Top Story: యుద్ధం మరో మూడు వారాలు..! త్వరలో తులం లక్షకి పడి పోవడం కాయం..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు...ప్రపంచ మార్కెట్లు షేకవుతున్నాయి. యుద్ధం ఇంకొంతకాలం కొనసాగుతుందన్న ప్రకటన...ఇన్వెస్టర్ల కొంపమంచింది. ఆరు రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ పతనమయ్యాయి.రేట్లు పడిపోతుండటంతో ఇన్వెస్టర్లు

Post Published By: dialnews
Updated : 3 April 2026, 12:50 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు...ప్రపంచ మార్కెట్లు షేకవుతున్నాయి. యుద్ధం ఇంకొంతకాలం కొనసాగుతుందన్న ప్రకటన...ఇన్వెస్టర్ల కొంపమంచింది. ఆరు రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ పతనమయ్యాయి.రేట్లు పడిపోతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపుతున్నారు.ఇరాన్‌పై రానున్న రెండు, మూడు వారాల్లో అతి భీకర దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్రంప్‌ ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని రోజులుగా క్షీణిస్తోన్న రూపాయి విలువ భారీగా బలపడింది. 105 పైసలు పెరిగి 93.65 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బంగారం ధరలు...ఆరు రోజుల తర్వాత పతనమయ్యాయి.

24 క్యారెట్ల బంగారం ధర 1530 రూపాయలు తగ్గడంతో..లక్షా 51వేల 420లు ఉంది. అదే గ్రాము 15,142 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము ₹13,880గా ఉంది. పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం...14వందలు తగ్గి...లక్షా 38వేల 800గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము ₹11,357 పలుకుతోంది.పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. రోజురోజుకు ధరలు తగ్గుముఖం పడుతుండటంతో...ఇన్వెస్టర్లు ఉపసంహరణకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ అస్థిర పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 8,331 కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు విక్రయించారు.

పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది బంగారం. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లు అన్నమాట. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్‌, బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది.

అమెరికా-ఇరాన్‌ యుద్దానికి ముందు బంగారం ధరలు జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెట్టాయి. వార్‌ మొదలయ్యాక... బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. మధ్యలో కొంత పెరిగినా...మళ్లీ తగ్గుతున్నాయి. అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర 4,138 డాలర్లకు దిగొచ్ంది. గతంలో ఈ పసిడి ధర 5000 డాలర్ల పైన పలికింది. అటు వెండి ధర 62.47 డాలర్లకు పతనమైంది. ఇక, దేశీయంగానూ ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. ఏప్రిల్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర 9.8శాతం తగ్గి రూ.1,30,300 వద్ద కొనసాగుతోంది. మే ఫ్యూచర్స్‌లో వెండి ధర 10.97శాతం పతనమై కేజీ ధర 2.01లక్షలుగా ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు యూఎస్‌ ఫెడ్, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను యథాతధంగా కొనసాగించడం కూడా ఈ లోహాల ధరల పతనానికి కారణమని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.

Published : 
  • 3 April 2026, 12:50 PM IST