రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అనిపించే సాహసం చేయించేలా ఉన్నాడు. ఇంతవరకు రాజమౌళి కూడా ప్రభాస్ ని ఆరేంజ్ లో పరిగెత్తించలేకపోయాడు. ఎంతగా బాహుబలి రెండు భాగాలు 4ఏళ్లు తీసినా, రెబల్ స్టార్ ని మాత్రం సందీప్ రెడ్డి పరుగెత్తిస్తున్నట్టు దర్శక ధీరుడి వల్ల కూడా కాలేదా? ఈ డౌట్ రావటానికి రీజన్ ఒకటే... అదే అరవై రోజు ఆపకుండా, ఎక్కడా ఆగకుండా, విలన్ ని గుద్ది గుద్ది చంపేసేందుకు ప్రభాస్ ఒప్పుకోవటమే... అసలే రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సినిమా అంటేనే, గోటిదో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు ఉంటుంది. మాస్ సీన్లు, యాక్షన్ లో వయోలెన్స్ లు అన్నీ నెవర్ బిఫోర్ అన్నట్టే ఉంటాయి. కాకపోతే ఈసారి 60రోజుల రక్తపాతం చూడమంటున్నాడు సందీప్ రెడ్డి వంగ.. ఇంతకి ఈ 60రోజులు బంపరాఫర్ ఏంటి?
రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రాజమౌళి అండ్ కో వల్లే కానిది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వల్ల జరుగుతోందనంటున్నారు. అదే ఆపకుండా 60రోజులు ప్రభాస్ లో ఒక్కరోజు బ్రేక్ లేకుండా సినిమా చేయించటం. ఇంతవరకు బాహుబలి, కల్కీ, సలార్ ఇలా ఏ మూవీ చూసుకున్నా...కంటిన్యూయస్ గా 30రోజులు షూటింగ్ చేసిన మూవీ లేదు. అసలు తనే కాదు, మరే హీరో కూడా 30రోజులకు పైనే చిన్న బ్రేక్ తీసుకోకుండా, ఒకే సినిమా షూటింగ్ చేయటం సాధ్యం అయ్యే పని కాదు. చాలా రేరెస్ట్ ఫీట్ ఇది.. అలాంటిది ఏకంగా 60రోజులు విలన్ ని రెబల్ స్టార్ గుద్ది గుద్ది గుద్ది.. చంపేస్తే ఎలా ఉంటుంది.. అది కూడా వీకెండ్స్ అని, ఫెస్టివలని బ్రేక్ తీసుకోకుండా...
వింటానికి విచిత్రం గా ఉన్నా, రెండునెలలు ఆపకుండా ఒకే యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశాడట రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అసలు రెండు నెలలు ఎందుకు బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయాలి. అందులో విలన్ వీపు విమాన మోత మోగించే ఫైట్ సీక్వెన్స్ కి రెండు నెలలు ఎందుకు? అంతగా సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేస్తున్నాడు.అచ్చంగా ఇలానే యానిమల్ లోరణ్ బీర్ కపూర్ తో ఇంటర్వెల్ భారీ ఫైట్ సీక్వెన్స్ తీశాడు. మైండ్ బ్లాంక్ చేశాడు. ట్రైలర్ లో కంటే, సినిమాలో ఈ సీక్వెన్స్ ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేసింది.అయితే ఆ సీక్వెన్స్ ని 22 రోజులు షూట్ చేసిన సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్ లో అంతుకుమించే భీబత్సం ప్లాన్ చేశాడా? ఎందుకంటే 22 రోజుల్లోల తీసిన ఫైట్ సీనే యానిమల్ లో అలా ఉంటే..
ఇక రెండు నెలలు ఆపకుండా, ఒకే యాక్షన్ సీక్వెన్స్ అంటే, అది ధురందర్ ని మించేలా బ్రూటల్ గా ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అసలే దారి తప్పిన ఫ్రస్ట్రేటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ బ్రూటల్ అయితే ఎలా ఉంటుందో ఊహించలేం.. అలాంటి పాత్రని మరింత వైల్డ్ గా చూపించేందుకు ప్లాన్ చేసిన ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే ఇలా రెండు నెలలు గ్యాప్ లేకుండా షూట్ చేయబోతోంది ఫిల్మ్ టీం. హిందీ హీరో వివేక్ ఓబేరాయ్ ఇందులో విలన్ కావటంతో, ఇక ఈరెండు నెలలు తన వీపు విమాన మోతే అవుతుందని కన్ఫామ్ అయ్యింది.