మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మీద రూమర్ల దాడి ఒకవైపు పెరిగింది. ఇలాంటి టైంలో తనతో త్రివిక్రమ్ తీయబోయే గాడ్ ఆఫ్ వార్ మూవీ మీద ఊహించని దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ కథని అల్లు అర్జున్ దగ్గరకు తీసుకెళ్లి వెన్నుపోటు పొడవబోయిన త్రివిక్రమ్ అంటూ ప్రచారం జరిగింది. ఆ వివాదం ముగిసిందనుకునేలోపు, ఈ ప్రాజెక్ట్ కి వెన్నుపోటులను మించిన కత్తిపోటులు రెడీ అయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకగంగా ఆరు గండాలను ఫేస్ చేయబోతోంది లార్డ్ ఆఫ్ కార్తికేయ మూవీ కాన్సెప్ట్... తారకాసుర వధకోసమే పుట్టిన మురుగన్ కథనే, ఫాంటసీ యాక్షన్ డ్రామాగా మార్చే పనిలో ఉన్నాడు మాటల మాంత్రికుడు.. ఇప్పుడు అక్కడే ఆరు అడ్డుగోడలు రెడీ అయ్యాయి. తెలుగు, తమిల్, కన్నడ లో కూడా ఆరు కత్తిపోట్లు రెడీ అవుతున్నాయి.. అసలు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా తీసే పోలే, ఆ సినిమా కథ బయటికొస్తే ఎలా ఉంటుంది.. అదే జరుగుతోంది? అదే జరిగేలా ఉంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసినమూవీ గాడ్ ఆఫ్ వార్. లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ఎలా తారకాసుర రాక్షసుడిని వధించాడు.. అసలు తన జర్నీ ఎలా సాగిందనే మిథాలజీని బేస్ చేసుకుని త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేశాడు. భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్దమౌతోంది. డ్రాగన్ షూటింగ్ పూర్తి కాగానే, దేవర 2 అలానే గాడ్ ఆఫ్ వార్ రెండూ ప్యార్ లల్ గా తెరకెక్కే ఛాన్స్ఉంది.అయితే ఈ లోపే 6 కత్తిపోట్లు తప్పేలా లేవు. ఎందుకంటే ఇదే కథని బేస్ చేసుకుని ఏకంగా ఆరు సినిమాలు రెడీ అవబోతున్నాయి. అందులో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్ లో కూడా ఒక సినిమా తెరకెక్కతోంది. ఇది లార్గ్ కార్తికేయుడిని బేస్ చేసుకుని తీస్తున్న మూవీనే అవటంత ఒక షాక్ అయితే, తమిళ్ లో శివ కార్తికేయ కూడా ఇదే స్టోరీ లైన్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు.
అంతేకాదు మలయాళంలో కూడా మురుగన్ ని బేస్ చేసుకుని ఒక మిథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మున్నార్ మురళీ లాంటి మూవీతో ఓటీటీని షేక్ చేసిన టొవినో థామస్ ఈ పాత్ర వేస్తున్నాడని తెలుస్తోంది. ఇక్కడ లార్డ్ సుబ్రహ్మణ్య ని బేస్ చేసుకుని సినిమా అంటే డివోషనల్ జోనర్ అని అర్ధం కాదు.. తారకా సుర వధ స్టోరీ లైన్ ని అందులో మురుగన్ హీరోయిజాన్ని బేస్ చేసుకుని, మిథలాజికికల్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారంతా..త్రివిక్రమ్ అనవసరంగా ఎన్టీఆర్ తో సినిమా అనుకుని, తర్వాత అల్లు అర్జున్ చుట్టూ తిరిగి, మ్యాన్ ఆఫ్ మాసెస్ కి వెన్నుపోటు పొడిచే సాహసం చేసి, టైం వేస్ట్ చేశాడు కాని, లేదంతే ఈ పాటికి గాడ్ ఆఫ్ వార్ షూట్ మొదలయ్యేది.. ఇది ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్. ఇప్పుడు డ్రాగన్ తో పాటు ప్యార్ లల్ గా మొదలవ్వాల్సిన గాడ్ ఆఫ్ వార్, డ్రాగన్ అయిపోయే వరకు వేయిట్ చేసే పరిస్థిలో ఉంది.
అంటే దసరా దాటాకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. ఈలోపు తెలుగులో రెండు సినిమాలు, తమిల్, మలయాళం మూవీలతో పాటు కన్నడలో ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్ కూడా రిలీజ్ కి రెడీ అవ్వొచ్చు.. మొత్తం ఆరు రకాలుగా ఒకే కథని జనాలు చూశాక, ఎన్టీఆర్ మూవీ మీద ఆసక్తి ఉంటుందా అన్న ప్రశ్న ఇక్కడు ఎదురౌతోంది.. ఐతే రామాయణం కథ అందరికి తెలిసినా, ఎందురు, ఎన్ని సార్లు ఆ కావ్యాన్ని తెరకెక్కిస్తే, అన్ని సార్లు జనం చూస్తారు.. అది కూడా క్వాలిటీ మేకింగ్ తో తీస్తే... కాబట్టి లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి మీద ఎవరెన్ని సినిమాలు తీసినా, క్వాలిటీ ఔట్ పుట్ ఎవరిస్తే వాళ్లకే కాలం కలిసొస్తుంది.. మరి ఇక్కడ అదే జరుగుతుందా చూడాలి.