ఇరాన్ వర్సెస్ అమెరికా వార్ లో.. ఇప్పుడు సీన్ మారిపోయింది. అమెరికా కాకి, గాలి లెక్కలు తేలిపోయాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకపక్క 'ఇరాన్ పని అయిపోయింది, వాళ్ల దగ్గర 9% క్షిపణులు మాత్రమే మిగిలాయి' అని ప్రకటిస్తుంటే.. ఇరాన్ మాత్రం తన అసలు సిసలైన విశ్వరూపాన్ని చూపిస్తోంది. తాజాగా ఇరాన్ నుంచి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. 'ఇప్పటివరకు మేము వాడింది కేవలం మా పాత స్టాక్ మాత్రమే.. ఇక నుంచి అసలైన న్యూ స్టాక్ మొదలవుతుంది' అంటూ ఇరాన్ సైన్యం కొత్త క్షిపణులను రంగంలోకి దించింది. అమెరికా గుండెల్లో నిద్రపోయేలా, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ కనిపెట్టలేని ఆ కొత్త అస్త్రాలు ఏవి..? ట్రంప్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ సిద్ధం చేసిన ఆ 'మాన్స్టర్ మిస్సైల్స్' సత్తా ఏంటి..?
ఇరాన్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా జరిగిన దాడుల్లో ఇరాన్ తన పాత తరం క్షిపణులను, తక్కువ ఖరీదు గల డ్రోన్లను భారీగా వాడింది. ఎందుకు..? శత్రువుల దగ్గరున్న ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఖర్చు చేయించడానికి. ఇప్పుడు శత్రువు దగ్గర రక్షణ కవచం బలహీనపడిన వేళ.. ఇరాన్ తన అత్యంత అధునాతనమైన, 'న్యూ జనరేషన్' మిస్సైల్స్‌ను అధికారికంగా రంగంలోకి దించింది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ మిస్సైల్ లాంచర్లను ధ్వంసం చేశామని చెబుతున్నా, ఇరాన్ మాత్రం తన భూగర్భ 'మిస్సైల్ సిటీల' నుంచి అధునాతన అస్త్రాలను బయటకు తీసింది. ముఖ్యంగా ఫతా -2 మరియు ఖోర్రాంషహార్ -4 వంటి క్షిపణులు ఇప్పుడు అమెరికా స్థావరాలకు పీడకలగా మారాయి.
ఇప్పుడు ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఫతా – 2.. ఇది కేవలం మిస్సైల్ మాత్రమే కాదు, గాలిలో తన దిశను మార్చుకోగల హైపర్సోనిక్ ఆయుధం. ఇది మాక్ 15 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సెకనుకు దాదాపు 5 కిలోమీటర్లు. ప్రపంచంలో ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఆపలేదని ఇరాన్ గర్వంగా చెబుతోంది. ఖోర్రాంషహార్ – 4.. దీని రేంజ్ 2000 కిలోమీటర్ల రేంజ్.. 1.5 టన్నుల భారీ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఇది ఇజ్రాయెల్ లోని ఏ మూలనైనా క్షణాల్లో బూడిద చేయగలదు.
ఇక్కడ అసలు సిసలు బీస్ట్ ఏంటీ అంటే.. మాజియో మిస్సైల్... కొన్ని నివేదికల ప్రకారం ఇరాన్ 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఖండాంతర క్షిపణిని సిద్ధం చేసింది. ఒకవేళ ఇది నిజమైతే, అమెరికాలోని వాషింగ్టన్ లేదా న్యూయార్క్ నగరాలు నేరుగా ఇరాన్ టార్గెట్ లోకి వస్తాయి. ట్రంప్ ఏమో ఇరాన్ నావికా దళం, వాయుసేన పూర్తిగా దెబ్బతిన్నాయని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సీన్ వేరేలా ఉంది. ఇరాన్ యొక్క 'అసిమెట్రిక్ వార్ఫేర్'పద్ధతి వల్ల అమెరికా తన భారీ నౌకలను కాపాడుకోవడానికి కష్టపడుతోంది. ఇరాన్ తన క్షిపణులను మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించగలదు.
డొనాల్డ్ ట్రంప్ 'మేము త్వరలోనే ఈ యుద్ధం ముగిస్తాం' అని చెబుతున్నా.. ఇరాన్ మాత్రం 6 నెలల వరకు యుద్ధం చేయడానికి సరిపడా ఆహార మరియు యుద్ధ నిల్వలను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకపక్క 18 అమెరికా ఐటీ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్, మరోపక్క తన కొత్త క్షిపణులతో అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తోంది. ట్రంప్ చెప్పే '2-3 వారాల' గడువు ముగిసిన తర్వాత కూడా ఇరాన్ ఈ కొత్త మిస్సైల్స్ తో విరుచుకుపడితే.. అది అమెరికా చరిత్రలో ఒక ఘోరమైన ఓటమిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ట్రంప్ ముగిస్తాం అంటుంటే.. ఇరాన్ మాత్రం 'యుద్ధం ఇప్పుడే మొదలైంది' అన్నట్లుగా కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇరాన్ మిత్రపక్షాలైన హౌతీలు కూడా ఇప్పుడు కొత్త లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తో రంగంలోకి దిగడం అమెరికాకు తలనొప్పిగా మారింది.. ఇరాన్ తన దగ్గరున్న 'న్యూ స్టాక్' ను బయటకు తీయడం అంటే.. అది అగ్రరాజ్యానికి ఒక సీరియస్ వార్నింగ్. సాంకేతికతలో అమెరికా గొప్పదైనా, ఇరాన్ తన పట్టుదలతో మరియు కొత్త క్షిపణులతో యుద్ధ గతిని మార్చేలా కనిపిస్తోంది. మరి ట్రంప్ అన్నట్లు ఇరాన్ లొంగిపోతుందా? లేక ఇరాన్ కొత్త మిస్సైల్స్ ప్రపంచాన్ని కొత్త సంక్షోభంలోకి నెట్టేస్తాయా? చూడాలి.