3 రోజుల్లో ఎనౌన్స్ మెంట్.. 8 ఏళ్ళ తర్వాత పూనకాలు…!

త్రివిక్రమ్ ఏదో బాంబ్ పేల్చినట్టు సడన్ గా ఎనౌన్స్ మెంట్ తో షాక్ ఇస్తున్నాడు. మే 20న గాడ్ ఆఫ్ వార ప్రాజెక్ట్ మీద సాలిడ్ కాన్సెప్ట్ టీజర్ వచ్చేలా ఉంది. మొత్తం సినిమా ఏం అంశంతో రాబోతోందో? రిలీజ్ డేట్ ఎన్నడు ప్లాన్ చేస్తున్నారో

Post Published By: dialnews
Updated : 8 May 2026, 6:10 PM IST

త్రివిక్రమ్ ఏదో బాంబ్ పేల్చినట్టు సడన్ గా ఎనౌన్స్ మెంట్ తో షాక్ ఇస్తున్నాడు. మే 20న గాడ్ ఆఫ్ వార ప్రాజెక్ట్ మీద సాలిడ్ కాన్సెప్ట్ టీజర్ వచ్చేలా ఉంది. మొత్తం సినిమా ఏం అంశంతో రాబోతోందో? రిలీజ్ డేట్ ఎన్నడు ప్లాన్ చేస్తున్నారో.. ఇవన్నీ మే 20న ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా ఫ్యాన్స్ కి సాలిడ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఇదే అంశం ఏదో రూమర్ లానో, గాసిప్స్ లానో కాకుండా, అఫీషియల్ గా ఉండాలని, ఈనెల 10న ఒక ఎనౌన్స్ మెంట్ ని అఫీషియల్ గా ప్లాన్ చేస్తున్నారు.అంటే అందుకు ఇంకెన్ని రోజులు లేవు.. ఈ ఆదివారమే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోందని తేలింది. ఆరోజు మే 20న ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేశారో అఫీషియల్ గా చిన్న హింట్ ఇచ్చి ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నారు. నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా అరవింద సమేత వీరరాఘవ లా ఉన్నా కూడా చాలు.. పుష్పరాజ్ ని మించిపోతుంది. మరో బాహుబలి అనిపించుకునే ఛాన్స్ఉంది. సుకుమార్, రాజమౌళిని కూడా భయపెట్టే శక్తి ఉన్న కలం త్రివిక్రమ్ సొంతం... కాని ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు తనకి... అలానే గుంటూరు కారంకూడా తన స్థాయిని పెంచలేదు.. ఇలా కూడ అనొచ్చు.. కానికరెక్ట్ కంటెంట్ పడితే, బాహుబలి, పుష్పరాజ్ ని పక్కన పెట్టే స్తాయి మూవీగా గాడ్ ఆఫ్ వార్ మారే అవకాశం ఉంది.

రాజమౌళి ఎప్పుడో అన్నాడు... టాలీవుడ్ లో సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరు మాస్ మూవీల మీద ఫోకస్ పెడితే, పూరీజగన్నాథ్,అలానే తను కూడా తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే అని... అప్పటి వరకు నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే లాంటి ప్రయోగాలతో సుకుమార్, అలవైకుంఠపురంలోలాంటి ఫ్యామిలీ డ్రామాలతో త్రివిక్రమ్ బిజీ అవుతూ వచ్చాడు.ఎన్నడూ మాస్ రూట్లో వాళ్ల అసలైన బలాన్ని ఈ ఇద్దరు దర్శకులు వాడలేదనేది రాజమౌళి అభిప్రాయం. నిజమే పుష్పరాజ్ వచ్చాకే రాజమౌళి ఎంత దూరాలోచనతో, సుకుమార్ ని కరెక్ట్ గా అంచనా వేశాడో అర్దమౌతుంది. బాహుబలి లాంటి గ్రాఫిక్స్ లేకుండా, ఏ ప్రమోషన్, హడావిడి చేయకున్న పుష్ఫరాజ్ దేశాన్నే కుదిపేసింది. పుష్ప 2 అయితే బాహుబలి 2 రికార్డునే బ్రేక్ చేసే స్థాయి వరకు వచ్చింది.

సో ఎక్స్ ట్రీమ్ ప్రయోగాలు మానేసి, కరెక్ట్ గా మాస్ కంటెంట్ మీద ఫోకస్ పెడితే, పడాల్సిన కథ పడితే, సుకుమార్ ఏకంగా బాహుబలినే మించే మూవీ తీస్తాడని పుష్పరాజ్ తో ప్రూవ్ అయ్యింది. ఇక నెక్ట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంతు... నిజం చెప్పాలంటే, ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ సినిమా తీసే విషయంలో, వెన్నుపోటని, కథని బన్నీ దగ్గరకి తీసుకెళ్లాడనే వివాదం వల్ల, అసలు ఎమోషనంతా రాంగ్ రూట్లో వెళ్లింది.ఆ వివాదం లో ఉన్న నిజానిజాలు, ఆ ఇబ్బందులు పక్కన పెడితే, త్రివిక్రమ్ ఓ మంచి రైటర్.. ఇలా అంటే చాలా మందికి, తనేం రైటర్ హాలీవుడ్ మూవీ కథలు ఎత్తిపరేస్తాడు... నవలలనుంచి మాటలు కాపీ కొడతాడు.. లాంటి కామెంట్లు, ట్రోలింగ్స్ గుర్తొస్తాయేమో... అయినా ఇది తనొక్కడి తప్పుకాదు. 100కు 90మంది దర్శకులు ఇదే పని చేశారు. చేస్తున్నారు.

ఇప్పుడంటే ఓటీటీలు, యూ ట్యూబ్ లో కంటెంట్ రీచ్ పెరగటంతో, ఎక్కడ ఎవరు ఏ కాపీ కొట్టినా పట్టుబడుతున్నారు. కాని ఒకప్పుడు నిర్మాతలు, హీరోలే దగ్గరుండి పలానా హాలీవుడ్ మూవీని ఇక్కడికి తగ్గట్టు కాపీ కొట్టేయమని అలాంటి కల్చర్ ని డెవలప్ చేశారనే అపవాదుంది.. అందులో కొంతవరకు నిజం కూడా.. ఐతే కేవలం త్రివిక్రమ్ లో కాపీ యాంగిల్ వదిలేస్తే...తను మనసు పెట్టి ఒక కథ రాసిని, లేదా ఏదైనా ఇంకొకరి పాయింట్ ని పర్ఫెక్ట్ గా తీస్తే ఎలా ఉంటుందో, తన మొదటి సినిమా నువ్వే నువ్వేచూస్తే తెలుస్తుంది. అదో చిన్న సినిమా కావొచ్చు.. కాని రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ స్క్రిప్ట్.. ఇదే కాదు సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో కొన్ని సీన్లు, మాటలు బానాల్లా గుచ్చుకుంటాయి... అంతేవిలువలని చెప్పాల్సి వస్తే, అందుకు సీన్ లో స్పేస్ లేకున్నా తీసుకుని మరి రాయటం అనేది చిన్న విషయం కాదు.

మాస్ గా ఎవరైనా రాస్తారు.. క్లాస్ గా రాయటం చాలా కష్టం... అదే చేయగలిగినోడికి, మాస్ మతిపోగొట్టేలా రాయటం చాలా తేలిక.. అందుకే అరవింద సమేత వీరరాఘవ వచ్చే వరకుతను, మాస్ యాక్షన్ ఎమోషన్ ని రాస్తే ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.. అసలు ఆ సినిమానే డబ్ చేసి హిందీలో రిలీజ్ చేసినా నార్త్ ఇండియన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేది... కాని లో క్వాలిటీ డబ్బింగ్ తో యూ ట్యూబ్ లో వదిలినా కూడా అక్కడ పేలుతోంది. సో ఇలాంటి డైరెక్టర్ కి, ఎన్టీఆర్ తో 8 ఏళ్ల తర్వాత మళ్లీ కాంబినేసన్ సెట్ అవటమే కాదు, లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి తోడవటం కూడా చాలా పెద్ద ప్లస్సేఒకవైపు డివోషన్, మరో వైపు, బాహుబలి, వారణాసిని మించేస్తుందా అనేంత మైథలాజికల్, యాక్సన్ డ్రామాకి స్పేస్.. ఇవన్నీంటికి నిజం చేస్తూ గాడ్ ఆఫ్ వార్ నవల సపోర్ట్ తీసుకోవటం చూస్తే... త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోతున్న మురుగన్ మూవీ ఏదో డివోషనల్ డ్రామా కాదు.. డివోషన్ లా కనిపించే సూపర్ మాస్ యాక్షన్ డ్రామా.. సో అదెలా ఉంటుందనేది మే 20న కాన్సెప్ట్ వీడియోతో తేల్చబోతున్నాడు త్రివిక్రమ్. ఆవిషయం ఈ సండే తేల్చేలా హింట్ ఇవ్వబోతున్నాడు.

Published : 
  • 8 May 2026, 6:10 PM IST