వదిన వస్తుంది…!

నటుడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి జోష్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో, తాజాగా తన కొత్త చిత్రం 'ఎపిక్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Post Published By: dialnews
Updated : 1 May 2026, 10:54 AM IST

నటుడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి జోష్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో, తాజాగా తన కొత్త చిత్రం 'ఎపిక్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, అటు విజయ్ దేవరకొండ అభిమానుల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఈవెంట్‌లో ఎపిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక వదినను పిలుస్తున్నా అని ఆనంద్ దేవరకొండ చెప్పడంతో ఆడిటోరియం ఒక్కసారిగా ఎరప్ట్ అయింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్‌కు భారీ స్పందన లభించింది.

'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించి ఆనంద్ మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కేవలం ఒక సాధారణ ప్రేమకథ మాత్రమే కాదని, భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రయాణమని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి ఈ సినిమా కథ చాలా దగ్గరగా ఉంటుందని, ఆ అనుభవాలు ఇందులో ప్రతిబింబిస్తాయని ఆనంద్ తెలిపారు.

ప్రేమలోని సున్నితమైన అంశాలను, విడిపోవడంలోని బాధను మరియు తిరిగి కలుసుకోవడంలోని ఆనందాన్ని ఈ చిత్రం 'ఎపిక్'గా చూపిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. బేబీ' తర్వాత మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తామని హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆశాభావం వ్యక్తం చేసింది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. టీజర్ చూస్తుంటే ఇదొక కొత్త తరహా ప్రేమకథగా అనిపిస్తోంది. ఆనంద్ తన నటనతో మరోసారి మెప్పించేలా కనిపిస్తున్నారు.మరోవైపు, రష్మికను ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పిలుస్తానని ఆనంద్ అనడంతో, ఆ వేదికపై విజయ్ - రష్మికలను ఒకేసారి చూడవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ 'ఎపిక్' లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

Published : 
  • 1 May 2026, 10:54 AM IST