120 కోట్ల సెట్.. సెట్ అయితే 5000 కోట్లు…!

రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ సీరియస్ మోడ్ లోకి వెళ్లేలా ఉన్నాడు. కల్కి సీక్వెల్ పనులు ఊహించనంత వేగంగా జరగటం ఒక ఎత్తైతే, 120 కోట్ల సెట్ మరో ఎత్తు... 120 కోట్లతో సెట్ అంటే, ఓ ఎబౌ మీడియం రేంజ్ మూవీలు రెండు తీయొచ్చు.

Post Published By: dialnews
Updated : 23 April 2026, 6:50 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ సీరియస్ మోడ్ లోకి వెళ్లేలా ఉన్నాడు. కల్కి సీక్వెల్ పనులు ఊహించనంత వేగంగా జరగటం ఒక ఎత్తైతే, 120 కోట్ల సెట్ మరో ఎత్తు... 120 కోట్లతో సెట్ అంటే, ఓ ఎబౌ మీడియం రేంజ్ మూవీలు రెండు తీయొచ్చు... అలాంటి ఎమౌంట్ తో ఒకే ఒక్క సెట్ వేశారంటే, ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఐతే ఇదే కల్కీ 2 మూవీ కి ఆయువు పట్టులాంటి సెట్ అవటం వల్లే, ఇంత ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి బాక్సాఫీస్ పేలిపోయేలా భారీ ఎత్తునే యాక్షన్ సీక్వెన్స్ ని ఇక్కడ ప్లాన్ చేశారట. ఇంతకి ఆ సెట్ లో ఏముంది? అంతగా ఇంటర్వెల్ బ్యాంగ్ ని ఇక్కడే ఎందుకు సెట్ చేశారు?

రెబల్ స్టార్ ప్రభాస్, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ లివింగ్ లెజెండ్ అమితాబ్ కలిసి, మైండ్ బ్లాంక్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్ కి రెడీ అయ్యారు. అందుకోసం ఫిల్మ్ టీం ఏకంగా 120 కోట్ల సెట్ రెడీ చేసింది. ఇదే కల్కీ 2 కోసం వేసిన అత్యంత ఖరీదైన సెట్. నిజానికి కల్కీ సీక్వెల్ కి ప్రాణవాయువు లాంటి సెట్ కూడా ఇదే.ఆల్ మోస్ట్ కీ యాక్షన్ సీక్వెన్స్ లు, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రి క్లైమాక్స్ ని ఇక్కడే షూట్ చేయబోతున్నారు. కర్ణుడిగా కాసేపే కనిపిస్తే 1200 కోట్లు రెబల్ వసూళ్లు వచ్చాయి... ఇక ఇదే ప్రభాస్ సినిమాలో 45 శాతం, అంటే దాదాపు గంటన్నర వరకు కనిపిస్తే, రెబల్ పూనకాలే.. వాటినే ఇంకాపెంచేందుకు, అంతకుమించేలా 120 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసి, అక్కడ, హిస్టరీని రీసెట్ చేయబోతున్నారు.

బాహుబలి తర్వాత, సలార్, కల్కీ ఈ రెండు బాక్సాఫీస్ బెండు తీశాయి. కాకపోతే బాహుబలిలా ఒక విచిత్రమైన అనుభూతిని మాత్రం కల్కీనే ఇచ్చింది. దీనికి సైఫై జోనర్, మహాభారతం ఫ్లేవర్ కలిసి రావటంతో, సినిమా స్థాయేమారిపోయింది. అందుకే అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతెందుకు 1400 కోట్లు పెట్టి తీస్తున్న వారనాసినే కల్కీ 2 భయపెట్టేలా ఉంది.ఎందుకంటే కల్కీ లో ఉన్న కొన్నిపాత్రలు, కొన్ని అంశాలు, వారణాసిలో కూడా కనిపించేలా ఉన్నాయి.. హీరో పాత్రతో అయితే చాలా పోలికలుపెడుతున్నారు.. అలా చూస్తే నాగ్ అశ్విన్ ఎంత గొప్ప కంటెంట్ ని క్రియేట్ చేశాడో తనకే తెలియదా అనేంత సీన్ కల్కీకి కనిపిస్తోంది. కాని కల్కీ 2 ముందు కల్కీ నథింగ్ అన్నంత కాన్ఫిడెంట్ గా నిర్మాత చెబుతున్నమాటలు చూస్తుంటే, అసలు కథంతా కల్కీ 2లోనే ఉందనే మాట వింటే, ఇదేదో సునామీ క్రియేట్ చేసే మూవీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే కల్కీ టైటిల్ జస్టిఫికేషన్ గా కల్కీ అవతారంగా ఎవరొస్తారు. అన్న ప్రశ్నకు కల్కీ 2లోనే సమాధానం దొరికే ఛాన్స్ఉంది. కాబట్టి, అలాంటి సినిమాకు 120 కోట్ల సెట్ ని వేసి, ఇంటర్వెల్ బ్యాంగ్ , ప్రీ క్లైమాక్స్ సీన్ లు షూట్ చేస్తున్నారంటే, ఇంకెంత హైప్ రావాలి.. అదే జరుగుతోంది. స్పిరిట్, ఫౌజీ కి బ్రేక్ వేసి మరి కల్కీ 2 షూటింగ్ వేగం పెంచటంతో, పాటు ఒక్క సెట్ కి 120 కోట్లన్న మాటే ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ని షాక్ కి గురిచేస్తోంది. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.https://www.youtube.com/watch?v=TYoMQtquhTc

 

Published : 
  • 23 April 2026, 6:50 PM IST