గాడ్ ఆఫ్ వార్.. పెన్నుతో కత్తులు నూరాడు…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ని గాడ్ ఆఫ్ మాసెస్ గా మార్చే సాహసం చేస్తున్నాడు త్రివిక్రమ్. కాకపోతే ఎన్టీఆర్ బాబాయ్ నటసింహం బాలయ్యని ఆల్రెడీ గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు. కాబట్టి గాడ్ ఆఫ్ మాసెస్ బిరుదుని మ్యాన్ ఆఫ్ మాసెస్ తీసుకునే ఛాన్స్ లేదు.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 7:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ని గాడ్ ఆఫ్ మాసెస్ గా మార్చే సాహసం చేస్తున్నాడు త్రివిక్రమ్. కాకపోతే ఎన్టీఆర్ బాబాయ్ నటసింహం బాలయ్యని ఆల్రెడీ గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు. కాబట్టి గాడ్ ఆఫ్ మాసెస్ బిరుదుని మ్యాన్ ఆఫ్ మాసెస్ తీసుకునే ఛాన్స్ లేదు. అసలు తనకిలాంటి బిరుదులే వద్దన్నాడు. అంతవరకు బానే ఉంది. ఐతే మాటల మాంత్రికుడు, తారకమంత్రానికి, తన మంత్ర దండాన్ని తోడయ్యేలా చేస్తున్నాడు. గాడ్ ఆఫ్ వార్ మూవీకోసం కత్తులని కాకుండా పెన్నుని నూరుతున్నాయి. ఫలితంగా ఆ పెన్ను రెండు ముక్కలైంది.. అంటే గాడ్ ఆఫ్ వార్ కూడా రెండు భాగాలుగా రాబోతోందా? ఆల్రెడీ దేవర రెండు భాగాలుగా ప్లాన్ చేశారు.. డ్రాగన్ రెండో భాగం కూడా ఇప్పుడే తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు షణ్ముకుడు లేదంటే మురుగన్ కాదంటే లార్డ్ సుబ్రహ్మణ్య మూవీ గాడ్ ఆఫ్ వార్ కూడా రెండు భాగాలుగా ఫిక్స్ చేశారా? సీక్వెల్ కథని ఎన్టీఆర్ కి వినిపించిన త్రివిక్రమ్ కి, అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఇది ఏడాదిగా నానుతున్న వార్తే.కాకపోతే మధ్యలో త్రివిక్రమ్ వెన్నుపోతు, ఆవెంటనే అదో వివాదంగా మారటం, తర్వాత తిరిగి ఎన్టీఆర్ గూటికే త్రివిక్రమ్ చేరటం.. ఇవన్నీ జరిగిపోయాయన్న టాక్ తర్వాత, ఇప్పుడు తీరిగ్గా షాక్ ఇస్తున్నాడు మాటల మాంత్రికుడు ఎన్టీఆర్.అదే గాడ్ ఆఫ్ వార్ డబుల్ ధమాకా...? ఇది కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం మొన్నటి వరకు వినిపించింది కాని, రెండో భాగం ఉంటుందనే కన్ఫర్ మేషన్ రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కి మాటల మాంత్రికుడు వినిపించిన మరో కథ, రెండో భాగందే అన్న లీకు, ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే వార్తే... నిజానికి గత 3 నెలల్లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ రెండు సార్లే కథా చర్చలు చేసినట్టుతెలుస్తోంది.

కేవలం కథ విషయంలో త్రివిక్రమ్ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడన్న,వివాదమే ఒక రెండు నెల్లు నడిచింది. తర్వాత అంతా కూల్ అయ్యి, ఎన్టీఆర్ నుంచి త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ రాగానే ఓవరాల్ గా కథని నెరేట్ చేసిన మాటల మాంత్రికుడు... రెండో సారి కలిసినప్పుడు మాత్రం గాడ్ ఆఫ్ వార్ సీక్వెల్ ప్లాన్ ని కూడా రివీల్ చేశాడు.. ఆ కథ కూడా ఓవరాల్ షేప్ చేసి, నెరేట్ చేశాడనంటున్నారు.విచిత్రం ఏంటంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఏం చేసినా అది రెండు భాగాలుగానే వస్తోంది.. హిందీ మూవీ వార్ 2 చేశాడు.. దేవర హిట్ తర్వాత దేవర 2 చేయబోతున్నాడు. ఇక ఒకే భాగం అనుకున్న డ్రాగన్ ని ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా మార్చాడు..

ఆఖరికి త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్ కూడా ఇప్పుడు రెండు భాగాలుగా తీస్తారంటే..ఇక మీదట ఎన్టీఆర్ ఏం చేసినా డబుల్ ఇంపాక్ట్ ఉండాల్సిందేనా..? ఎందుకంటే డ్రాగన్ లో తనేసేది రెండు పాత్రలు... సినిమా కూడా రెండు భాగాలే.. ఇక దేవరలో ఆల్రెడీ రెండు పాత్రలేసిన తను, రెండో భాగం కోసం కొరటాలకి ఏడాది తర్వాత డేట్లిస్తానన్న మాస్ ప్రామిస్ చేశాడు. ఇప్పుడు లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి కథ లోకూడా రెండు పాత్రలు వేస్తాడో లేదో, కాని రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం కన్ఫామ్ అన్న వార్తలే వస్తున్నాయి... ఆల్ మోస్ట్ అవే నిజానికి దగ్గరగా ఉన్నట్టు, ఇండస్ట్రీ టాక్ తో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి.

Published : 
  • 5 May 2026, 7:15 PM IST