మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకే ఒక్ లుక్ , ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. సన్నబడినా కూడా కండలు పెంచే పనిలో ఉణ్న ఎన్టీఆర్, లేటెస్ట్ గా వీపు బాగం కనిపించే ఫోటో వదిలాడు. వీషేప్ తో స్లిమ్ ప్యాక్ లుక్ లో తన లుక్ నిజంగా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. కేవలం తన లుక్ లో మార్పుకోసం తను తీసుకున్న గ్యాప్ మాత్రమే ఇదని తేలింది. డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వటం వెనకున్న రీజన్ అందరికి అర్దమౌతోంది. కాని ఫ్యాన్స్ మాత్రం కంప్లైంట్ చేస్తున్నారు.. ఏదో కాస్త డిసప్పాయింట్ మెంట్ ని చూపించటం కాదు, చాలా గట్టిగానే కంప్లైంట్స్ పెంచారు. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ తన లుక్ మార్చుకోవటం, వీ షేప్ లుక్ ఫోటో అప్ లోడ్ చేయటం.. ఇవన్నీ ఫ్యాన్స్ లో పూనకాలు పెంచాయి.. కాని డ్రాగన్ అప్ డేట్స్ విషయంలో ఊహించని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి... డ్రాగన్ టీం ని కంగారు పడేలా చేస్తున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ వీ షేప్ తో దిగిన ఫోటో ఇంటర్నెట్ లో వైరలైంది. ఫ్యాన్స్ లో పూనకాలకు కారణమైంది. మొన్నటి వరకు మరీ బక్కచిక్కిన ఎన్టీఆర్ లుక్స్ చూసి ఫ్యాన్స్ కంగారు పడ్డా, ఇప్పుడు మాత్రం కండలు పెంచుతూ, వీషేప్ వచ్చిన తన బాడీ లుక్ కనిపించటంతో, అంతా ఫిదా అవుతున్నారు. సో డ్రాగన్ లో స్లిమ్ లుక్కే కాదు.. మజిల్స్ తో మ్యాజిక్ చేసే లుక్ కోసం కూడా ఎన్టీఆర్ వర్కవుట్లు చేస్తున్నాడని తేలింది.మ్యాన్ ఆ ఫ్ మాసెస్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ లోకి మారే పనిలో ఉన్నాడు. 14 కిలోల వేయిట్ తగ్గి, ఫ్లాష్ బ్యాక్ లో ఉండే పాత్రకోసం ఇంతకాలం షూట్ చేశారు. అలా 40శాతం షూటింగ్ పూర్తైంది. అయితే మరో పాత్రకోసం తన లుక్ మార్చుకోవాల్సి ఉండటంతో, 50 రోజులు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మధ్య మధ్యలో మరో పాత్ర తాలూకు షూట్లుంటాయి.. కాని హీరో అవసరం తక్కువున్న సీన్లే షూట్ చేస్తూ, ఈ గ్యాప్ ని ఫిల్ చేయబోతోంది ప్రశాంత్ నీల్ టీం.
ఫైనల్ గా కండలు పెంచేందుకు ఎన్టీఆర్ తీసుకుంటున్న బ్రేక్ ఇదని తేలింది. అంతే తప్ప, కథనచ్చకో, రిపేర్లు అవసరమయ్యో షూటింగ్ ఆగలేదన్న విషయం ఇప్పుడు అందరికి అర్థమౌతోంది. అయితే ఈ విషయంలో మ్యాన్ ఆఫ్ మాస్ ఫ్యాన్స్ ,బయట జరుగుతున్న ప్రచారం ఉత్తదే అని తేలినా, మిగతా విషయాల్లో మాత్రం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి.అందులో మేయిన్ కంప్లైంట్ డ్రాగన్ అప్ డేట్.. ఇంతవరకు టైటిల్ పోస్టర్ రాలేదు. అఫీషియల్ ఫస్ట్ లుక్ లేదు. ఓ థీమ్ సాంగ్ లేదు. గ్లింప్స్ ఎప్పుడు వస్తుందనే ఎనౌన్స్ మెంట్ లేదు. ఏదో మే 20న తన బర్త్ డే కాబట్టి, డ్రాగన్ తాలూకు అప్ డేట్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాని ఆవిషయంలో కూడా ఫిల్మ్ టీం నుంచి ఎలాంటి ఉలుకు లేదు. పలుకు లేదు.
అదే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ కంప్లైంట్...జిమ్ లో ఎన్టీఆర్ తన లుక్ తాలూకు అప్ డేట్స్ ని పోస్ట్ చేయటం, ఫ్యాన్స్ కి పండగ తెచ్చేవిషయమే.. కనీసం తను ఇలాంటి అప్ డేట్స్ అయినా ఇస్తున్నాడు. కాని డ్రాగన్ టీం మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవటం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తోంది. సోషల్ మీడియాలో మెల్లిగా ఫ్యాన్స్ నుంచి హీరోకి, అలానే డ్రాగన్ దర్శక నిర్మాతలకు ప్రెజర్ పెంచే ప్రయత్నం కనిపిస్తోంది. హ్యాస్ ట్యాగ్ డ్రాగన్ అప్ డేట్ వైరలయ్యేలా ఉంది. ఈనెలాఖర్లోగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ మరింత ఊపందుకోవచ్చనిపిస్తంది. మే డే ఏదైనా ఎనైన్స్ మెంట్ వస్తే తప్ప ఈ నిరుత్సాహ జ్వాల ఆగేలా లేదు.