మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో ఉండబోయే ఒక స్పెషల్ 'ఐటమ్ సాంగ్' షూటింగ్ వీడియో నెట్టింట లీక్ అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'ఎవడు' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందులోని 'పింపుల్ డింపుల్' పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ క్రేజీ జోడీ 'పెద్ది' సినిమా కోసం వెండితెరను పంచుకోబోతున్నారు.
శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ప్యాక్ అప్’ అని పోస్ట్ చేయడంతో ఈ విషయం అధికారికంగా స్పష్టమైంది. ఈ పాటలో శృతి హాసన్ తన డ్యాన్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నారని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీక్డ్ వీడియో ప్రకారం.. చరణ్ మరియు శృతి హాసన్ ఒక మాస్ డ్యాన్స్ నంబర్ కోసం రిహార్సల్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్ పొనీ టైల్ హెయిర్ స్టైల్‌తో చాలా స్టైలిష్‌గా, రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. శృతి హాసన్ లుక్ చూస్తుంటే 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి'గా మెప్పించిన పూజా హెగ్డేను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు స్టెప్పులు సమకూరుస్తున్నారు. వీడియోలో బుచ్చిబాబు స్వయంగా వారికి సూచనలు ఇస్తూ కనిపించడం విశేషం.
ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు సత్య వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వైరల్ అవుతున్న లీక్డ్ వీడియోను చూస్తుంటే, బుచ్చిబాబు ఈసారి ఆడియన్స్‌కు ఒక పక్కా 'ఊర మాస్' ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, శృతి హాసన్ రాకతో హైప్ రెట్టింపు అయింది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ చిత్రం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.