వారణాసి వరల్డ్ సినిమాగా రాబోతోంది. ఇండియానుంచి ఫస్ట్ ఎటమ్ట్ గా ఇదే వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసే ప్రాజెక్ట్ గా వస్తోంది. బాహుబలిచూస్తే భారీ కోటలు... భారీ యుద్దాలు.. భారీ స్కేల్ లో సెట్లు, ఎమోషన్స్... త్రిబుల్ ఆర్ వరకొస్తే.. భారీగా ఫైట్ చేసిన యోధులు.. వాళ్ల స్నేహం.. ఆ స్నేహంలో ఊహించని భారీ ద్రోహం.. ఇలా అంతా భారీగానే ఉన్నాయి... బాగా కలిసొచ్చాయి..మరి ఇలానే భారీగా వారణాసిలో ఏం ఉండబోతున్నాయి.. ఆల్రెడీ అందరికి తెలుసు.. ఇదో మైథలాజికల్ డ్రామా అని... దీనికి తోడు టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉండబోతోంది. ఐమ్యాక్స్ కెమెరాతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతమాత్రానికే వరల్డ్ ఆడియన్స్ మన మూవీ కోసం థియేటర్స్ బయట క్యూ కడతారా? అక్కడే నెంబర్ నైన్ రీసౌండ్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుని పాన్ వరల్డ్ నెం.1 గా మార్చేందుకు నెంబర్ 9 తోడుగా రాబోతోంది. ఇంతకి ఏంటా నెంబర్ నైన్.. ఆ నెంబర్ తో ఎలా మహేశ్ బాబు నెం. 1 గా మారబోతున్నాడు?
వారణాసి మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేయటం కాదు, వరల్డ్ ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అయ్యేలా చేసేందుకు రాజమౌళి 9 అస్త్రాలు వాడుతున్నాడు. ఆ తొమ్మిది వెపన్సే సూపర్ స్టార్ మహేశ్ బాబుని, పాన్ వరల్డ్ మార్కెట్ లో ఇండియా తరపున తనే, నెంబర్ 1 అనిపించేలా చేయబోతున్నాయి. నిజంగా వరల్డ్ సినిమాకు తగ్గట్టు అదే రేంజ్ లుక్స్ ఉన్న హీరో మహేశ్..అలాంటి తనకి వారణాసిలో 9 ఆయుదాలు తోడైతే, హాలీవుడ్ స్టార్స్ సరసన తన పేరు కూడా చేరేలా తొలి వరల్డ్ హిట్ తనకి పడినట్టే.. ఆల్రెడీ వారణాసి షూటింగ్ 80 శాతం వరకు పూర్తైంది... ఇలా వారణాసిని షూట్ చేస్తూ, మరోవైపు మెక్సికో, పారిస్ లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్, సినీ ఈవెంట్లకు వెళ్లి వారణాసిని ప్రమోట్ కూడా చేస్తున్నారు..
ఎంతైనా 120దేశాల్లో 100 కోట్ల మంది మన వారణాసిని చూడాలంటే, ఇందులో ఎంతో అట్రాక్టివ్ కంటెంట్ ఉండాలి.. అందుకే వరల్డ్ ఆడియన్స్ కోసం, వరల్డ్ మార్కెట్ కోసం 9 ఆయుధాలతో దండెత్తబోతున్నాడు రాజమౌళి. అందులో ముందు ఈ సినిమా కంటెంట్... హీరో పాత్ర హాలీవుడ్ మూవీ ఇండయానా జోన్స్ నుంచి ఇన్ స్పైర్ అయ్యి అలానే డిజైన్ చేశాడట రాజమౌళి.లక్కీగా హాలీవుడ్ లో ఇండయానా జోన్స్ 5 వ సీక్వెల్ తర్వాత ఆ జోనర్ లో మూవీలు రావట్లేదు.. కాబట్టి ఇండియానాజోన్స్ లవర్స్ కి వారణాసి మరో ఆల్టర్ నేటీవ్ గామారేఛాన్స్ఉంది. ఇది రెండు భాగాలుగా వస్తే, రెండో భాగానికి భారీ వరల్డ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగే ఛాన్స్ఉంది. ఇక ఇండియాన జోన్స్ లానే ఇది అండ్వెంచరస్ మూవీ అవటం, దీనికి తోడు యుగాల్లో ప్రయాణించేలా టైం ట్రావెల్ చేసే హీరోయిజం.. డెఫినెట్ గా వరల్డ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశమే..
ఇక ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్నమొదటి ఇండియన్ మూవీ అవటం, 500 కోట్ల వరకు గ్రాఫిక్స్ కే ఖర్చు చేయటం, అంటార్కిటికా మంచు ఖండంలో తెరకెక్కుతున్న ఐదో సినిమాగా రికార్డు.. వీటితో పాటు ఇంకా ఏడు ఖండాలు, ఏడు వింతలున్న ప్రాంతాల్లో వారణాసి షూటింగ్ జరుగుతుండటం... ఇవన్నీ వారణాసిని వరల్డ్ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేసే అంశాలే..ఇక ఆఫ్రికా అడవులు, ఇండియన్ ఏన్సియంట్ సిటీ కాశీ, అలానే మన రామాయణం, ఇలా మైథాలజీ టచ్ ఇలా తొమ్మిది అంశాలు, వారనాసిని వరల్డ్ మూవీగా మారుస్తున్నాయి. పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టే ప్రాజెక్ట్ అనే కాన్పిడెన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదే ఏమాత్రం వర్కవుట్ అయినా, వరల్డ్ మీడియాలో, వరల్డ్ మార్కెట్లో టాలీవుడ్ సూపర్ స్టార్ కాస్త గ్లోబల్ సూపర్ స్టార్ గా మారే ఛాన్స్ ఉంది.