భారతీయ డిజిటల్ కంటెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్లాట్‌ఫామ్ 'VerSe Innovation' తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో ఆర్థిక - కార్పొరేట్ గవర్నెర్స్ రంగాల్లో అత్యంత అనుభవజ్ఞులు అయిన ఫైనాన్షియల్ అడ్వైజర్ పీఆర్. రమేష్‌ను తమ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆయన కేవలం బోర్డు సభ్యుడిగానే కాకుండా, సంస్థ యొక్క ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు.
అపార అనుభవం :
ప్రస్తుతం పీఆర్. రమేష్ ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో కొనసాగుతున్నారు. ఆయన నియామకంతో VerSe Innovation యొక్క విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పరిణామంగా పలువురు భావిస్తున్నారు. అలాగే రమేష్ 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డును అందుకున్నారు. రమేష్ సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో సభ్యుడిగా దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
పీఆర్ రమేష్ నియామకంపై VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ సంస్థలు సుస్థిరమైన వృద్ధి సాధించాలంటే టెక్నాలజీతో పాటు బలమైన ఆర్థిక క్రమశిక్షణ ఉండాలన్నారు. రమేష్ సుదీర్ఘ అనుభవం VerSe Innovation ప్రమాణాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొత్తగా వచ్చిన రమేష్ మాట్లాడుతూ డిజిటల్ రంగంలో VerSe అద్భుతమైన విజయాలు సాధించిందని కొనియాడారు. సంస్థ మరింత వృద్ధిలోకి వచ్చేలా బాధ్యతాయుతంగా ఈ మేనేజ్మెంట్తో కలిసి పని చేసేందుకు ఆసక్తితో వెయిట్ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
ఇక VerSe Innovation ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వందల మిలియన్ల మందికి స్థానిక భాషల్లో కంటెంట్ అందిస్తోంది. ఈ సంస్థ ప్రధాన యాప్స్ డైలీహంట్ (Dailyhunt), జోష్ (Josh), మ్యాగ్జ్టర్ (Magzter), నెక్స్ వర్స్ (NexVerse.ai) కాగా... గూగుల్, మైక్రోసాఫ్ట్, సెకోయా కాపిటల్, గోల్డ్ మాన్ సాక్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో పెట్టుబడుదారులుగా ఉండడం చూస్తుంటే ఈ సంస్థ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోన్న VerSe Innovationలోకి పీఆర్ రమేష్ లాంటి దిగ్గజం ఎంట్రీతో గ్లోబల్ మార్కెట్లోకి మరింత బలంగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.