పుష్పరాజ్ ఇక నుంచి.. పులిరాజ్.. ALLU ANIMAL…!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని, ఐకాన్ స్టార్ గా మార్చింది పుష్పరాజ్. ఆ ఒక్క పాత్రతో పాన్ ఇండియా లెవల్లో తనకి రెండు బ్లాక్ బస్టర్లు పడ్డాయి.. నేషనల్ అవార్డు దక్కింది. మెగాహీరోలనే తను మించిపోయాడని, అల్లు ఆర్మీ అరిచేంత, భారీ హిట్ గా మారింది పుష్పరాజ్

Post Published By: dialnews
Updated : 8 April 2026, 6:07 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని, ఐకాన్ స్టార్ గా మార్చింది పుష్పరాజ్. ఆ ఒక్క పాత్రతో పాన్ ఇండియా లెవల్లో తనకి రెండు బ్లాక్ బస్టర్లు పడ్డాయి.. నేషనల్ అవార్డు దక్కింది. మెగాహీరోలనే తను మించిపోయాడని, అల్లు ఆర్మీ అరిచేంత, భారీ హిట్ గా మారింది పుష్పరాజ్.. అలాంటి పుష్పరాజ్ ఇప్పుడు సడన్ గా పులిరాజ్ గా మారాడు.. అదే చేయి.. అవే వేళ్లు.. కాని చివర్లో భారీ గోర్లు.. పులి చేతికే, మనిషి వేళ్లొస్తే ఎలా ఉంటుందో అలా కనిపించే, విచిత్రంమైన పులి రాజా పంజా... ఇది ఆట్లి మేకింగ్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కొత్త పోస్టర్.. నిజంగానే చేతి పోస్టర్ తో అందరిని ఆలోచనల్లో పడేసింది ఆట్లీ టీం. కాకపోతే ఇది శంకర్ మేకింగ్ లో విక్రమ్ చేసిన ఐ మూవీలో పాత్రని పోలి ఉందనే కామెంట్లు వస్తున్నాయి. అందులో బీస్ట్ చేతినే ఇక్కడ వాడారా అనంటున్నారు.చేతి లుక్ తప్ప హీరో ఫైనల్ లుక్ కనిపించలేదు. కాబట్టి ఆ కామెంట్స్ నిజం అనుకోలేం.. ఐతే 800 కోట్ల ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ ని మాత్రం, ఒకే ఒక అంశంలో మెచ్చుకోవాల్సిందే.. అక్కడ ఏకంగా రాజమౌలినే దాటేశాడు.. ఏంటది? ఏకంగా రాజమౌళినే దాటేంతగా బన్నీ ఏం చేశాడు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఒక విషయంలో ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. అదే తన కొత్త సినిమా లుక్ కాని, ఏ అప్ డేట్ కాని ఇంతవరకు లీక్ కాకుండా జాగ్రత్త పడటం.. మెల్లిగా ఈ సినిమా ప్రమోషన్ ని ఊరిస్తూ మొదలు పెట్టి, హైప్ పెంచటం.. ఇదే ఇప్పుడు ప్లస్ అయ్యేలా ఉంది. అసలు ఇంతవరకు ఆట్లీ తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా టైటిల్ ఏంటో ఎవరూ గెస్ చేయలేదు.ఎక్కడా చిన్న లీకేజి లేదు.. కనీసం తన లుక్ ఎలా ఉంటుందో క్లూ కూడాలేదు. కట్ చేస్తే, తన మూవీ అప్ డేట్ రాబోతోందన్న చిన్న హింట్ వచ్చింది. వెంటనే, తన బర్త్ డేకి పష్పరాజ్ కాస్త పులిరాజ్ గా మారినట్టు ఒక బీస్ట్ చెయ్యిపోస్టర్ వచ్చేసింది. చూడ్డానిని మనిషి చేతికే పులి గోర్లు యాడ్ అయినట్టు పోస్టర్ బీస్ట్ లుక్ లో కిక్ ఇస్తోంది. అంతేకాదు, 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ అయినా, ఇంతవరకు ఈ సినిమా తాలూకు లీకేజిలేవి లేకపోవటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తమిళ డైరెక్టర్ ఆట్లీ హిందీలో షారుఖ్ తో జవాన్ మూవీ తీసి 1100 కోట్ల వసూళ్లతో చరిత్ర స్రుష్టించాడు. ఇక బన్నీ కూడా రెండు సార్లు పుష్పరాజ్ గా పాన్ ఇండియాని షేక్ చేశాడు.

కట్ చేస్తే, ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే, డెఫినెట్ గా అంచనాలు పెరగటం కామన్. కాని ప్లానింగ్ నుంచి షూటింగ్ వరకు ఎక్కడా చిన్న లీకేజి కనిపించలేదు. జనం ఎవరూఈ మూవీని పట్టించుకోవట్లేదు కాబట్టే, లీకేజి జరగలేదనే యాంటీ ఫ్యాన్స్ కౌంటర్స్ ఎలా ఉన్నా... ఇంతవరకు కనీసం ఈ మూవీ టైటిల్ ఇది అన్న క్లూ కూడా లేదు. అక్కడ టీం మాత్రం సక్సెస్ అయ్యింది.అదే వారణాసి టీం షూటింగ్ చేస్తుంటే, సీనే లీకైంది.. కల్కీ నుంచి స్పిరిట్ వరకు ప్రభాస్ ప్రతీ సినిమా టైటిల్ ముందే లీక్ అవుతూ వస్తోంది. ఇలాంటి లీకేజిలు, మాత్రం అల్లు అర్జున్ సినిమాకు జరక్క పోవటం చూస్తే,టీం ఎంత జాగ్రత్త పడుతుందో తెలుస్తోంది. ఇదే కాదు పోస్టర్ రాబోతోందని, లేదంటే హాలీవుడ్ స్డూడియోలో ప్రిపరేషన్ అని, ఇలా రకరకాలుగా సినిమా ప్రమోషన్ ని మెల్లిగా పెంచే విదానం కూడా బానే ఉంది.ఏదేమైనా శంకర్ మేకింగ్ లో విక్రమ్ చేసిన ఐ మూవీలో బీస్ట్ రోల్ ని ప్రేరణగా తీసుకున్నారో? శంకర్ శిష్యుడే ఆట్లి కాబట్టి, అలాంటి ఇన్ ఫ్లూయెన్స్ ఉందో ఏమోకాని, ఈ పోస్టర్ మాత్రం బీస్ట్ మోడ్ లోనే కనిపిస్తోంది. పుష్పరాజ్ కాస్త పులిరాజ్ గా మారాడనే రెస్పాన్స్ వస్తోంది.

Published : 
  • 8 April 2026, 6:07 PM IST