మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ ఆగిపోలేదు. ఉందని మొన్నటికి మొన్న భారీగా లీకులు, ఫీలర్లు ఫ్యాన్స్ ని కూల్ చేశాయి.. కట్ చేస్తే దీన్ని నిజం చేస్తూ ఎన్టీఆరే రంగంలోకి దిగబోతున్నాడనే వార్తొచ్చింది. తన బర్త్ డే రోజు డ్రాగన్ అప్ డేట్ తోపాటు, దేవర సీక్వెల్ అప్ డేట్ ఎన్టీఆర్ నుంచే రాబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ, దేవర 2 ఆగలేదు.. అసలు ఆ సినమా విషయంలో తగ్గేదిలేదనే మాటని కొరటాల శివకి ఎన్టీఆర్ ఇచ్చేశాడని తెలుస్తోంది. ఇటు అబ్బాయ్ నుంచి ప్రామిస్ ని తీసుకున్నాకే, తన బాబాయ్ బాలయ్య తో పొలిటికల్ యాక్సన్ డ్రామాకి సిద్దమయ్యాడట. ఐతే ఎన్టీఆర్ నుంచి కొరటాల శివకి దక్కిన ఆ మాస్ ప్రామిసేంటి? మే 20న పేలబోతున్న ఆమూడు మాస్ బాంబులేంటి?
డ్రాగన్ టీం అలర్ట్ అయ్యింది... అసలైన షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి టైం దగ్గర పడుతోంది. ఐతే ఈ బర్త్ డే మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండేలా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తన బర్త్ డేకి రావాల్సిన డ్రాగన్ టీజర్ ఇప్పుడు రాబోతోంది. ఎట్ దీ సేమ్ టైం త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ అప్ డేట్ కూడా ఈనెల 20నే .అన్నీంటికంటే ముఖ్యంగా, చాలా రూమర్స్, చాలా నెగెటీవ్ ప్రచారానికి గురైన దేవర సీక్వెల్, విషయంలో అఫీషియల్ గా కన్ఫర్ మేషన్ రాబోతోంది. కొరటాల శివ కు ఎన్టీఆర్ ఇచ్చిన మాస్ ప్రామిస్ ఎక్స్ పోజ్ కాబోతోంది. ఎట్టిపరిస్థితుల్లో కూడా దేవర సీక్వెల్ దేవర 2 ఉండితీరుతుందని తను మాటిచ్చాయే, బాలయ్యతో సినిమా ప్లాన్ చేశాడట కొరటాల శివ.
ఆ ప్రామిస్ కి, నటసింహం బాలయ్య సినిమాకు డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఎప్పటి నుంచో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. కాకపోతే దేవర 2 మొదలయ్యే సరికే ఇంకా15 నెలలు పట్టేలా ఉంది. అందుకే ఈ లోపు బాలయ్యతో తను మెచ్చిన కథతో సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ. అయితే ఇదే ఇండస్ట్రీలోఅలానే పబ్లిక్ లో రాంగ్ గా వెళుతోంది.దేవర 2 ఇక లేనట్టే, అందుకే బాలయ్య మూవీతో రూట్ మార్చిన కొరటాల శివ అనే అంటున్నారంతా... నిజానికి డ్రాగన్ కథలో మార్పులు, షూటింగ్ చేసిన కంటెంట్ కి రీపేర్లు, ఇక రెండు భాగాలుగా మూవీ స్కేల్ ని పెంచటం.. ఇవన్నీకారణాలతో ఈనెల జూన్ లో అయిపోవాల్సిన డ్రాగన్, వచ్చే ఏప్రిల్ లో అయిపోయేలా ఉందట. అందుకే ఈ గ్యాప్ ని వాడుకోమని కొరటాల శివకి చెప్పిన ఎన్టీఆర్, డ్రాగన్ అయిపోగానే దేవర 2 ని పట్టాలెక్కించటమే అని ప్రామిస్ కూడా చేశాడని తెలుస్తోంది.ఇదే విషయం ప్రచారంగానో, లీకుగానో, ఫీలర్స్ గానో ఉంటే, ఫ్యాన్స్ కి రైట్ సిగ్నల్ వెల్లదు.. అందుకే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే రంగంలోకి దిగుతున్నాడు. తానే దేవర సీక్వెల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నాడు. నిజానికి తన బర్త్ డే రోజు డ్రాగన్ టీం టీజర్ రిలీజ్ చేయబోతోంది. గాడ్ ఆఫ్ వార్ తీయబోతున్న త్రివిక్రమ్ టీం, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసేపనిలో ఉంది. ఐతే దేవర 2 ఎనౌన్స్ మెంట్ ని మాత్రం ఎన్టీఆరే స్వయంగా ఇస్తానని కొరటాల శివకు మాటివ్వటం వల్లే.. ఈ ప్రామిస్ మాస్ ప్రామిస్ గా మారిందనే ప్రచారం మొదలైంది.