NEXT అదిరిపోయిందిగా.. సూపర్ భయం…!

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఇప్పుడు ఒక ఎగ్జైట్ మెంట్ కి , రెండు టెన్షన్స్ తోడయ్యాయి.. ఎగ్జైట్ మెంట్ ఏంటంటే, వారణాసి వరల్డ్ మార్కెట్ ని ఎలా షేక్ చేస్తుందని.. ఎంతైనా రాజమౌలి డైరెక్షన్ లో సినిమా కాబట్టి, డెఫినెట్ గా వరల్డ్ వైడ్ గా వారణాసి వసూళ్ల సునామీ తెచ్చే ఛాన్స్ఉంది.

Post Published By: dialnews
Updated : 4 May 2026, 6:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఇప్పుడు ఒక ఎగ్జైట్ మెంట్ కి , రెండు టెన్షన్స్ తోడయ్యాయి.. ఎగ్జైట్ మెంట్ ఏంటంటే, వారణాసి వరల్డ్ మార్కెట్ ని ఎలా షేక్ చేస్తుందని.. ఎంతైనా రాజమౌలి డైరెక్షన్ లో సినిమా కాబట్టి, డెఫినెట్ గా వరల్డ్ వైడ్ గా వారణాసి వసూళ్ల సునామీ తెచ్చే ఛాన్స్ఉంది. కాని ఇక్కడ మొదటి సమస్య ఏంటంటే, ఆ తర్వాతేంటి? అంత హెవీగా వారణాసి హిట్టైతే, పెరిగే ఇమేజ్ ని, మార్కెట్ ని హ్యాండిల్ చేసే సత్తా ఉన్న మరో దర్శకుడు ఎవరు? చేతిలో సుకుమార్ సినిమా ఉంది... సందీప్ రెడ్డి చెప్పిన కథ ఉండనే ఉంది.. ఇక హాలీవుడ్ నుంచి ఆఫర్ కబురు అందుతోందనే ప్రచారం జరుగుతోంది. అన్నీ మంచి శకునాలే.. కాని నెక్ట్స్ ఏంటనే ప్రశ్న ఇప్పటి నుంచే మహేశ్ ని భయపెట్టేలా ఉందా? అది కూడా చేతిలో మరో మూడు ప్రాజెక్టులు కన్ఫామ్ అయ్యాక కూడా..? ఎందుకు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారనాసి తో వరల్డ్ జర్నీ చేస్తాడని ఫ్యాన్స్ సంతోషపడొచ్చు.. తను కూడా పాన్ ఇండియాని, పాన్ వరల్డ్ మార్కెట్ ని ఒకే సినిమాతో టార్గెట్ చేస్తుండటం కలిసొస్తుండొచ్చు.. కాని ఇక్కడ సమస్య ఏంటంటే రాజమౌళి సినిమా అంటే, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేలా లార్జ్ స్కేల్ లో ఉంటుంది. మైంబ్ బ్లాంక్ చేసే విజువల్స్ తో మతిపోగొడుతుంది.అలాంటి మూవీ హిట్ అయితే, పాన్ వరల్డ్ లెవల్లో వారణాసి వసూల్ల వరదలు తెస్తే ఏంటి పరిస్థితి.. రాజమౌళికి వన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటుంది. కాబట్టి వారణాసి బ్లాక్ బస్టర్ అని అనుకోవాల్సిందే..కాని ఇక్కడ సమస్య, అమాంతం, వరల్డ్ మార్కెట్ తో పాటు సడన్ గా క్రియేట్ అయ్యే క్రేజ్ ని, ఇమేజ్ ని మహేశ్ బాబు ఎలా తట్టుకుంటాడు. ఎంత హాలీవుడ్ లుక్ ఉన్న హీరో అయినా, తన ఇమేజ్ ,మార్కెట్ తగ్గట్టు సినిమా పడాలంటే, అలాంటి కథలు, దర్శకులు దొరకాలి.

అలా ఆల్రెడీ సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లైన్లో ఉణ్నారు. దీనికి తోడు హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లొచ్చేలా ఉన్నాయి... రాజమౌళి, నెట్ల ఫ్లిక్స్ సంస్థల పుణ్యమాని హాలీవుడ్ లో మహేశ్ బాబు ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ వార్తల వరకు బానే ఉన్నాయి.. కాని ఆచరనలో ఏంట పరిస్తితి... అసలే రాజమౌళి డైరెక్షన్ లో హిట్ పడిందంటే, ఆతర్వాత ఆ హీరోకి వరుసగా ఫెల్యూర్సే దిక్కనే సెంటిమెంట్ ఉంది.ఆస్థాయిలో హీరోని నెక్ట్స్ లెవల్లో చూపిస్తే, అందులో కొంత తగ్గినా, ఆతర్వాత వచ్చే సినిమాను జనం యాక్సెప్ట్ చేయలేదు. ఇలాంటి ప్రమాధం నుంచి బయట పడాలంటే, పుష్ప మేకర్ సుకుమార్, యానిమల్ మేకర్ సందీప్ రెడ్డి రెడీ గా ఉన్నారు.

రామ్ చరణ్ మూవీ తర్వాత మహేశ్ తో జేమ్స్ బాండ్ జోనర్ లో ఓ మూవీని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి ఆల్రెడీ మహేశ్ బాబుకి కథచెప్పాడు. రెండు మూడుసార్లు ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి కూడా.కాబట్టి మంచి దర్శకులే మహేశ్ బాబు చేతిలో ఉన్నారు.. అయినా వారణాసి ఎలాంటి విద్వంసం స్రుష్టిస్తుందో ఎవరికీ తెలియదు.. కాబట్టే పాన్ వరల్డ్ మార్కెట్ ని, ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఆ రేంజ్ ని రీచ్ అయ్యేలా సందీప్, సుకుమార్ లు సినిమాలు తీయగలరా? నెక్ట్స్ ప్రాజెక్టుతో రాజమౌలి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ లానే మహేశ్ బాబు బ్రేక్ చేస్తాడా? ఈ ప్రశ్నలే చాలా కంగారు పెట్టించే క్వశ్చన్స్ ... అన్నీంటికి సమాధానం వారనాసి టీజరో, ట్రైలరో తేలుస్తుంది.. దాని ఔట్ పుట్ బట్టే, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మహేశ్ కంగారు పెరుగుతుందా? తగ్గుతుందా అన్నది తేలుతుంది.

Published : 
  • 4 May 2026, 6:50 PM IST