నటసింహం బాలయ్య నోరు విప్పితే, మాటలే తూటాలు.. నిజం చెప్పాలంటే, డైలాగ్ డెలివరిలో బాలయ్య రూటే సెపరేటు... తన కంటం, మాటల తూటాలు పేల్చే విదానం, రెండూ తనకి పెద్ద బలాలు... అలాంటి స్ట్రెంథ్ నే లేపేస్తున్నాడు డైరెక్టర్ కొరటలా శివ... ఔను ఇంతవరకు నటసింహం బాలయ్య నోరు మూయించే సాహసం ఎవరూ చేయలేదు.. కాని దేవర 2 ప్లాన్ చేసుకుని, సడన్ గా బాలయ్యతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళుతున్న కొరటాల శివ రిస్క్ చేస్తున్నాడు. బాలయ్య బలం, కలిసొచ్చే స్వరం రెండీంటిని సైలెంట్ గా మార్బోతున్నాడు. అంటే సౌండ్ లేకుండా సైలెన్స్ తో వయోలెన్స్ చూపిస్తాడా? ఏదైతే ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుందో, ఆ క్వాలిటీనే పక్కన పెట్టడం నిజంగా తెలివైన పనేనా? ఇంతకీ ఈ కాంబినేషన్ ఎప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది? ఏంటి కథ?
జస్ట్ ఇమాజిన్ యుద్దంలో రాజుకి బలమైన ఆయుధం కత్తైతే, అదే లేకుండా వార్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది... ఒక స్నైపర్ కి గన్ లేకపోతే ఎలా ఉంటుందో, ఒక బైక్ రేసర్ కి చేతిల బైక్ లేకపోతే ఇంకెలా ఉంటుందో.. అలా మాటల తూటాలు పేల్చే బాలయ్య అసలు మాట్లాడకుంటే ఇంకెలా ఉంటుంది.. అదే కొరటాల శివ మేకింగ్ లో జరిగేలా ఉంది.బాలయ్య అంటేనే డైలాగుల వరద... సమర సింహారెడ్డైనా, నరసింహ నాయుడైనా, లక్ష్మీనరసింహైనా, జమానా నుంచి అఖండ వరకు ఎందులో అయినా, నటసింహం డైలాగ్ విసిరితే, మాటల తూటాలా తుఫానే... అలాంటి తనతో ఒక్క డైలాగ్ చెప్పించకుండా చేయటం అంటే, మంచి స్పీకర్ కొని, దాన్ని మ్యూట్ లో పెట్టి వాడటం లాంటిదే.కొరటాల శివ ఏం తెలివి తక్కువ దర్శకుడు కాదు. ఇమ్యెచ్చూర్డ్ అంతకన్నా కాదు... ఆచార్య తప్ప తన కెరీర్ లో ఏది ఫెయిల్ కాలేదు. ఒకవైపు దేవర 2ని ఎన్టీఆర్ 2027 ఎండ్ వరకు హోల్డ్ లో ఉంచమనటంతో, ఈ గ్యాప్ లో ఏంచేయాల అన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్న తను, డెఫినెట్ గా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రాజెక్టే చేస్తాడు. మరి అలాంటి తను బాలయ్యతో మూగవాడి పాత్ర వేయిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఇది నిజంగా చాలా పెద్ద రిస్క్... పూరీ జగన్నాథ్ పవరే డైలాగ్స్.. అలాంటి తను లైగర్ లో విజయ్ దేవరకొండకి నత్తి పెట్టి సుత్తికొట్టాడు.. అంటే కలిసొచ్చే అంశం, పవర్ ఫుల్ అంశం ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేయటమో, పక్కకు పెట్టడమో చేయకూడదని లైగర్ తో తేలింది.. మరి ఇంతచూసిన కొరటాల శివ, ఎందుకు బాలయ్యతో మూగ వాడి పాత్ర వేయించే సాహసం చేస్తున్నాడు...అక్కడే ట్విస్ట్ ఉంది. సింహాలో బాలయ్య తక్కువ డైలాగ్స్ వాడాడు... నిజానికి అప్పట్లోనే ఇలా బాలయ్యని సెటిల్డ్ పాత్రలో కనిపించేలా స్క్రిప్ట్ దశలో బోయపాటికి కొరటాలే సలాహా ఇచ్చాడనే ప్రచారం ఉంది. ఇప్పడు అదే బాలయ్యతో కొరటాల శివ దర్శకుడిగా సినిమా తీస్తున్నాడంటే, అప్పట్లో అమలు చేద్దామనుకున్న ఐడయాను ఇప్పడుు ఫుల్ ఫెడ్జ్ గా వాడబోతున్నాడనే అనుకోవాల్సి వస్తుంది.
ఎప్పుడు మాటల తూటాలు పేల్చే బాలయ్య, తక్కువ తూటాలుపేల్చినా, బాక్సాపీస్ బద్దలౌతుందని, సింహాతో తేలింది. సందీప్ రెడ్డి వంగలాంటి దర్శకుడు కూడా, బాలయ్యతో మూవీ తీస్తే, డైలాగ్స్ తక్కువ, లుక్స్ అండ్ అగ్రెషన్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తా అన్నాడు. అంటే కొరటాల శివ కూడా అదేపనిచేస్తున్నట్టా?ఒక సారి కొరటాల శివ మూవీలు చూస్తే... మిర్చీ హీరో అంటే మార్పుకోరే మగాడు శ్రీమంతుడులో హీరో అంటే, ఊరిని మార్చి చూపించే మగాడు..ఇక జనతా గ్యారేజ్ లో హీరో అంటే, మారకపోతే రిపేర్లు చేసే మగాడు.అలానే భరత్ అనేనేనులో హీరో అంటే మార్పు కోసం తానే మారిపోయిన మొనగాడు.. కాబట్టి, మాట్లాడకున్నా విలన్ తో పోట్లాడే మగాడిగా బాలయ్యని చూపిస్తాడా? ఏదేమైనా మూగ పాత్ర మాత్రం బాలయ్య వేయటం కన్ఫామ్ అంటూ ప్రచారం మొదలైంది. పెరిగింది.