35 మందితో రెండు జట్లు బీసీసీఐ మాస్టర్ ప్లాన్…!

ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి టీమ్ఇండియాలో చోటు కోసం పోటీ ఎక్కువైంది. ఈ దేశవాళీ టోర్నీమెంట్​లో రాణించి అనేకమంది కుర్రాళ్లు తమ సత్తాను ప్రపంచానికి చాటుకున్నారు. దీంతో ఆయా ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 23 April 2026, 9:15 PM IST

ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి టీమ్ఇండియాలో చోటు కోసం పోటీ ఎక్కువైంది. ఈ దేశవాళీ టోర్నీమెంట్​లో రాణించి అనేకమంది కుర్రాళ్లు తమ సత్తాను ప్రపంచానికి చాటుకున్నారు. దీంతో ఆయా ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇది సెలక్టర్లకు సవాల్​గా మారింది. ఎవరిని ఎంపిక చేయాలనేది కష్టంగా మారింది. ఒక్కోసారి ఈ విషయంలో సెలక్షన్ కమిటీ పలుమార్లు విమర్శలు ఎదుర్కొంటోంది. అందుకే బీసీసీఐ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫామ్​లో ఉన్న ఆటగాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందుకే 30 నుంచి 35 మంది ఆటగాళ్లతో రెండు టీ20 జట్లు తయారు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ ఓ జాబితా తయారు చేస్తున్నందని టాక్ వినిపిస్తుంది.

దీంతో ఒకే సమయంలో మన రెండు జట్లు వేర్వేరు ప్రత్యర్థులతో ఒకేసారి బరిలో దిగవచ్చు. ఈ విధంగా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అటు అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్​లు, మరోవైపు ఆసియా గేమ్స్​ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు ఒకేసారి ఆడేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో ఒక జట్టుకు ఎప్పటిలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్​గా ఉంటాడు. ఇంకో జట్టుకు శ్రేయస్ అయ్యర్​కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్​ విండోలో భారత్​కు వెస్టిండీస్​తో టీ20 సిరీస్​ ఉంది. స్వదేశంలో విండీస్​తో టీమ్ఇండియా 5 మ్యాచ్​ల సిరీస్​ ఆడనుంది. అదే సమయంలో మరోవైపు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి.

ఈ పోటీల్లో క్రికెట్ క్రీడ కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో రెండు జట్లు ఉంటే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. ఒక జట్టు విండీస్​తో సిరీస్​కు, ఇంకో టీమ్ ఆసియా గేమ్స్​లో పాల్గొంటుంది. ఇలా రెండు జట్లను గతంలో బీసీసీఐ ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. 2022 ఆసియా క్రీడల్లో భాగంగా క్రికెట్​ను చేర్చారు. ఆ పోటీల్లో 2023 అక్టోబర్​లో మ్యాచ్​లు నిర్వహించారు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్ల జట్టు వన్డే వరల్డ్​కప్ కోసం సన్నద్దం అవుతోంది. అందుకే రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని యువ జట్టును బీసీసీఐ చైనాకు పంపింది. ఆ క్రీడల్లో సత్తా చాటిన యువ భారత్ గోల్డ్ మెడల్ సాధించింది.

Published : 
  • 23 April 2026, 9:15 PM IST