Top story:హార్ముజ్‌లో సునామీ…! అమెరికా వార్‌ షిప్స్‌పై రష్యా టార్పెడోతో దాడి…హార్ముజ్‌లో సునామీ సృష్టిస్తున్న డెడ్లీ వెపన్…!

ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప ఇంకెక్కడా చోటు లేదు'. గల్ఫ్ దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ రాసిన లేఖలోని పవర్‌ఫుల్ వర్డ్స్ ఇవి. దీనర్థం అమెరికా సైనికులను హార్ముజ్ జలసంధి లో జలసమాధి చేసేస్తామని.

Post Published By: dialnews
Updated : 2 May 2026, 2:30 PM IST

'ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప ఇంకెక్కడా చోటు లేదు'. గల్ఫ్ దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ రాసిన లేఖలోని పవర్‌ఫుల్ వర్డ్స్ ఇవి. దీనర్థం అమెరికా సైనికులను హార్ముజ్ జలసంధి లో జలసమాధి చేసేస్తామని. ఆ తర్వాతే ఇరాన్ మాన్‌స్టర్ టార్పెడో ఒకటి తెరపైకి వచ్చింది. దాని పేరు హూట్! ఇరాన్ భాషలో భారీ తిమింగలం అని అర్ధం. ఒక్కసారి దీన్ని సంధిస్తే అమెరికా సైనికుల్ని అతి దారుణంగా వేటాడుతుందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా తర్వాత ఈ రేంజ్ డెడ్లీ టార్పెడో ఇరాన్ దగ్గరే ఉందంటున్నారు. ఇంతకూ, అసలేంటీ హూట్ రాకెట్ టార్పెడో? అమెరికా శక్తివంతమైన యుద్ధ నౌకలను నిజంగా ముంచేస్తుందా? ఇరాన్ ఇప్పుడే దీనిని ఎందుకు బయటకు తీస్తోంది? మొజ్తాబా కంటే ముందే ఇరాన్ నేవల్ కమాండర్ షహ్రామ్ ఇరానీ అమెరికాకు హార్ట్‌ఎటాక్ తెప్పించే వెపన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

ఇదొక సూపర్‌ వెపన్‌ అని ఇరాన్‌ నేవీ కమాండర్‌ తేల్చి చెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. ఇరాన్‌ చెబుతున్న ఆ రహస్య ఆయుధం హూట్‌ రాకెట్‌ టార్పెడో కావొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర గర్భంలో తుపాకీ తూటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలుచేసే ఆయుధమే ఇది. ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006 ఏప్రిల్‌లో 'గ్రేట్ ప్రాఫెట్' అనే భారీ సైనిక విన్యాసాల్లో భాగంగా దీనిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2017 మే నెలలో హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ఈ టార్పెడోను మరోసారి ప్రయోగించి పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం హూట్ రాకెట్ టార్పెడో ప్రత్యేకత. ఈ వేగం కారణంగా శత్రుదేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకెళ్లే ఆయుధాల్లో హూట్‌ సైతం ఉన్నట్లు ఇరాన్‌ చెబుతోంది.

సాధారణ టార్పెడోలు గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే, హూట్ గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది 'సూపర్ క్యావిటేషన్ అనే సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంటే, ఇది ప్రయాణించేటప్పుడు తన చుట్టూ ఒక గాలి బుడగను ఏర్పరుచుకుంటుంది. దీనివల్ల నీటి ఘర్షణ తగ్గి, రాకెట్ లాగా దూసుకుపోగలుగుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలావరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. రష్యాకు చెందిన VA-111 ష్క్వాల్ టార్పెడోను ఆధారంగా చేసుకుని ఇరాన్ దీనిని తయారు చేసిందని రక్షణ నిపుణులు భావిస్తారు. దీనిని సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన ఒక విప్లవాత్మకమైన సూపర్ క్యావిటేటింగ్ టార్పెడోగా చెబుతారు. 1990 దశకంలోనే ఈ టార్పెడో రష్యా నేవీలో చేరింది. ఇది గంటకు 370 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది.
అమెరికా వంటి దేశాల సబ్‌మెరైన్లు లేదా యుద్ధ నౌకలు దాడికి సిద్ధమైనప్పుడు, వాటిని క్షణాల్లో దెబ్బతీయడానికి రష్యా ఈ ఆయుధాన్ని వాడుతుంది. ఈ టార్పెడోకు అణు బాంబులను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది.

ఇరాన్ దగ్గరున్న హూట్‌ రాకెట్‌ టార్పెడో 200 కిలోలకుపైగా శక్తివంతమైన పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలదు. అయితే, హూట్‌ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు. అంటే ప్రయోగించిన చోటునుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలుగుతుంది. సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. నిజానికి.. హూట్‌ అ్రస్తాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఏనాడూ యుద్ధక్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహన నౌకలు, సబ్‌మెరైన్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్‌ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్‌ టార్పెడోల వేగం, శబ్దం కూడా చాలా ఎక్కువ. కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు.

అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక అబ్రహం లింకన్‌ ప్రస్తుతం ఇరాన్‌ సమీపంలోనే ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్‌ టార్పెడోతో ఢీకొట్టడం అంతసులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. హూట్‌ రాకెట్ టార్పెడోను సబ్‌మెరైన్లు, నౌకలు, స్పీడ్‌బోట్ల నుంచి కూడా ప్రయోగించేలా డిజైన్ చేశారు. అయితే, హార్ముజ్‌ వంటి ఇరుకైన జలసంధుల్లో హూట్ రాకెట్ టార్పెడో గేమ్ ఛేంజర్‌ అవుతుందనేవారూ ఉన్నారు. కానీ, ఇరాన్‌ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమాన వాహక నౌకలు హార్మూజ్‌కు దూరంగా ఉంటూ, సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఒకవేళ హూట్ టార్పెడో కనుక అమెరికా విమాన వాహక నౌకను టచ్ చేస్తే ఆ నష్టం ఊహకందని రీతిలో ఉంటుంది. మొజ్తాబా ఖమేనీ చెప్పినట్టుగా అమెరికా సైనికులు సముద్ర గర్భంలో ఉంటారు. కానీ, అది అంత ఈజీ మాత్రం కాదు.

 

Published : 
  • 2 May 2026, 2:30 PM IST