అవన్నీ వద్దు… అప్ డేట్ ప్లీజ్.. #వార్…!

ఎన్టీఆర్ ఫేట్ ని త్రిబుల్ ఆర్ మూవీ మారిస్తే.. పాన్ ఇండియా లెవల్లో తన ఫేట్ మీదున్న డౌట్ ని దేవరతో మార్చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. సో దేవర మూవీ తన కెరీర్ లో అంత ఇంపార్టెంట్..

Post Published By: dialnews
Updated : 16 April 2026, 7:15 PM IST

ఎన్టీఆర్ ఫేట్ ని త్రిబుల్ ఆర్ మూవీ మారిస్తే.. పాన్ ఇండియా లెవల్లో తన ఫేట్ మీదున్న డౌట్ ని దేవరతో మార్చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. సో దేవర మూవీ తన కెరీర్ లో అంత ఇంపార్టెంట్.. అలాంటి మూవీకి సీక్వెల్ ని ట్విట్టర్ రూపంలో కన్ఫామ్ చేశాడు కొరటాల శివ. డెఫినెట్ గా ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే.. కాని ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కొరటాల శివ ఇచ్చిన ట్వీట్ మీద కౌంటర్లు పెరిగాయి. ఫియర్, పవర్, రివేంజ్ అంటూ దేరవ 2 మూవీని ఎనౌన్స్ చేశాడు కొరటాల శివ. కాని ఇక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చినట్టుంది.. ఇవన్నీ వద్దు... అసలు అప్ డేట్ ఎప్పుడు చెప్పు.. ఇది చాలా మంది ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్.. ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ లాంటి ప్రకటనలేనా? పలానా టైం కి షూటింగ్ స్టార్ట్ అనో, పలానా టైంకి ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ అనో డ్రాగన్ టీం కాని, దేవర 2 విషయంలోకాని ఎలాంటి ఎనౌన్స్ మెంట్స్ లేవు. అందుకే అవన్నీ వద్దు, అప్ డేట్ ప్లీజ్ అంటున్నారు ఫ్యాన్స్..మరి దానికి రెస్పాన్స్ ఉంటుందా? వాళ్ళకు అప్ డేట్ మీదున్న డౌట్ పోతుందా? ఎప్పుడు ? ఎలా?

కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన రెండు మూవీలు బ్లాక్ బస్టర్లే. జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తే, దేవర ఏకంగా పాన్ ఇండియా లెవల్లో 670 కోట్లు రాబట్టింది. రాజమౌళి డైరెక్షన్ లో హిట్ పడ్డాక ఏ హీరో అయినా, ఆతర్వాత మూవీతో ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే అన్న సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. జక్కన్న సాయం లేకుండా పాన్ ఇండియాని ఎన్టీఆర్ షేక్ చేయొచ్చని తేలింది.ఇదంతా ఓకే, కాని ఇక్కడ సమస్య ఇది కాదు.. కొరటాల శివ పెట్టిన ట్వీట్... ఫియర్, పవర్, రివేంజ్.. అని పెట్టి యాష్ ట్యాగ్ దేవర 2 అని ట్వీట్ పోస్ట్ చేశాడు. ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూసే.. కాని ఇలాంటి ట్వీట్లు, ప్రచారాలు, పుకార్లు ఇవన్నీ చూసి.. మాటలు కాదు,ఔట్ పుట్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా అడిగే పరిస్తితి వస్తోంది. ఎంతకాలం ఇలా ఊరిస్తూ, సోషల్ మీడియాలో ప్రచారాలు ఊరేగిస్తారు.. ఇది సగటు ఎన్టీఆర్ అభిమాని ఆవేదన.

ఎప్పుడో 2027 ఏప్రిల్ లో విడుదలయ్యే వారణాసి ఆల్రెడీ కాన్సెప్ట్ గ్లింప్స్ తో షాక్ ఇచ్చింది.మోషన్ పోస్టర్, రిలీజ్ డేట్ కూడా ఫిల్మ్ టీం ఫిక్స్ చేసింది. ఇక రెండు పాటలు ఆల్రెడీ యూ ట్యూబ్ ని కుదిపేశాయి. ఫిల్మ్ టీంతో మూడు ఇంటర్వూలు ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాయి.. కాని ఇంతవరకు డ్రాగన్ టైటిలే ఇదే అనో, కాదు కాబట్టి మరొకటనో తేలలేదు.ఇప్పుడు దేవర 2 పేరుతో కొరటాల శివ ట్వీట్ చేయటం ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. ఎందుకీ ట్వీట్లు.. ఇంకెప్పుడు ఎనౌన్స్ మెంట్లు...? ఇవే సోషల్ మీడియాలో కొరటాల శివకి ఎదురౌతున్న ప్రశ్నలు... అలాని తను ఏమైనా చేస్తాడా అంటే, అంతా తన చేతిలో లేదు.. ఎన్టీఆర్ డ్రాగన్ అయ్యే వరకు మరో మూవీ చేయడు... కనీసం అలాచూస్తే దసరాకు డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.కాబట్టి అప్పుడైనా సినిమా లాంచ్ చేస్తారా? ఆ విషయాన్నైనా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో తేలుస్తారా అంటే తేల్చట్లేదు. కాబట్టే, డ్రాగన్, దేవర 2 టీమ్స్ ఏది ట్వీట్ చేసినా, ఈమధ్య సంతోషం కంటే ఫ్యాన్స్ కి ఫ్రస్ట్రేషనే వస్తోంది. మే 20కి అయినా దేవర 2 ఎనౌన్స్ మెంట్, డ్రాగన్ తాలూకు అప్ డేట్స్ రాకపోతే, మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మొదలయ్యే ఛాన్స్ఉంది. ఫిల్మ్ మేకర్లకు మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి ఉంది.

Published : 
  • 16 April 2026, 7:15 PM IST