రూ.27 కోట్లు దండగేనా ? అట్టర్ ఫ్లాప్ అవుతున్న పంత్…!

స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ జట్టు.. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్

Post Published By: dialnews
Updated : 28 April 2026, 6:50 PM IST

స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ జట్టు.. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు పోరాడినా చివరికి ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో లక్నో వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రిషభ్ పంత్ నిర్ణయాలు, జట్టు వైఫల్యాలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సీజన్ వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో లక్నో జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ తన ధరకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన రిషభ్ పంత్.. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్‌గా కూడా జట్టును సరైన దిశలో నడిపించలేకపోతున్నాడు. ముఖ్యంగా సూపర్ ఓవర్‌లో లక్నో జట్టు కేవలం 1 పరుగు మాత్రమే చేయడం, అందులో రిషభ్ పంత్ పాత్రపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కోట్ల జీతం తీసుకుంటున్నావు ...ప్రదర్శన మాత్రం దానికి దరిదాపుల్లో కూడా లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వరుస పరాజయాలతో కుంగిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ అనంతరం భావోద్వేగంగా స్పందించాడు. జట్టుకు ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా ఓ విరామం అవసరమని రిషభ్ పంత్ అభిప్రాయపడ్డాడు.

ఈ గ్యాప్‌లో జట్టు లోపాలను సరిదిద్దుకుని, సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తామని రిషభ్ పంత్ ధీమా వ్యక్తం చేశాడు. ఒత్తిడి అనేది ఆటలో భాగమని.. అయితే దానికి పరిష్కారాలు బయట ఎక్కడో కాకుండా జట్టు లోపలే వెతుక్కోవాలని.. ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యతను గుర్తించాలని రిషభ్ పంత్ సూచించాడు. ఈ మ్యాచ్‌లో లక్నో చేసిన కొన్ని నిర్ణయాలు క్రికెట్ పండితులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ కు పంపడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై రిషభ్ పంత్ వివరణ ఇస్తూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Published : 
  • 28 April 2026, 6:50 PM IST