ప్రపంచం మరో పెను ప్రమాదం అంచున నిలబడిందా..? మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయబోతున్నాయా..? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఇరాన్ తన శత్రువులను దెబ్బకొట్టడానికి ఒక వింత, భయంకరమైన మార్గాన్ని ఎంచుకోబోతోంది. అమెరికా యుద్ధనౌకలపై దాడి చేయడానికి ఇరాన్ 'సూసైడ్ డాల్ఫిన్ల'ను సిద్ధం చేస్తోందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ మైన్-లాడెన్ డాల్ఫిన్స్ అంటే ఏమిటి..? హోర్ముజ్ జలసంధిలో ఏం జరుగుతోంది..? గత కొన్ని వారాలుగా ఇరాన్ తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల ఇరాన్ ఆయిల్ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ తీసింది. ఇరాన్ ప్రభుత్వం ఏమంటోందంటే.. ఈ ఆర్థిక దిగ్బంధనం అంటే కేవలం ఆంక్షలు మాత్రమే కాదు, ఇది అమెరికా తమపై ప్రకటించిన 'అప్రకటిత యుద్ధం'. అందుకే ఇప్పుడు ఇరాన్‌లోని హార్డ్‌లైనర్లు తీవ్రవాద భావజాలం ఉన్నవారు యుద్ధానికి సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. డాల్ఫిన్ల ద్వారా దాడి చేయడం వినడానికి వింతగా ఉన్నా, ఇది సైనిక చరిత్రలో కొత్తేమీ కాదు. ఇరాన్ తన శిక్షణ పొందిన డాల్ఫిన్లకు పేలుడు పదార్థాలను అమర్చి, వాటిని అమెరికా యుద్ధనౌకల దగ్గరకు పంపి ఆత్మహుతి దాడులు చేయించాలని భావిస్తోంది. డాల్ఫిన్లు నీటి అడుగున శబ్దం చేయకుండా వెళ్తాయి కాబట్టి, రాడార్లకు చిక్కడం చాలా కష్టం. ఈ రకమైన 'బయోలాజికల్ వెపన్స్' వాడటం ద్వారా హోర్ముజ్ జలసంధిలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది.మనుషులు తయారు చేసిన అత్యంత ఆధునిక సోనార్ సిస్టమ్స్ కూడా సముద్రపు అడుగున ఉన్న ఒక రాయికి మరియు ఒక మైన్ కి మధ్య తేడాను గుర్తించడంలో ఇబ్బంది పడతాయి. కానీ డాల్ఫిన్లు తమ 'క్లిక్' శబ్దాల ద్వారా వచ్చే ప్రతిధ్వనిని బట్టి, ఆ వస్తువు ఏ లోహంతో తయారైందో కూడా గుర్తుపట్టగలవు. సముద్రంలో ఉండే అలల శబ్దం, ఇతర చేపల శబ్దం మధ్యలో కూడా డాల్ఫిన్లు తమ లక్ష్యాన్ని కచ్చితత్వంతో వేటాడగలవు. ఇరాన్ ఈ డాల్ఫిన్లకు పేలుడు పదార్థాలు ఉన్న హార్నెస్ ను అమర్చుతుంది. డాల్ఫిన్ ఒకసారి శత్రువు షిప్పును తాకినప్పుడు లేదా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు రిమోట్ ద్వారా లేదా కాంటాక్ట్ సెన్సార్ ద్వారా బాంబు పేలేలా చేస్తారు.
డాల్ఫిన్లు సహజంగానే సముద్రంలో తిరుగుతుంటాయి కాబట్టి, అమెరికా నావికా దళం వాటిని చూడగానే అది దాడి చేయడానికి వస్తున్న 'వెపన్' అని గుర్తించడం చాలా కష్టం. ఒక చిన్న డాల్ఫిన్ 500 కిలోల యుద్ధనౌకను ముంచలేకపోవచ్చు, కానీ దాని ప్రొపెల్లర్లు లేదా సెన్సార్లను ధ్వంసం చేసి షిప్పును నిర్వీర్యం చేయగలదు. అమెరికాకు చెందిన 'నేవీ సీల్స్' వంటి స్పెషల్ ఫోర్సెస్ రహస్యంగా ఇరాన్ తీరానికి రాకుండా ఉండటానికి ఈ డాల్ఫిన్లను వాడతారు. వీటి నోటికి ఒక 'మాకర్' లేదా ట్రాకర్ అమర్చబడి ఉంటుంది.నీటి అడుగున ఎవరైనా డైవర్ కనిపిస్తే, డాల్ఫిన్ వెళ్లి వారిని గుద్ది, ఆ ట్రాకర్‌ను వారి డ్రెస్‌కు తగిలిస్తుంది. దీనివల్ల పైన ఉన్న ఇరాన్ సైనికులకు శత్రువు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. మనుషులు లేదా చిన్న రోబోలు సముద్రం అడుగున ఎక్కువ సేపు ఉండలేవు. కానీ డాల్ఫిన్లు నిమిషాల వ్యవధిలో వందల అడుగుల లోతుకు వెళ్లి, తిరిగి రాగలవు.హోర్ముజ్ జలసంధిలో కొన్ని చోట్ల నీరు చాలా లోతుగా ఉంటుంది, అక్కడ మైన్లను ప్లాంట్ చేయడానికి ఇరాన్ వీటిని 'లివింగ్ రోబోస్' లా వాడుతోంది.
సోవియట్ యూనియన్ పతనం తర్వాత, ఉక్రెయిన్ వద్ద ఉన్న 'మిలిటరీ డాల్ఫిన్ సెంటర్' ని నిర్వహించే శక్తి లేక, వారు ఆ డాల్ఫిన్లను ఇరాన్‌కు అమ్మేశారని వార్తలు ఉన్నాయి.అంటే, ఇరాన్ దగ్గర ఉన్నవి సాధారణ డాల్ఫిన్లు కావు, అవి దశాబ్దాల తరబడి యుద్ధ తంత్రాలు నేర్చుకున్న 'వారసత్వ సైనికులు'. కేవలం డాల్ఫిన్లు మాత్రమే కాదు, ఇరాన్ తన శక్తివంతమైన సబ్మెరైన్లను కూడా రంగంలోకి దించుతోంది. మరో పెద్ద ముప్పు ఏమిటంటే.. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్. ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఇవి చాలా కీలకం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ కేబుల్స్‌ను కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది.