయిలో ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దుతున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మరియు ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 'డ్రాగన్' పై వస్తున్న ఈ అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విమానంలో యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆ లెవల్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషపడుతున్నారు.