Top story:పసిడి 2 లక్షలకు చేరుతుందా…? మళ్లీ పరుగులు పెడుతుందా…?

అమెరికా-ఇరాన్‌ వార్‌తో బంగారం, వెండి ధరలు...ఎప్పటికపుడు మారిపోతున్నాయి. ఇవాళ ఉన్న ధరలు...రేపు ఉండటం లేదు. ఒక రోజు పెరిగితే...మరో రోజు తగ్గుతున్నాయి. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న లోహాల ధరలు...ట్రంప్‌ సీజ్‌ ఫైర్ నిర్ణయంతో మళ్లీ భగ్గుమన్నాయి. బుధవారం వెండి ధర కిలో ఏకంగా 11 వేల మేర పెరగ్గా...బంగారం 3200 పెరిగింది.

Post Published By: dialnews
Updated : 10 April 2026, 10:21 AM IST

అమెరికా-ఇరాన్‌ వార్‌తో బంగారం, వెండి ధరలు...ఎప్పటికపుడు మారిపోతున్నాయి. ఇవాళ ఉన్న ధరలు...రేపు ఉండటం లేదు. ఒక రోజు పెరిగితే...మరో రోజు తగ్గుతున్నాయి. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న లోహాల ధరలు...ట్రంప్‌ సీజ్‌ ఫైర్ నిర్ణయంతో మళ్లీ భగ్గుమన్నాయి. బుధవారం వెండి ధర కిలో ఏకంగా 11 వేల మేర పెరగ్గా...బంగారం 3200 పెరిగింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం..లక్షా 53, 820కి చేరింది. గురువారం ఎవరు ఊహించని విధంగా పతనమైంది. 2,340 రూపాయలు తగ్గి...లక్షా 51వేల 480కి చేరింది. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని కొంటుంటారు. దీనివల్ల డిమాండ్‌ ఏర్పడి పసిడి ధరలు ఎగబాకుతుంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కుప్పకూలడం మదుపర్లకు తీవ్ర నిరాశే మిగిల్చింది. మొన్న జనవరి 29న ఔన్స్‌ పసిడి ధర అంతర్జాతీయంగా 5,595 డాలర్లు పలికింది. అంటే మన దగ్గర పది గ్రాముల బంగారం సుమారు రూ.1.75లక్షలకు చేరింది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం తలెత్తడంతో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మార్చి మధ్యలో బంగారం ధరలు దాదాపు 27శాతం మేర క్షీణించాయి.

2026లో దేశంలో పసిడికి డిమాండ్‌ 43 శాతం పెరుగుతుందని బులియన్ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు 30శాతం పైగా ఎగబాకవచ్చని...పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2లక్షలు దాటవచ్చని జోస్యం చెబుతున్నారు. అధిక ధర వల్ల చాలామంది బంగారాన్ని భౌతికరూపంలో కొనుక్కోవడానికి ఇష్టపడటం లేదు. కానీ, దాన్ని ఒక పెట్టుబడిగా ఈఎఫ్‌టీ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం నాణ్యతతో పాటు దిగుమతి సుంకాలు, పన్నురేట్లు, స్థానిక డిమాండ్‌-సప్లై కూడా ధరల నిర్ణయంపై ప్రభావం చూపుతాయి. అయితే, రెండు రోజులపాటు పెరిగిన బంగారం ధరలు...ఇవాళ అనూహ్యంగా పతనమయ్యాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో...గోల్డ్ రేట్లు క్షీణించాయి. యుద్ధం పూర్తిగా ఆగితే...డాలర్‌ విలువ దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బంగారానికి మళ్లీ డిమాండ్‌ పెరగవచ్చనే అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ నాటికి పది గ్రాముల 24 క్యారెంట్ల బంగారం...2లక్షలు దాటవచ్చని చెబుతున్నారు.

కొంతకాలంగా బంగారం ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుండటంతో సామాన్య కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు అయోమయానికి గురవుతున్నారు. అసలు పసిడి ధరలు ఉన్నపళంగా ఎందుకు పెరుగుతున్నాయి? ఆ వెంటనే ఎందుకు తగ్గుతున్నాయి ? ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కుప్పకూలడం మదుపర్లకు తీవ్ర నిరాశే మిగిల్చింది. మొన్న జనవరి 29న ఔన్స్‌ పసిడి ధర అంతర్జాతీయంగా 5,595 డాలర్లు పలికింది. అంటే మన దగ్గర పది గ్రాముల బంగారం సుమారు 1.75లక్షలకు చేరింది. యుద్ధంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హర్మూజ్‌ గుండా రవాణాకు ఇబ్బందులు ఏర్పడటంతో ముడిచమురు ధరలు పెరిగిపోయాయి. డాలర్‌ విలువ పెరగడంతో బంగారం ధరలు 12-14శాతం మేర పతనమయ్యాయి. మన దగ్గర కూడా పది గ్రాముల బంగారం ధర సుమారు 1.94లక్షల నుంచి 1.35లక్షలకు దిగివచ్చింది. ఎప్పుడైనాసరే యుద్ధం, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలితే...బంగారం ధరలు పెరగాలి. కానీ యుద్ధంతో భారీగా క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచవచ్చన్న వార్తలు వచ్చాయి. దాంతో బంగారం కంటే బాండ్లకు ఎక్కువ రిటర్న్‌ వస్తుందన్న ప్రచారంతో పసిడి తీవ్ర ఒత్తిడికి లోనై ధర కోల్పోయింది.

Published : 
  • 10 April 2026, 10:21 AM IST