త్రివిక్రమ్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయబోయే గాడ్ ఆఫ్ వార్ అప్ డేట్, బుల్లెట్ స్పీడ్ తో రెడి అయ్యిందా? ఈసారి ఎవరు ఆపినా, డ్రాగన్ మూవీ ప్రమోషన్ ని మరో సినిమా డైవర్ట్ చేసే చాన్స్ ఉందనే వాదన వచ్చినా... మాటలమాంత్రికుడు ఆగేలా లేడు. మైథలాజికల్ డ్రామా గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ పేలబోతోంది. కష్టమొస్తే దేవుడికి చెప్పుకునేందుకే అంతా గుడికెళతారు..అలాంటి దేవుడికే కష్టం వస్తే ఎవరొస్తారు... లార్డ్ సుబ్రహ్మణ్యనే ల్యాండ్ కాబోతున్నాడు. అది కూడా మాడ్రన్ సొసైటీకి తగ్గట్టు... ఐను కార్తికేయుడి కథ బేస్ చేసుకుని మైథలాజికల్ యాక్షణ్ డ్రామా రెడీ చేయబోతున్నాడు త్రివిక్రమ్.. ఐతే ఇది దేవుడి కథలా కాకుండా మనిషి వ్యధలా ఉండబోతోందట.. దేవుడి గుడులు వాటిని కాపాడే యోధుడి కథగా గాడ్ ఆఫ్ వార్ ఉండబోతోందని తెలుస్తోంది.. షన్ముఖుడు టైటిల్ అందరిని డైవర్ట్ చేయటానికి రిజిస్టర్ చేయించారా? ఇదే టైటిల్ తో సినిమా తీయబోతున్నారా అన్నది, 30రోజులోలో తేలబోతోంది.. డ్రాగన్ టీం బాంబు పేల్చినటైంలో, త్రివిక్రమ్ ఇంకేదో పేల్చేందుకు గట్టిగానే ప్రిపేర్ అయినట్టున్నాడు... ఇంతకి దేవుళ్లకోసమే యుద్దం చేసే షణ్ముఖుడి లుక్ ఎలా ఉండబోతోంది? ఒక్క పాత్ర కాదా? తనది ఒక్క ముఖం కాదా?
ఎన్టీఆర్ కి ఎన్ని ముఖాలు..? త్రివిక్రమ్ మూవీలో తను వేసే పాత్రకి ఎన్ని రూపాలు..? షణ్ముఖ అంటే ఆరు ముఖాలు కాబట్టి, ఆరు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తాడా? షణ్ముఖుడిగానే ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేశారా? ఇలాంటి డౌట్లన్నీంటికి మే 20న బ్రేక్ పడబోతోంది. ఆన్సర్ దొరకబోతోంది. ఆరోజు మాటల మాంత్రికుడు కూడా ఎన్టీఆర్ తో తను ప్లాన్ చేసిన సినిమా అప్ డేట్ ఇవ్వబోతున్నాడు.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కోసం భారీ అప్ డేట్ రెడీ చేయిస్తున్నాడు. అదే గాడ్ ఆఫ్ వార్ పోస్టర్... బేసిగ్గా దేవుళ్లకు కష్టమొస్తే, తారాసురుడనే రాక్షసుడిని అంతం చేసేందుకు పుడతాడు లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి. అలా దేవుల్లకోసం యుద్దం చేసిన దేవ దేవుడు కార్తికేయుడు. అదే అంశం ప్రేరణగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడు. ఎన్టీఆర్ తో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడు.
ఐతే షణ్ముఖుడు అన్న పేరు తను రిజిస్టర్ చేయించటంత, ఇదే టైటిల్ అని ప్రచారం జరిగింది. కాని నిజానికి అసలు టైటిల్ అది కాదని తెలుస్తోంది. ఎవరైనా షణ్ముఖుడు టైటిల్ ని రిజిస్టర్ చేస్తే, ఇబ్బంది అని, మురుగన్, కార్తికేయుడు, షణ్ముఖ్, షణ్ముఖుడు, షణ్ముక ఇలా ఆ పేరు ఎన్నిరకాలు గా పలకొచ్చో అన్ని రకాల పదాలను త్రివిక్రమ్ టీం రిజిస్టర్ చేయించిందట. మరెవరు ఆ పేర్లు వాడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్య ఇదని ప్రచారం జరుగుతోంది.ఐతేమురుగన్ టైటిల్ మాత్రం రిజిస్టర్ కాలేకపోవటానికి రీజన్, ఆల్రెడీ ఆ పేరు కోలీవుడ్ లో ముగ్గురు నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటమే. ఏదేమైనా షణ్ముఖుడు లో హీరో ఆరు గెటప్స్ వేస్తాడా? ఆరు పాత్రల్లో కనిపిస్తాడా అన్నది, మే 20 న తన బర్త్ డే స్పెషల్ గా ఫిల్మ్ టీం రిలీజ్ చేసే పోస్టర్ తో తేలబోతోంది. ఇక ఈమైథలాజికల్ డ్రామా మాడ్రన్ సోషల్ డ్రామాతో ముడిపడేలా సినిమా తీయబోతున్నాడట.
అంటే లార్డ్ సుబ్రహ్మణ్య మనిషిగా పుడితే, అన్యాయాలకు గురయ్యే చాలా గుడులను తానే కాపాడాల్సి వస్తే, రాక్షసుడిలాంటి మానవ మ్రుగంతో తను పోరాడే ప్రాసెస్ లో, ఒక్కసారిగా తనకి శక్తులు వస్తే.. ఇలాంటి సోషియల్ ఎలిమెంట్ కి సోషియో ఫాంటజీ ఫ్లేవర్ ని యాడ్ చేసి, కల్కీ, అరుంధతి స్టైల్లో మరుజన్మలు, అవతారాలు లాంటి అంశాన్ని యాడ్ చేశాడట. ఇది తన టీం పుణ్యమాని ఇండస్ట్రీలో బానే లీకుల రూపంలో బయటికి పొక్కుతోంది. ఐనా అదే ఫ్రీ ప్రమోషన్ గా మారుతోంది. ఏదేమైనా మే 20న గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ రావటం పక్కా అని తెలుస్తోంది.